ETV Bharat / business

How To Enable Credit Card Transaction Limit : కొత్త డెబిట్/ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారా?.. ట్రాన్సాక్షన్ లిమిట్​ను సెట్ చేసుకోండిలా! - How To Enable Credit Transaction Limit

How To Enable Credit Card Transaction Limit In Telugu : మీరు కొత్తగా డెబిట్​ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకున్నారా? అయితే వెంటనే ట్రాన్సాక్షన్​ లిమిట్​ను ఎనేబుల్ చేసుకోండి. దీని వల్ల మీ ఆర్థిక లావాదేవీలు సురక్షితంగా ఉంటాయి. మరి డెబిట్​/ క్రెడిట్ కార్డ్​ ట్రాన్సాక్షన్​ లిమిట్​ను ఎలా సెట్​ చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?

how to use debit and credit card
Debit and Credit Cards Control Mechanism
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 11:53 AM IST

Updated : Oct 21, 2023, 12:29 PM IST

How To Enable Credit Card Transaction Limit : ప్రస్తుత కాలంలో డెబిట్, క్రెడిట్​ కార్డ్​ల వినియోగం బాగా పెరిగింది. చాలా మంది వీటిని వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీటి ద్వారా సులభంగా లావాదేవీలు జరుపుతున్నారు. అయితే ఈ కార్డ్​లను తీసుకునే ముందు కొన్ని కీలకమైన సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కార్డు కంట్రోల్ మెకానిజం
Credit Card Control Mechanism : డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు తీసుకున్న తరువాత కార్డ్ ట్రాన్సాక్షన్​ లిమిట్​ను సెట్ చేసుకోవాలి. దీనికోసం సంబంధిత బ్యాంకును సంప్రదించాలి. లేదంటే నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్​లో బ్యాంక్ కంట్రోల్ సిస్టమ్‌లో కార్డ్ కంట్రోల్ ఆప్షన్‌లను ముందుగా ఎనేబుల్ చేసుకోవాలి. అలా చేయకపోతే మీరు ఎలాంటి ఆన్​లైన్, ఆఫ్​లైన్ లావాదేవీలు జ‌ర‌ప‌లేరు. ఈ మార్పులు (కార్డ్ కంట్రోల్స్) కార్డ్ లావాదేవీల భద్రతను మెరుగుపరుస్తాయి.

అంతా మ‌న చేతుల్లోనే..
కొత్త మార్గదర్శకాల ప్రకారం, కార్డ్ వినియోగదారులు.. దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలపై ఒక ట్రాన్సాక్షన్ లిమిట్​ను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్ కొనుగోళ్లు, కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్, వివిధ ర‌కాల ట్రాన్సాక్ష‌న్​లపై ప‌రిమితి విధించుకోవచ్చు.

How To Get Credit Card Without Income Source Certificate : ఇన్‌కమ్‌ సోర్స్‌ లేకున్నా.. క్రెడిట్‌ కార్డ్‌ పొందండి ఇలా!

డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని ఎలా యాక్టివేట్ చేయాలి?
How To Activate Credit Card Online For Transaction : కొత్త కార్డు తీసుకున్న‌ప్పుడు వాటి కంట్రోల్ మెకానిజం అనేది డిఫాల్ట్‌గానే ఆఫ్​లో ఉంటుంది. కావున ట్రాన్సాక్షన్​ లిమిట్​ను ఎనేబుల్​ చేయ‌కుండా.. వాటిని ఎక్క‌డా వినియోగించ‌లేరు. అది ఆన్​లైన్ అయినా, ఆఫ్​లైన్ అయినా స‌రే. ఈ ఆప్ష‌న్​ని నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎనేబుల్ చేసుకోవ‌చ్చు. లేదంటే నేరుగా బ్యాంక్​కు​ వెళ్లి కూడా ట్రాన్సాక్షన్ లిమిట్​ను సెట్​ చేయించుకోవచ్చు.

ఆన్​లైన్​లో చేయాలంటే.. బ్యాంకు అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లి చేసుకోవ‌చ్చు. మొబైల్​లో చేసుకోవాలంటే మాత్రం ఆ బ్యాంకుకు సంబంధించిన అప్లికేష‌న్​ను డౌన్​లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మ‌న వివ‌రాల‌తో లాగిన్ అయి.. లావాదేవీ ప‌రిమితిని సెట్ చేసుకోవ‌చ్చు. ఒక వేళ మీకు స్వయంగా దీనిని ఎలా ఎనేబుల్/ డిజేబుల్​ చేసుకోవాలో తెలియకపోతే.. మీ బ్యాంక్ బ్రాంచ్​లకు వెళ్లి సంప్రదించండి.

SBI Salary Account Benefits : శాలరీ అకౌంట్​ ఓపెన్ చేయాలా?.. ఎస్​బీఐ అందిస్తున్న బెస్ట్ బెనిఫిట్స్​ ఇవే!

Multiple Credit Cards Benefits : మల్టిపుల్​ క్రెడిట్​ కార్డ్స్​ వాడుతున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Last Updated : Oct 21, 2023, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.