How to Link Aadhaar with UAN in Online Process : ఈపీఎఫ్ (EPF) ఖాతాదారులకు యూఏఎన్ నంబరు (Universal Account Number) చాలా కీలకమైనది. ఇది ఈపీఎఫ్‌వో(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) తమ సభ్యులకు కేటాయించే 12 అంకెల సంఖ్య. దీని ద్వారా సభ్యులు ఆన్లైన్లో ఈపీఎఫ్ ఖాతాకు సులభంగా లాగిన్ అయ్యి.. పీఎఫ్ బ్యాలెన్స్(PF Balance)ను తెలుసుకోవచ్చు. యూఏఎన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్ ద్వారా కేవైసీ, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. అదేవిధంగానే ఆన్‌లైన్ ద్వారానే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. ఇన్ని ప్రయోజనాలను అందిస్తున్న మీ యూఏఎన్(UAN)ను ఆధార్ నంబర్‌తో తప్పనిసరిగా లింక్ చేయాలి.
Aadhaar link with UAN Online Process : ఆధార్ నంబర్(Aadhaar Number)తో మీ యూఏఎన్ లింక్ చేయకపోతే .. మీ నెలవారీ కాంట్రిబ్యూషన్.. మీ అకౌంట్లో మీ యజమాని డిపాజిట్ చేయలేరు. అలాగే.. పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. బీమా ప్రయోజనాలు సైతం అందవు. అందువల్ల మీ ఆధార్‌ను ఇప్పటికే లింక్ చేయకపోతే లింక్ చేసుకోవాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) గతంలోనే సూచించింది. అయితే.. ఇప్పటికీ చేసుకోని వారికి.. ఈపీఎఫ్‌వో మరో అవకాశం ఇచ్చింది. మార్చి 31, 2024 వరకు ఈ గడువు పొడిగించింది. మరి, వెంటనే లింక్ చేయండి. కింద పేర్కొన విధంగా.. మీరు సులువుగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ యూఏఎన్ నెంబరు మర్చిపోయారా? అయితే ఇలా చేయండి!
ఆన్లైన్లో EPFO పోర్టల్‌లో మీ యూఏఎన్‌తో ఆధార్ లింక్ చేసుకోండిలా..
How to Link Aadhaar with UAN in EPFO Portal in Telugu :
- మొదట మీరు EPFO వెబ్‌సైట్ అధికారిక పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ కి వెళ్లాలి.
- ఆ తర్వాత మీ Universal Account Number(UAN), పాస్‌వర్డ్ ఉపయోగించి ఖాతాకు లాగిన్ అవ్వాలి.
- అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ EPF ఖాతాతో లింక్ చేయడానికి 'Aadhaar' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అనంతరం మీ UAN నంబర్‌ను నమోదు చేయాలి. అప్పుడు అది స్వయంచాలకంగా మొబైల్ నంబర్, వివరాలను పొందుతుంది.
- ఆ తర్వాత.. 'Aadhaar' ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆధార్ కార్డు ప్రకారం ఆధార్ నంబర్, పేరును నమోదు చేసి save ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. .
- ఆ తర్వాత జనరేట్ OTPపై క్లిక్ చేసి.. OTPని నిర్ధారించుకోవాలి.
- ఆధార్ వివరాలను సేవ్ చేసిన తర్వాత, UIDAI డేటా ఉపయోగించి మీ ఆధార్ ధృవీకరించబడుతుంది.
- ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి.
- చివరగా మీ KYC పత్రాన్ని విజయవంతంగా ఆమోదించిన తర్వాత.. మీ ఆధార్ నంబర్ EPF ఖాతాకు లింక్ అవుతుంది.
- దీంతో ఈపీఎఫ్, యూఏఎన్ ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది.
యూఏఎన్ లేకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చా?
మీ PF బ్యాలెన్స్ తెలుసుకోవాలా? ఈ 4 ఈజీ మార్గాలు ట్రై చేయండి!