ETV Bharat / business

సిబిల్ స్కోర్ పెరగాలా? ఈ టాప్-5 టిప్స్​ పాటించండి! - CIBIL Score improvement tips

How To Improve Credit Score In 2024 In Telugu : మీరు క్రెడిట్​ కార్డ్ యూజర్లా? మంచి క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ ఆర్టికల్​లో క్రెడిట్/ సిబిల్​ స్కోర్​ పెంచుకోవడానికి పాటించాల్సిన టాప్​ -5 టిప్స్ గురించి తెలుసుకుందాం.

CIBIL Score improvement tips in telugu
How To Improve Credit Score in telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 2:02 PM IST

How To Improve Credit Score In 2024 : ఈ రోజుల్లో సిబిల్ స్కోరు అనేది కేవలం రుణాలు పొందడానికే మాత్రమే కాదు, వ్యక్తి ఆర్థిక పరిస్థితిని అంచనావేయటానికి ఉపయోగిస్తున్నారు. మంచి క్రెడిట్ స్కోరు ఉంటే ఏదైనా అత్యవసర పరిస్థితిల్లో వెంటనే ఆర్థిక సాయం దొరుకుతుంది. బ్యాంకులు మంచి సిబిల్ స్కోర్​ ఉన్న వారికి త్వరగా రుణాలు మంజూరు చేస్తుంటాయి. సాధారణంగా క్రెడిట్/ సిబిల్​ స్కోర్​ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మంచి స్కోరుగా పరిగణిస్తారు. దానికంటే తక్కువ ఉంటే రుణాలు పొందటం కొంచెం కష్టం అవుతుంది. అందుకే సిబిల్ స్కోరు పెంచుకోవడానికి అందరూ ప్రయత్నిస్తారు. మరి మీరూ మీ క్రెడిట్ స్కోరును పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కింద తెలిపిన టాప్​-5 టిప్స్​పై ఓ లుక్కేయండి.

1. పాక్షిక చెల్లింపులు వద్దు
మీరు క్రెడిట్​ కార్డు బిల్లలను పూర్తిగా చెల్లించాలి. కానీ చాలా మంది పాక్షిక చెల్లింపులు చేస్తుంటారు. ఇది సరైన విధానం కాదు. పాక్షిక చెల్లింపులు చేస్తూ ఉంటే, మీకు తెలియకుండానే బకాయిలు అధికం అయ్యే అవకాశం ఉంటుంది. వాటిని సకాలంలో చెల్లించకుంటే, అధిక వడ్డీలు, ఆలస్య రుసుములు చెల్లించాల్సి వస్తుంది. పైగా ఇది మీ క్రెడిట్ స్కోరుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అందువల్ల వీలైనంత వరకు పాక్షిక చెల్లింపులు చేయకపోవడమే మంచిది.

2. బిల్లులు సకాలంలో చెల్లించాలి
ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డు బిల్లులను వాయిదా వేయకండి. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నట్లయితే, బిల్ కట్టాల్సిన తేదీలను గుర్తుంచుకోవటం కొంచెం కష్టంగానే ఉంటుంది. కనుక ఆటోమేటిక్​గా బిల్ పేమెంట్​ అయ్యేలా సెట్​ చేసుకోవాలి. దీని వల్ల సకాలంలో బిల్​ పేమెంట్స్ జరిగిపోతాయి. ఫలితంగా అధిక వడ్డీలు, ఆలస్య రుసుముల నుంచి తప్పించుకోవచ్చు. పైగా మీ క్రెడిట్ స్కోర్​ కూడా పెరుగుతుంది.

3. అవసరం మేరకే వాడాలి
మీకేదైనా అత్యవసర పరిస్థితి ఉండి, తప్పనిసరిగా వాడాల్సి వస్తేనే క్రెడిట్ కార్డు ఉపయోగించండి. ఎందుకంటే ఈ రోజుల్లో అప్పు దొరకటం చాలా సులభమే. కానీ దానిని తిరిగి చెల్లించడం కష్టమవుతోంది. అందువల్ల మన అవసరాలకు తగిన విధంగానే క్రెడిట్​ కార్డును ఉపయోగించాలి. మన శక్తికి మంచి అప్పు తీసుకుంటే, చెల్లించేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అంతేకాదు సరైన సమయంలో చెల్లింపులు చేయకుంటే, అది మీ సిబిల్​ స్కోర్​పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

4. అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి
ఎప్పుడు ఎలాంటి ఆర్థిక అవసరాలు ఏర్పడతాయో చెప్పలేము. కనుక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. అది ఆపద సమయాల్లో మీకు అక్కరకు వస్తుంది. దీని వల్ల మీరు క్రెడిట్​ కార్డు రుణాలపై ఆధారపడకుండా ఉండగలుగుతారు. అలాగే అధిక వడ్డీలు, అనవసర రుసుములు చెల్లించాల్సిన పరిస్థితి కూడా తప్పుతుంది.

5. పరిమితికి మించి క్రెడిట్ వాడుకోవద్దు!
మీక్రెడిట్ కార్డు వినియోగాన్ని 30 శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి. (CUR) క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అనేది మీ సిబిల్​ స్కోర్​పై నేరుగా ప్రభావం చూపిస్తుంది. అందువల్ల క్రెడిట్​ కార్డును పరిమితికి మించకుండా వాడాలి. అప్పుడే మీరు ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా బ్యాంకులు భావిస్తాయి. తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తాయి.

స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్​-7 టిప్స్​ మీ కోసమే!

ఆధార్​ కార్డ్​లోని మీ పాత ఫొటోను మార్చాలా? సింపుల్​గా ఛేంజ్​ చేసేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.