ETV Bharat / business

మాట్లాడితే మోసపోవడమే! సైబర్​ కేటుగాళ్లతో జాగ్రత్త గురూ!! - సైబర్​ సెక్యూరిటీ

Cyber attack precautions: తలుపులు బద్దలు కొట్టాల్సిన పనిలేదు.. గోడలకు కన్నమేయాల్సిన అవసరం లేదు.. కాలు బయటపెట్టకుండానే కావాల్సినంత దోచుకునే వెసులుబాటు.. కాస్త కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండటమే అర్హత.. నాలుగు ముక్కలు మాట్లాడి బురిడీ కొట్టించగలిగితే అదే ఆయుధం.. అందుకే సైబర్‌ నేరస్థులు చెలరేగిపోతున్నారు. నగరం, గ్రామీణం తేడా లేకుండా రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. అజాగ్రత్తగా ఉంటే కష్టార్జితం మన కళ్ల ముందే మాయమవుతుంది. ఇటీవలి కాలంలో జరుగుతున్న సైబర్‌ నేరాల తీరుతెన్నులు.. వాటి నుంచి ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..

d
d
author img

By

Published : May 27, 2022, 2:30 PM IST

Cyber attack precautions: మిత్రుడు ఆపదలో ఉన్నాడనే సందేశం వస్తుంది.. ఆందోళనతో అడిగినంత డబ్బు పంపించేస్తాం.. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపిస్తారు.. వారు అడిగిన వివరాలు అందిస్తాం. పాలసీ నుంచి డబ్బు రావాలని చెబుతాం.. క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేసేస్తాం.. మోసాలు జరుగుతున్నాయని తెలిసినా.. ఆ క్షణంలో ఏదీ ఆలోచించకుండా మోసగాళ్లు చెప్పినట్లు వినేస్తాం. అవగాహన, అప్రమత్తత.. ఇదే మన డబ్బును కాపాడుకునేందుకు ఇవే రక్షణ.

ఆకర్షణీయమైన లాభాల ఎర

ఇదీ మోసం : ప్రముఖ స్థిరాస్తి కంపెనీలు లేదా బిట్‌ కాయిన్లలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని సైబర్‌ నేరస్థులు అదే పనిగా ఫోన్‌ చేస్తుంటారు. సంక్షిప్త సందేశాలు పంపిస్తారు. ఏడాదిలోనే 50 శాతం వరకూ రాబడి రాబట్టుకోవచ్చని వల విసురుతారు. సామాజిక వేదికల గ్రూపుల్లో మన నెంబరును చేరుస్తారు. అక్కడా ఇదే తరహాలో ప్రచారం చేస్తారు. వాటిల్లో చాలావరకూ ఈ మోసగాళ్ల సంబంధీకులే ఉంటారు. తామూ పెట్టుబడులు పెట్టి, భారీగా ఆర్జించామని ఊదరగొడతారు. గ్రూపులోని ఫోన్‌ నెంబర్లకు ఫోన్‌ చేసి అడిగినా పెద్ద మొత్తంలో లాభాలొచ్చాయని చెబుతారు.

ఇదిగో జాగ్రత్త: ప్రముఖ కంపెనీలేవీ ఇలా నేరుగా పెట్టుబడిదారులకు ఫోన్లు చేయవు. మన ప్రమేయం లేకుండానే అపరిచితులు వాట్సాప్‌ గ్రూపుల్లో మన నంబర్‌ను చేర్చకుండా ఉండాలంటే సెట్టింగ్‌లను మార్చుకోవాలి. 'అకౌంట్‌- ప్రైవసీ- గ్రూప్స్‌' ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలి. ‘హు కెన్‌ యాడ్‌ మీ టు గ్రూప్స్‌’ ఆప్షన్‌లోకి వెళ్లాలి. 'మై కాంటాక్ట్స్‌ లేదా మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌..' ఆప్షన్‌లో నచ్చిన నంబర్లను ఎంపిక చేసుకోవాలి.

తక్షణ రుణ యాప్‌లతో కవ్వింపు

ఇదీ మోసం : ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్‌ నిర్వాహకులు సామాజిక మాధ్యమ ఖాతాలకు లింక్‌లు పంపిస్తుంటారు. అవసరమైన వారికి తక్షణం రుణ సదుపాయం ఇస్తామని ఆశ పెడతారు. ఎలాంటి హామీ అవసరం లేదని కవ్విస్తారు. కేవలం సెల్‌ఫోన్‌లో వివరాలు నమోదు చేస్తే చాలు రుణం మంజూరవుతుందంటారు. ఆ మాటల్లో పడితే అంతే సంగతులు. రుణం మంజూరు చేసేందుకు సెల్‌ఫోన్‌లో కొన్ని అనుమతులు కావాలంటారు. అందుకోసం తాము పంపే లింకుల్ని ఇన్‌స్టాల్‌ చేసుకోమంటారు. అలా చేస్తే చాలు ఫోన్‌ వారి వశమైపోతుంది. ఫోన్‌లో కాంటాక్టు నంబర్లు, చిత్రాలు, వీడియోలను సేకరిస్తారు. తర్వాత నుంచి వేధింపులు మొదలవుతాయి. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఫోన్‌లోని మహిళల చిత్రాలను మార్ఫింగ్‌ ద్వారా నగ్నంగా మార్చి అంతర్జాలంలో పెడతామనే బెదిరింపులకు పాల్పడతారు.

ఇదిగో జాగ్రత్త : రుణాలిస్తామని వచ్చే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దు. అసలైన రుణసంస్థలేవీ ఇలా లింక్‌లు పంపి ఎలాంటి ధ్రువపత్రాలు తీసుకోకుండా ఆన్‌లైన్‌లోనే రుణాలు మంజూరు చేయవని గుర్తించాలి.

వీడియోకాల్స్‌తో వలపు వల

ఇదీ మోసం: ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఎంత సాధారణమో.. ఆ ఫోన్‌లో పలు మెసేజింగ్‌ యాప్‌లూ అంతే సాధారణమైపోయింది. వీటినే సైబర్‌ నేరస్థులు ఆయుధాలుగా వాడుకుంటున్నారు. అమ్మాయిలతో వీడియోకాల్స్‌ చేయిస్తున్నారు. మాట్లాడుతున్నట్లు నటిస్తూ.. రహస్యంగా వీడియోను రికార్డు చేస్తున్నారు. ఆ వీడియోల్ని బాధితులకే తిరిగి పంపి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరిస్తున్నారు. డబ్బు ముట్టజెప్పినా వేధింపులు ఆగడం లేదు.

ఇదిగో జాగ్రత్త : అపరిచితుల వీడియోకాల్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించొద్దు. అనుకోకుండా స్పందించినా అవతలివైపు అమ్మాయిలు గనక మాట్లాడుతుంటే సందేహించాలి. మాటల్లో తేడా ఉంటే.. ఫోన్‌ కట్‌ చేసి ఆ నంబర్‌ను బ్లాక్‌ చేయాలి.

నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలతో మోసం

ఇదీ మోసం : ఫేస్‌బుక్‌ ఖాతాలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న మోసాలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. ప్రముఖుల ఫేస్‌బుక్‌ ఖాతాలను ఎంచుకుంటున్న నేరస్థులు.. వారి పేర్లతోనే నకిలీ ఖాతాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ఖాతాల్లోని ఫ్రెండ్స్‌ జాబితాలో ఉండేవారికి తొలుత ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తున్నారు. యాక్సెప్ట్‌ చేస్తే రంగంలోకి దిగిపోతున్నారు. తనకు అత్యవసరంగా డబ్బు అవసరముందని చాట్‌ చేస్తున్నారు. తాను ప్రస్తుతం మాట్లాడే పరిస్థితుల్లో లేనని ఏమార్చుతున్నారు. తాను సూచించే గూగుల్‌పే లేదా ఫోన్‌పే నంబర్‌కు డబ్బు పంపించాలని కోరుతున్నారు. ఇది నిజమని నమ్మి చాలా మంది మోసపోతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పోలీస్‌ అధికారులు, ప్రముఖుల నకిలీ ఖాతాలతో ఇలాంటి మోసాలు జరిగాయి.

ఇదిగో జాగ్రత్త : ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రైవసీ సెట్టింగ్‌ల్లో 'పబ్లిక్‌ వ్యూ' ఆప్షన్‌ కాకుండా 'ఓన్లీ ఫ్రెండ్స్‌' ఆప్షన్‌ ఎంచుకోవాలి. అలాగే ప్రొఫైల్‌ సెట్టింగ్‌ల్లో ప్రొఫైల్‌ను లాక్‌ చేయాలి. అలా చేస్తే బయటి వ్యక్తులెవరూ ఆ ఖాతాలోని చిత్రాల్ని, పోస్టింగ్‌లను చూసేందుకు అవకాశముండదు. తద్వారా నకిలీ ఖాతాలు తెరిచే ఆస్కారం కలగదు.

ఫిర్యాదు సులభమే..

గతంలో సైబర్‌ నేరస్థుల వలకు చిక్కిన సందర్భాల్లో ఫిర్యాదు చేయాలన్నా ఇబ్బందిగానే ఉండేది. బాధితులు తొలుత బ్యాంకుకు వెళ్లి పోగొట్టుకున్న డబ్బు తాలుకు వివరాల్ని స్టేట్‌మెంట్‌ రూపంలో తీసుకోవాల్సి వచ్చేది. అనంతరం ఆ స్టేట్‌మెంట్‌ను ఫిర్యాదుకు జత కలిపి సైబర్‌క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. ఇలా ఫిర్యాదు చేసినా పోగొట్టుకున్న సొమ్ము తిరిగి వస్తుందన్న నమ్మకం ఉండేది కాదు. కానీ దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు పెచ్చరిల్లడంతో ఫిర్యాదులను సరళతరం చేశారు. దేశంలో ఎక్కడి బాధితులైనా ఒకే నంబర్‌కు ఫోన్‌ చేసి మోసం తాలుకు వివరాలను చెప్పడం ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. అలాగే మెయిల్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. బాధితులు తొందరగా గనక ఫిర్యాదు చేస్తే వీలైనంత మేర సొమ్మును తిరిగి తెప్పించగలుగుతున్నారు.

  • ఫోన్‌ నంబర్‌ : 1930
  • మెయిల్‌ ఐడీ : https:///Cybercrime.gov.in

ఇదీ చూడండి : జీవిత బీమా గురించి కుటుంబ స‌భ్యుల‌కు చెప్పారా? లేదంటే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.