How to Generate SBI ATM in Telugu : ఎవరికైనా ఏటీఎం పిన్ మర్చిపోవడం మామూలే. చాలా మంది ఓ నెల రోజులు తమ ఏటీఎం కార్డు వాడకపోతే పిన్ మర్చిపోతుంటారు. అయితే రెగ్యులర్‌గా ఏటీఎం కార్డు వాడేవారికి అలాంటి సమస్య ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడో ఓసారి ఏటీఎం కార్డు వాడేవారు సాధారణంగా పిన్ మర్చిపోతుంటారు. అలాగే రెండు, మూడు ఏటీఎంలు వాడే వారు కూడా వాటి పిన్‌లను గుర్తు పెట్టుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. అయితే గతంలో ఏటీఎం కొత్త పిన్ జనరేట్ చేసుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉండేది. కానీ నేటి ఆధునిక కాలంలో ఏటీఎం పిన్ మర్చిపోయిన లేదా కొత్తగా అకౌంట్ తీసుకున్న వారు తమ ఏటీఎం కార్డు పిన్(ATM Card Pin) చాలా సులువుగా జనరేట్ చేసుకోవచ్చు.
How to Change SBI ATM Pin in Telugu : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తమ కస్టమర్లు మరింత సులువుగా ఏటీఎం పిన్ జనరేట్ చేసుకునే వీలు కల్పిస్తోంది. SBI గ్రీన్ పిన్ పేరుతో ప్రచారం చేస్తోంది. అయితే మీరు SBI కస్టమరా? ఎస్‌బీఐ ఏటీఎం కార్డు వాడుతున్నారా? కొత్తగా ఏటీఎం కార్డు తీసుకున్నారా? ఇంకేం ఇప్పుడే మీరు మర్చిపోయిన ఎటీఎం పిన్ లేదా కొత్త ఏటీఎం కార్డు పిన్ సింపుల్‌గా కింద పేర్కొన 4 పద్ధతులలో జనరేట్ చేసుకోండిలా..
How to Generate SBI Card PIN at SBI ATM :
SBI ATMలో SBI కార్డు PIN క్రియేట్ చేసుకోండిలా..
- మొదట మీరు దగ్గరలోని SBI ATM కేంద్రాన్ని సందర్శించాలి.
- ఆ తర్వాత ATMలో డెబిట్ కార్డ్ ఉంచి.. 'PIN Generation' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అనంతరం మీ 11-అంకెల అకౌంట్ నంబర్‌ను టైప్ చేసి 'Confirm' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి.. 'Confirm' మీద క్లిక్ చేయాలి.
- మీరు నమోదు చేసిన వివరాలు కచ్చితమైనవైతే తర్వాత స్క్రీన్‌లో మీ గ్రీన్ పిన్ త్వరలో మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు సెండ్ అయినట్లు సందేశం వస్తుంది.
- మీ గ్రీన్ పిన్ జనరేషన్ విజయవంతమైంది. మీరు మీ మొబైల్ నంబర్‌కు అదే స్వీకరిస్తారు అని చెప్పే మరో సందేశాన్ని చూడటానికి 'Confirm' అనే దానిని నొక్కాలి.
- అప్పుడు మీరు మీ ఫోన్‌లో OTPతో సందేశాన్ని అందుకుంటారు. అది గ్రీన్ పిన్‌గా మీరు భావించాలి.
- ఆ తర్వాత SBI కార్డుని తీసివేసి.. మళ్లీ ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు Banking అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అందులో అందుబాటులో ఉన్న ఎంపికల ఆధారంగా భాషను సెలెక్ట్ చేసుకోవాలి.
- తదుపరి స్క్రీన్‌లో మీ రిజిస్టర్డ్ మొబైల్‌లో అందుకున్న OTPని నమోదు చేయాలి.
- ఆ తర్వాత 'Select Transaction' మెను నుంచి 'PIN Change' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అప్పుడు మీకు నచ్చిన కొత్త నాలుగు-అంకెల పిన్‌ని నమోదు చేసి.. దాన్ని మళ్లీ నిర్ధారించుకోవాలి.
- ప్రక్రియ విజయవంతమైతే 'Your PIN has been changed successfully' అనే సందేశాన్ని మీరు చూస్తారు.
How to Generate SBI Card PIN through SMS in Telugu :
SMS ద్వారా SBI కార్డ్ PINని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే..
- మొదట మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి పిన్ ABCD EFGH (ABCD డెబిట్ కార్డ్ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను సూచిస్తుంది) అలాగే (EFGH డెబిట్ కార్డ్‌కి లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను సూచిస్తుంది) 567676కి SMS చేయాలి.
- ఉదాహరణకు ఇలా 567676కు 'పిన్ ABCD EFGH' అని SMS పంపండి.
- SMS పంపిన తర్వాత, మీరు అదే నంబర్‌కు OTPని అందుకుంటారు. OTP రెండు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.
- అప్పుడు SBI ATMల దగ్గరకు వెళ్లి పైన పేర్కొన్న మాదిరిగా మీ డెబిట్ కార్డ్ PINని రూపొందించుకోవచ్చు.
How to Setup and Login to SBI YONO App : మీరు ఎస్‌బీఐ కస్టమరా..? మరి YONO యాప్ వాడుతున్నారా.. లేదా??
How to Generate SBI ATN PIN by Calling SBI Customer Care :
SBI కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం ద్వారా SBI ఏటీఎం PINని ఎలా పొందవచ్చంటే..
- మొదట మీరు SBI టోల్-ఫ్రీ కస్టమర్ కేర్‌కు 1800 11 22 11/ 1800 425 3800 లేదా 080-26599990కి కాల్ చేయాలి.
- ఆ తర్వాత సూచనలను అనుసరిస్తూ 'ATM and Prepaid Card Services' ఆప్షన్స్ ఎంచుకోవాలి.
- అప్పుడ గ్రీన్ పిన్‌ని రూపొందించడానికి 1 అనే దానిని ఎంచుకోవాలి.
- అనంతరం మీ డెబిట్ కార్డు నంబర్‌ను నమోదు చేసి 'confirm' చేసుకోవాలి.
- ఆ తర్వాత మీ డెబిట్ కార్డ్‌కి లింక్ చేసిన అకౌంట్ నంబర్‌ను నమోదు చేసి.. దానిని Confirm చేసుకోవాలి.
- మీరు అన్ని వివరాలను ధృవీకరించిన తర్వాత OTP తో మీకు ఒక సందేశం వస్తుంది. ఇది 2 రోజులు చెల్లుబాటు అవుతుంది.
- ఈ సమయంలో మీ దగ్గరలోని SBI ATM వద్దకు వెళ్లి.. అక్కడ మీ న్యూ పిన్ రూపొందించుకోండి.
How to Unblock Your SBI ATM Card : SBI ATM కార్డును.. అన్‌బ్లాక్ ఎలా చేయాలి..?
How to Generate SBI ATM PIN use Internet Banking :
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా SBI ATM పిన్ ఇలా క్రియేట్ చేసుకోండి..
- మొదట మీరు మీ ఖాతా ఆధారాలతో SBI ఆన్లైన్ బ్యాంకింగ్‌కి లాగిన్ అవ్వాలి.
- అప్పుడు ప్రధాన మెను నుంచి 'ఈ-సేవలు> ATM కార్డ్ సేవలు' ఎంచుకోవాలి.
- ఆ తర్వాత ATM కార్డ్ సేవల పేజీలో 'ATM PIN Generation' ఎంచుకోవాలి.
- అనంతరం 'వన్ టైమ్ పాస్‌వర్డ్‌ని ఉపయోగించడం' లేదా 'ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ని ఉపయోగించడం' సెలెక్ట్ చేసుకోవాలి.
- 'ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం' ఎంపికను ఎంచుకుని.. అనుబంధిత బ్యాంక్ అకౌంట్‌ను ఎంచుకుని 'Submit' బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత SBI డెబిట్ కార్డ్‌ని ఎంచుకుని 'Confirm'అనే దానిపై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీకు 'ATM PIN Generation' పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కొత్త PINని క్రియేట్ చేసుకోవడానికి ఏవైనా రెండు అంకెలను నమోదు చేయాలి. ఆ తర్వాత 'Confirm'పై క్లిక్ చేయాలి.
- అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు రెండు అంకెలతో SMS అందుకుంటారు.
- ఆ తర్వాత పేజీలో మీరు ముందుగా ఎంచుకున్న రెండు అంకెలు, SMS ద్వారా అందుకున్న రెండు అంకెలను నమోదు చేసి 'Confirm' క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ ATM PIN has been changed successfully అని చూపించే సందేశం మీకు కనిపిస్తోంది.
ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్తున్నారా..? ఈ పని చేయాల్సిందే..
డెబిట్ కార్డు లేకున్నా.. ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవడం ఎలా?