ETV Bharat / business

వెహికల్‌ ఇన్సూరెన్స్ క్లెయిమ్​ సెటిల్మెంట్- ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి ?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 3:46 PM IST

How To Prevent Rejection Of Vehicle Insurance Claim : ప్రమాదాలు అనేవి ఎక్కడ, ఎప్పుడు జరుగుతాయో ఎవ్వరికి తెలియదు. అలాంటి సమయంలో వెహికల్​ ఇన్సూరెన్స్‌ ఉంటే చాలా ఉపయోగపడుతుంది. వాహనం ప్రమాదానికి గురైనప్పుడు క్లెయిమ్​ సెటిల్‌మెంట్‌ రిజెక్ట్ కాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ముఖ్యమని నిపుణులంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Prevent Rejection Of Vehicle Insurance Claim

How To Prevent Rejection Of Vehicle Insurance Claim : మ‌న దేశంలో వాహన బీమా అనేది చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన అంశం. వాహ‌నం కొనుగోలు చేసే స‌మ‌యంలో దీనికి సంబంధించిన అన్ని ప్ర‌క్రియలు జరిగిపోతాయి. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వాహనానికి ఏదైనా డ్యామేజ్‌ జరిగితే వాహన బీమా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏ మోటారు వాహ‌నానికైనా 1988 మోటారు వాహ‌న చ‌ట్టం ప్ర‌కారం థ‌ర్డ్ పార్టీ బీమాను క‌లిగి ఉండ‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే, ఇది మోటారు వాహ‌నానికి జరిగే నష్టాన్ని భర్తీ చేయలేదని.. అందువ‌ల్ల‌, స‌మ‌గ్ర మోటారు బీమా ఉండ‌టం మంచిదని నిపుణులు అంటున్నారు.

ఈ ర‌క‌మైన బీమా మీ వాహ‌నాన్ని దొంగిలించినప్పుడు, ప్ర‌కృతి వైప‌రీత్యాలు, ఏదైనా డ్యామేజీ, ఇత‌ర దుర్ఘ‌ట‌నల వ‌ల్ల‌ సంభ‌వించే మ‌ర‌ణం వంటి ప‌రిస్థితుల నుంచి రక్షణ ఇస్తుంది. ప్ర‌మాదం లేదా విప‌త్తు కార‌ణంగా మోటారు వాహనానికి నష్టం వాటిల్లితే.. పాల‌సీదారు బీమా సంస్థ‌ను క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం అభ్యర్థించొచ్చు. పాల‌సీని ఎలా కొనుగోలు చేసినా ఈ క్లెయిమ్ ప్ర‌క్రియ ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో కూడా చేయొచ్చు. అయితే వాహన బీమా క్లెయిమ్​ సెటిల్మెంట్ చేసేటప్పుడు కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రమాద సమాచారం : వాహనానికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి నష్టానికి గురైతే లేట్​ చేయకుండా బీమా సంస్థకు తెలియజేయాలి. వీలైనంత త్వరగా క్లెయిమ్​ ఫైల్ చేయండి. ఈ పని చేసేటప్పుడు నిర్ణీత సమయం దాటితే క్లెయిమ్​ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో క్లెయిమ్​ చేస్తే సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఫోటోల‌ను తీసి వీడియోగా త‌యారు చేసుకోవ‌డం మంచిది. క్లెయిమ్ స‌మ‌యంలో బీమా సంస్థ వీటిని కోరొచ్చు.

బైక్, కార్ ఇన్సూరెన్స్​ రెన్యువల్​ మర్చిపోయారా? ఇలా చేయండి!

నెట్వర్క్ గ్యారేజ్ : ఒక‌సారి ప్ర‌మాద స‌మాచారం అందించిన త‌ర్వాత‌ బీమా కంపెనీ నిర్దేశించిన విధంగా దెబ్బ‌తిన్న కారుని స‌మీపంలోని నెట్‌వ‌ర్క్ గ్యారేజీకి తీసుకెళ్లొచ్చు. అక్కడ క్లెయిమ్​ సెటిల్మెంట్ దరఖాస్తు ఫారంను తీసుకొని ఫిల్‌ చేయాలి. వాహనానికి ఎంత వరకు నష్టం జరిగిందని అంచనా వేయడానికి బీమా సంస్థ ఒక సర్వేయర్‌ను నియమిస్తుంది. చివరిగా మీరు సర్వీస్ స్టేషన్ నుంచి రిపేర్ రసీదు పత్రాన్ని తీసుకోవాలి.

ప్రమాద రుజువు : క్లెయిమ్ కోసం రీయింబ‌ర్స్‌మెంట్ పొంద‌డానికి వాహ‌నానికి జ‌రిగిన న‌ష్టాన్ని ఫోటోగ్రాఫ్‌ల రూపంలో సాక్ష్యం సేక‌రించ‌డం చాలా అవ‌స‌రం. అలాగే ప్ర‌మేయం ఉన్న ఇత‌ర వ్య‌క్తులు, సాక్షుల పేర్లు, సంప్ర‌దింపుల వివ‌రాల‌ను రికార్డు చేయండి. ఈ స‌మాచారం ప్ర‌మాదాన్ని ధ్రువీక‌రిస్తుంది. ప‌రిహారం స‌మ‌యంలో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పోలీసు ఎఫ్ఐఆర్ కాపీ కూడా బీమా సంస్థ‌కు స‌మ‌ర్పించాలి. వాహ‌నం క‌న‌ప‌డ‌కుండా పోతే పోలీసు అధికారుల నుంచి ‘నో-ట్రేస్ స‌ర్టిఫికెట్’ పొందాలి.

అబద్ధాలు చెప్పకూడదు : ఒకవేళ మీ వెహికల్‌ దెబ్బతిని క్లెయిమ్​ సెటిల్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసేటప్పుడు కానీ, ఇతర క్లెయిమ్​ సెటిల్‌మెంట్‌లు చేసేటప్పుడు బీమా సంస్థ వద్ద వాస్తవాలు దాయకూడదు. అబద్ధాలు చెబితే మోసంగా పరిగణిస్తారు. దీంతో కంపెనీ క్లెయిమ్​ రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి. అలాగే వాహనానికి జరిగిన ప్రతీ చిన్న నష్టానికి క్లెయిమ్​ చేయకపోవడమే మేలు. ఎందుకంటే క్లెయిమ్​ చేసిన మరుసటి ఏడాది రెన్యువల్ ప్రీమియం 'నో క్లెయిమ్​ బోనస్' (ఎన్సీబీ) కోల్పోవచ్చు.

పాల‌సీ పత్రాన్ని పూర్తిగా చ‌ద‌వండి: క్లెయిమ్ కోసం ఫైల్ చేస్తున్న‌ప్పుడు, సెటిల్‌మెంట్ ప్ర‌క్రియ‌, క‌వ‌రేజీ ప‌రిధి లాంటి వాటిని అర్థం చేసుకోవ‌డానికి పాల‌సీ పత్రాన్ని జాగ్ర‌త్త‌గా చ‌ద‌వండి.

ఇవి గుర్తుంచుకోండి : ప్రమాద సంఘటన జరిగిన తర్వాత థర్డ్ పార్టీతో అనధికారికంగా రాజీ పడడం, చెల్లని డ్రైవింగ్‌ లైసెన్స్‌తో లేదా మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం లాంటివి చేయకూడదు. అంతేకాకుండా, బీమా పాలసీ గడువు ముగిసినా కూడా క్లెయిమ్​ను బీమా కంపెనీ తిరస్కరిస్తుంది.

Vehicle Insurance Renewal Tips : వెహికల్​ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేస్తున్నారా?.. ఈ విషయాలు గుర్తుంచుకోండి!

మీ కారు వర్షపు నీటిలో మునిగిందా? ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ చేసుకోండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.