How To Lock Aadhaar Biometric Data : ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS) అందుబాటులోకి వచ్చిన తరువాత బ్యాంకింగ్ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు చాలా సులువు అయిపోయాయి. ముఖ్యంగా బ్యాలెన్స్ చెక్‌చేసుకోవడానికి, డబ్బులు పంపించడానికి, విత్‌డ్రా చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇదే సమయంలో ఆన్లైన్ మోసాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. కొందరు వ్యక్తులు ఇతరుల ఆధార్ బయోమెట్రిక్ డేటాను చోరీ చేసి, డబ్బులు కాజేస్తున్నారు. ఇటీవల కర్ణాటకలోని ఓ మహిళను స్కామర్లు మోసం చేసి, ఆమె బయెమెట్రిక్ డేటాను సేకరించి, తరువాత ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.20,000 వరకు కాజేశారు. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురుకావచ్చు. కనుక ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్ బయోమెట్రిక్ డేటాను కచ్చితంగా లాక్ చేసుకోవాలి. మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
జర భద్రం!
How to secure Aadhaar biometrics data : ఆధార్‌లో మన ఫింగర్‌ప్రింట్స్, ఐరిస్, ఫేసియల్ రికగ్నిషన్ డేటా, సహా మన వ్యక్తిగత వివరాలు ఉంటాయి. వీటిని స్కామర్లు చోరీ చేయకుండా ఉండాలంటే కచ్చితంగా ఆధార్ బయోమెట్రిక్స్‌ను లాక్ చేసుకోవాలి. దీని వల్ల ఇతరులు ఎవ్వరూ ముందస్తు అనుమతి లేకుండా.. మన బ్యాంక్ అకౌంట్‌ను యాక్సిస్ చేయలేరు.
నేడు భారతదేశంలో ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా చేయడానికి, పాయింట్-ఆఫ్-సేల్ (POS) టెర్మినల్స్ వద్ద డబ్బులు చెల్లించడానికి ఆధార్ బయోమెట్రిక్స్‌ను ఉపయోగిస్తున్నాం. అందుకే స్కామర్లు వీటిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. అధునాతన సాంకేతికతను ఉపయోగించి, మన డేటాను చోరీ చేస్తున్నారు. ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి తప్పించుకోవాలంటే.. ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేసుకోవడం తప్పనిసరి.
ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ చేయాలంటే.. UIDAI వెబ్సైట్ లేదా mAadhaar appను కానీ ఉపయోగించవచ్చు. ఒకసారి మీరు బయోమెట్రిక్స్ లాక్ చేశారంటే.. ఇతరులు ఎవరూ మీ అనుమతి లేకుండా వాటిని యాక్సిస్ చేయలేరు. అందుకే ఇప్పుడు మనం ఆధార్ బయోమెట్రిక్స్ ఎలా లాక్ చేయాలో తెలుసుకుందాం.
- ముందుగా మీరు https://uidai.gov.in/ వెబ్సైట్ లేదా mAadhaar యాప్‌ను ఓపెన్ చేయండి.
- మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని కూడా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- My Aadhaar సెక్షన్లోకి వెళ్లి, Lock/ Unlock Biometricsపై క్లిక్ చేయండి.
- మరోసారి మీ ఆధార్ నంబర్, ఓటీపీలను ఎంటర్ చేయండి
- Lock Biometricsపై క్లిక్ చేయండి
- మీకు ఒక కన్ఫర్మేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. దానిని మీరు comfirm చేయండి.
- ఇలా సింపుల్‌గా మీ ఆధార్ బయోమెట్రిక్స్‌ను లాక్ చేసుకోండి.
- ఒక వేళ మీరు ఎప్పుడైనా ఆధార్ బయోమెట్రిక్స్లను అన్‌లాక్ చేయాలని అనుకుంటే.. సేమ్ ప్రొసీజర్‌ను ఫాలో అయితే సరిపోతుంది.
ఆధార్ బయోమెట్రిక్స్ డేటాను ఎందుకు లాక్ చేసుకోవాలి?
Why Secure Aadhaar Biometrics Data : భారతదేశంలో ఆధార్ కార్డ్ అనేది మీ వ్యక్తిగత గుర్తింపు కార్డ్‌గా ఉపయోగపడుతుంది. కనుక అవసరమైనప్పుడు మీ గుర్తింపును నిర్ధరించుకోవడానికి ఆధార్ నంబర్, ఓటీపీ ఉపయోగించవచ్చు. వాస్తవానికి మీ ఆధార్ బయోమెట్రిక్స్‌ను భద్రపరచడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- AEPS స్కామ్స్ నుంచి తప్పించుకోవచ్చు. అంటే.. ఆన్లైన్ ఆర్థిక లావాదేవీల్లో మోసాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
- ఇతరులు మన ఐడెంటిటీని దొంగిలించకుండా రక్షణ పొందవచ్చు. అంటే ఇతరులు ఎవ్వరూ మన పేరు ఉపయోగించి ఎలాంటి మోసాలకు పాల్పడలేరు.
- పైగా మన బయోమెట్రిక్ డేటా సురక్షితంగా ఉంటుంది.
AEPS స్కామ్‌ల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
How To Prevent Aadhaar Misuse :
- బ్యాంకుల నుంచి, ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేటప్పుడు, పీఓఎస్ పరికరాలు ఉపయోగించేటప్పుడు.. మీ బయోమెట్రిక్ డేటాను ఇతరులు ఎవ్వరూ చోరీ చేయకుండా జాగ్రత్త వహించండి.
- తెలియని వ్యక్తులకు మీ ఆధార్ కార్డ్ లేదా నంబర్ వివరాలను ఇవ్వకండి.
- మీకు కచ్చితంగా అవసరమైతే తప్ప మిగతా సమయాల్లో.. బయోమెట్రిక్ డేటాను లాక్ చేసుకునే ఉంచుకోండి.
- AEPS స్కామ్ లేదా ఆన్లైన్ స్కామ్‌ల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండండి. అలాగే అలాంటి ఫ్రాడ్స్ నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా నేర్చుకోండి.