ETV Bharat / business

వాట్సాప్​లో బ్యాంకింగ్​ సేవలు కావాలా?.. ఇలా రిజిస్టర్​ చేసుకోండి! - ఎస్​బీఐ వాట్సాప్​ బ్యాంకింగ్​

సాంకేతికత అభివృద్ధి చెందడం వల్ల ఎస్​బీఐతో పాటు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి అన్ని ప్రధాన బ్యాంకులు పలు సేవలను డిజిటల్‌ విధానంలో అందుబాటులో ఉంచుతున్నాయి. తమ ఖాతాదారులకు 'వాట్సాప్‌ బ్యాంకింగ్‌' సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే వాట్సాప్‌ సేవలకు ఎలా రిజిస్ట‌ర్ చేసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.

how to register for banking services in whatsapp

author img

By

Published : Oct 9, 2022, 2:23 PM IST

Banking Services In Whatsapp : సాంకేతికత అభివృద్ధి చెందడంతో బ్యాంకులు పలు సేవలను డిజిటల్‌ విధానంలో అందిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా తమ సర్వీసులను మరింత విస్తరించే దిశగా ముందుకెళ్తున్నాయి. దీనిలో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి చేరువైన వాట్సాప్‌ ద్వారా కూడా పలు సేవలను అందుబాటులో ఉంచుతున్నాయి.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వంటి అన్ని ప్రధాన బ్యాంకులూ తమ ఖాతాదారులకు 'వాట్సాప్‌ బ్యాంకింగ్‌' సౌకర్యాన్ని అందిస్తున్నాయి. బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం, మినీ స్టేట్‌మెంట్‌, చెక్‌ స్టేటస్‌ ఎంక్వైరీ, చెక్‌బుక్‌ రిక్వెస్ట్‌, డెబిట్‌ కార్డు బ్లాకింగ్‌, రుణాలు వంటి పలు సేవలను వాట్సాప్‌ ద్వారా అందిస్తున్నాయి. ఈ సేవ‌ల‌ను పొందాలంటే ఆయా బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు ఏ విధంగా రిజిస్ట‌ర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఎస్‌బీఐ
ఎస్‌బీఐ తమ వినియోగదారులకు ఇటీవలే వాట్సాప్‌ బ్యాంకింగ్‌ సర్వీసులను ప్రారంభించింది. ఈ సర్వీసును పొందడం కోసం ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాలి. కస్టమర్లు తమ మొబైల్‌ నంబర్‌ నుంచి WAREG అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి తమ ఖాతా నంబర్‌ టైప్‌ చేసి 72089 33148 నంబర్‌కు మెసేజ్‌ చేయాలి. అయితే, మీరు బ్యాంకు వద్ద రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్‌ నంబర్‌ నుంచి మాత్రమే ఈ మెసేజీని పంపించాలని గుర్తుంచుకోండి. లేదంటే ఈ సర్వీస్‌ పొందలేరు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత బ్యాంకు వద్ద రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్‌ నంబర్‌ నుంచి +91 90226 90226కి 'Hi' అని వాట్సాప్‌ మేసేజ్‌ చేయాలి. అక్కడ ఇచ్చే సూచనలను అనుసరించి మీకు కావాల్సిన సేవను పొందవచ్చు.

పీఎన్‌బీ
బ్యాంకింగ్‌ సేవలను మరింతగా అందుబాటులో తెచ్చే ప్రయత్నంలో భాగంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) అక్టోబరు 3న వాట్సాప్‌ బ్యాంకింగ్‌ సేవలను ప్రారంభించింది. ఈ సేవలు బ్యాంకు కస్టమర్లతో పాటు నాన్-కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని బ్యాంకు తెలిపింది. ఈ సేవలను యాక్టివేట్‌ చేసుకునేందుకు వినియోగదారులు ముందుగా తమ ఫోన్‌బుక్‌లో పీఎన్‌బీ అధికారిక వాట్సాప్‌ నంబరు +91 92640 92640ను సేవ్‌ చేయాలి. తర్వాత ఈ నంబర్‌కు వాట్సాప్‌లో 'హాయ్‌/ హలో' పంపించడం ద్వారా సంభాషణను ప్రారంభించవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ
ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ కూడా వాట్సాప్‌ బ్యాంకింగ్‌ సేవలను అందిస్తోంది. 'హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చాట్ బ్యాంకింగ్' వాట్సాప్‌లోని చాట్ సేవ. ఇక్కడ కస్టమర్లందరూ 90+ సేవలు, లావాదేవీలను 24x7 పొందేందుకు చాట్ చేయవచ్చు. ఇది వాట్సాప్ ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అందిస్తున్న ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్, సురక్షిత సర్వీసు. అయితే, ఈ ఆఫర్ బ్యాంకులో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం కస్టమర్లు 70700 22222 కు వాట్సాప్‌లో 'హాయ్‌' అని చెప్పడం ద్వారా సంభాషణ ప్రారంభించవచ్చు.

ఐసీఐసీఐ
ఐసీఐసీఐ బ్యాంకు అందించే వాట్సాప్‌ సేవలను పొందడం కోసం 86400 86400కు రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్‌ నంబర్‌ ద్వారా వాట్సాప్‌ నుంచి 'హాయ్‌' అని పంపాలి. మొబైల్ స్క్రీన్‌పై సురక్షితమైన, ఇంటరాక్టివ్ మెనూ పొందడం ద్వారా సంభాషణను ప్రారంభించడానికి 95420 00030కి మిస్డ్ కాల్ కూడా ఇవ్వచ్చు. లేదా OPTIN అని టైప్‌ చేసి SMS చేయవచ్చు.

యాక్సిస్‌ బ్యాంక్‌
యాక్సిస్‌ బ్యాంకు ఖాతాదారులు కూడా వాట్సాప్‌ ద్వారా ఖాతా వివరాలు, చెక్కులు, క్రెడిట్‌ కార్డులు, టర్మ్‌ డిపాజిట్లు, రుణాలు వంటి పలు సేవలను పొందవచ్చు. నాన్‌-యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కూడా పలు ఉత్పత్తులకు దరఖాస్తు చేసుకోవచ్చు. యాక్సిస్‌ బ్యాంకు వాట్సాప్‌ సేవలను పొందేందుకు 70361 65000 నంబరుకు 'హాయ్‌' సందేశాన్ని పంపించ‌డం ద్వారా సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
వాట్సాప్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవలను 24x7 అందిస్తున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ సేవలు దేశీయ మొబైల్‌ నంబర్లకు హిందీ, ఇంగ్లీషు బాషల్లో అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన దేశాల అంతర్జాతీయ మొబైల్‌ నంబర్లతోనూ ఈ సేవలను యాక్సెస్ చేయవచ్చు. బ్యాంకు వాట్సాప్‌ బిజినెస్‌ ఖాతా నంబర్‌ 84338 88777కు రిజిస్టర్డ్‌ చేసుకున్న మొబైల్ నంబర్‌ నుంచి 'హాయ్‌' అని మెసేజ్‌ చేస్తే సరిపోతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.