ETV Bharat / business

How to Get Non Resident Indian Status : భారతీయుడికి.. NRIకి తేడా ఏంటీ..? - ఇండియా ఎన్​ఆర్​ఐ స్టేటస్ పొందండి

How to Get NRI Status: ఒక వ్యక్తి ఏ విధంగా NRI హోదా పొందుతాడు? ఎన్ఆర్​ఐ స్టేటస్ పొందడానికి భారత ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధించింది..? పన్ను విధానమేంటి..? వంటి వివరాలు మీకు తెలుసా?

Non Resident Indian Status in Telugu
Non Resident Indian Status
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 8:35 AM IST

How to Get Non Resident Indian Status in India : NRI అంటే.. నాన్-రెసిడెంట్ ఇండియన్ (Non Resident Indian). భారత్​లో జన్మించి ఇప్పుడు విదేశాలలో నివసిస్తున్న వ్యక్తి అని అర్థం. అయితే.. విదేశాల్లో నివసిస్తున్న వారంతా ఎన్నారై అవుతారా..? ఎప్పుడు ఒక వ్యక్తి ఎన్​ఆర్​ఐ హోదా పొందుతారు? అలాగే.. Indian, NRI, PIOలకు తేడా ఏంటీ..? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

భారతీయుడు ఎవరు..?

Who is Indian :

  • భారతీయ పౌరుడు అని చెప్పుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.
  • భారతదేశంలో జన్మించిన వ్యక్తి లేదా రిజిస్ట్రేషన్ ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందిన వ్యక్తి.
  • భారతీయ పౌరులకు ఈ దేశంలో నివసించడానికి, పని చేయడానికి హక్కు ఉంటుంది.
  • ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందే హక్కు, ఈ దేశంలో ఆస్తిని కలిగి ఉండే హక్కు వంటి.. భారతీయ పౌరసత్వం యొక్క అన్ని ప్రయోజనాలూ, అధికారాలకూ అర్హులు.

ఎన్నారై ఎవరు..?

Who is NRI :

  • నాన్ రెసిడెంట్ ఇండియన్ (NRI) అంటే.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుడు.
  • ఎన్నారై స్టేటస్ కొనసాగాలంటే.. గడిచిపోయిన ఆర్థిక సంవత్సరంలో కనీసం 182 లేదా అంతకంటే ఎక్కువ రోజులు భారతదేశంలో నివసించి ఉండాలి.
  • లేదంటే.. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 60 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు గడిపి ఉండాలి. అలాగే.. గత ఆర్థిక సంవత్సరానికి ముందు నాలుగేళ్లలో కనీసం 365 రోజులు ఇండియాలో గడిపి ఉండాలి.
  • వీరు ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. ఇక్కడ ఆస్తులు, భూములు కూడా కొనుగోలు చేయవచ్చు.
  • భారత్ రావడానికి వీరికి వీసా అవసరం లేదు. పాస్ పోర్టు ఉంటే సరిపోతుంది.
  • ఒక వ్యక్తి నిరవధిక కాలం పాటు ఉద్యోగం, వ్యాపారం లేదా ఏదైనా ఇతర జీవనోపాధి కోసం విదేశాలలో నివసిస్తుంటే ఎన్​ఆర్​ఐ(Non Resident Indian)గా చెప్పుకోవచ్చు.
  • NRIలు ఎప్పుడైనా వెనక్కి వచ్చి.. భారతదేశంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవచ్చు.
  • వీరు భారతదేశంలో ఏదైనా ఆదాయాన్ని ఆర్జిస్తే.. దానికి పన్ను విధిస్తారు.
  • NRI విదేశాల్లో ఆదాయాన్ని ఆర్జిస్తే.. భారతదేశంలో పన్ను విధించరు.
  • NRI ట్యాక్స్ విషయంలో.. ఆదాయపు పన్ను చట్టం, విదేశీ మారక ద్రవ్యం, నిర్వహణ చట్టం (FEMA Act) నిబంధనలు వేరుగా ఉంటాయి.
  • ఆదాయపు పన్ను చట్టం పన్ను వ్యక్తుల పన్ను బాధ్యతలను చూసుకుంటుంది.
  • FEMA.. పెట్టుబడులు, బ్యాంకు ఖాతాల వంటి ఇతర లావాదేవీలను పరిశీలిస్తుంది.

ఎన్​ఆర్​ఐలకు శుభవార్త- ఆ కాలాన్ని లెక్కించరట!
How to get PIO Status in Telugu :

PIO (Person of Indian Origin ) హోదా ఎలా పొందుతారు?

  • PIO అంటే భారతీయ సంతతికి చెందిన వ్యక్తి.
  • అంటే.. సదరు వ్యక్తి విదేశీ పౌరుడు.
  • అయితే.. అతని తల్లి లేదా తండ్రి లేదా గ్రాండ్ పేరెంట్స్ భారతీయ పౌరులు.
  • ఇలాంటి వ్యక్తి భారతీయ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్నట్లయితే.. PIO హోదా ఇస్తారు.
  • వీరు.. భారతీయ పౌరులు, NRIలు పొందే అనేక హక్కులను కలిగి ఉండరు.

How to get OCI status in Telugu :

OCI హోదా ఎలా పొందాలి?

  • OCI అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అర్థం.
  • వీరు భారతదేశంలో కుటుంబ సంబంధాలు ఉంటారు.
  • ఇలాంటి వారికి OCI హోదా ఇస్తారు.

ఎన్​ఆర్​ఐలకు గుడ్​న్యూస్.. త్వరలో 'పోస్టల్​ బ్యాలెట్'​ సౌకర్యం!

అందాల పోటీల్లో గెలిస్తే ఎన్​ఆర్​ఐతో పెళ్లి.. వెరైటీ ఆఫర్​ ఇచ్చిన వారు అరెస్ట్

పదవీ విరమణలో తోడుగా.. ప్రవాసులు మదుపు చేయండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.