ETV Bharat / business

How to Earn Money as a Student : చదువుకుంటూనే సంపాదించాలా..? ఎన్ని మార్గాలున్నాయో..! - ఎన్నిరకాల పార్ట్ టైమ్ జాబ్స్ ఉన్నాయి

How Many Ways to Earn Money : కుటుంబ నేపథ్యం కావొచ్చు.. అత్యవసర ఆర్థిక పరిస్థితులు కావొచ్చు.. కారణాలు ఏవైనా.. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు సంపాదించాల్సిన పరిస్థితులో పడిపోతున్నారు కొందరు విద్యార్థులు. అయితే.. ఏ మార్గాన్ని ఎంచుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు చాలా మంది. ఇలాంటి వారికోసమే ఈ కథనం.

How to Earn Money as a Student
How to Earn Money as a Student
author img

By

Published : Aug 12, 2023, 5:08 PM IST

Updated : Aug 12, 2023, 5:20 PM IST

Students How to Earn Money : గతంలో కుటుంబ పెద్ద ఒక్కరు సంపాదిస్తే సరిపోయేది. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తే తప్ప, ఇల్లుగడవని కండీషన్స్ వచ్చేశాయి. ఇప్పుడు కథ మరింతగా మారిపోయింది. పెళ్లి, కుటుంబం వంటి బరువులు నెత్తికి ఎత్తుకోకుండానే.. సంపాదించాల్సిన బాధ్యత చాలా మంది భుజాల మీదకు వచ్చేస్తోంది. ఇందులో.. కొందరు స్టూడెంట్స్ కూడా ఉండడం గమనార్హం. కుటుంబ నేపథ్యం కావొచ్చు.. అత్యవసర ఆర్థిక పరిస్థితులు కావొచ్చు.. కారణాలు ఏవైనా.. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు సంపాదించాల్సిన పరిస్థితులో పడిపోతున్నారు. అయితే.. ఏ మార్గాన్ని ఎంచుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు చాలా మంది. ఇలాంటి వారికోసమే ఈ కథనం. చదువు కొనసాగిస్తూనే.. సంపాదించడానికి ఉన్న మార్గాలను మీకు అందిస్తున్నాం. ఇందులో మీ టాలెంట్ కు, ఇంకా ఇష్టానికి సంబంధించిన పని సెలక్ట్ చేసుకోండి. హ్యాపీగా సంపాదిస్తూ.. చదువుకోండి.

ట్యూటర్ :

Become a Tutor : ఇవాళ ట్యూషన్ అనేది కంపల్సరీ అయిపోయింది. వేలకు వేలు పోసి స్కూల్లో చదివిస్తున్నప్పటికీ.. తప్పనిసరిగా ట్యూషన్ పెట్టించాల్సిన పరిస్థితులో పడిపోతున్నారు పేరెంట్స్. సో.. మీకు ఏ సబ్జెక్టులో టాలెంట్ ఉంటే.. దాన్ని ఎంచుకొని ట్యూటర్ గా మారిపోవచ్చు. మీకు అనుగుణమైన వేళలను సెలక్ట్ చేసుకోవచ్చు.

Woman Inspiring Story : పది ఫెయిల్​.. యూట్యూబ్​ చూస్తూ నెలకు లక్షల్లో సంపాదన

ట్రాన్స్ లేటర్ :

Translator : డిగ్రీ, ఆ పైస్థాయి విద్యార్థులు ఇంగ్లీష్ లో గనక పట్టు సంపాదించి ఉంటే.. ట్రాన్స్ లేటర్ జాబ్ మీకోసం ఎదురు చూస్తోంది. ఇంగ్లీష్ నుంచి స్థానిక భాషల్లోకి ట్రాన్స్ లేట్ చేయడానికి చాలా ఆఫర్లు ఉంటాయి.

డేటా ఎంట్రీ ఆపరేటర్ : టైపింగ్ తెలిసి ఉంటే.. డేటా ఎంట్రీ ఆపరేటర్​గా కూడా మంచి అవకాశాలే ఉంటాయి. కొన్ని ఆఫీస్​తో సంబంధం లేకుండా.. ఇంటి నుంచి చేసే పనులు కూడా ఉంటాయి.

గేమ్ టెస్టర్ :

Game Tester : ఇవాళ గేమింగ్ ఇండస్ట్రీ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త గేమ్స్ వస్తుంటాయి. అయితే.. గేమ్స్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉండే ప్రాబ్లమ్స్ గుర్తించడానికి గేమ్ టెస్టర్స్ ను నియమించుకుంటారు. వీరు చేయాల్సింది గేమ్ ఆడుతూ.. అందులోని లోపాలను తెలియజేయడమే.

ట్విట్టర్​తో డబ్బు సంపాదించేందుకు రెండు ఈజీ మార్గాలు.. మస్క్ బంపర్ ఆఫర్!

కంటెంట్ రైటర్ :

Content Creator : క్రియేటివ్ గా ఆలోచించి.. వినూత్నంగా రాసే కంటెంట్ రైటర్లకు మంచి అవకాశాలు ఉంటాయి. ఆన్ లైన్ లో వెతికితే చాలా ఆప్షన్లు లభిస్తాయి.

డ్రైవర్ :

Driver : డ్రైవింగ్ చేయడం అనేది ఇవాళ నామూషీ కాదు. సో.. లైసెన్స్ ఉన్నవారు ఓలా, ఉబర్ వంటి సంస్థల్లో పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చు. ఇలా చాలామందే చేస్తున్నారు.

​గవర్నమెంట్ జాబ్ వదిలేసిన యువతి.. ఆ వీడియోస్​తో లక్షల్లో సంపాదన

డెలివరీ బాయ్ :

Delivery Boy : డిగ్నిటీ ఆఫ్ లేబర్ గా భావించే వారు ఫుడ్ డెలివరీ బాయ్ గా కూడా పనిచేయవచ్చు. ఇప్పుడు నగరాల్లో ఆన్ లైన్ ఆర్డర్స్ చాలా పెరిగిపోయాయి. సో.. పార్ట్ టైమ్ గా ఇది కూడా చేయవచ్చు.

యూట్యూబర్ :

Youtuber : అందరికీ తెలిసిన ఆప్షన్ యూట్యూబ్. మంచి కంటెంట్ ఎంచుకొని.. కంటిన్యూగా వీడియోలు చేస్తూ వెళ్తే.. యూట్యూబర్ సంపాదించే అవకాశం ఉంది. అయితే.. వెంటనే క్లిక్ కాకపోవచ్చు. సమయం పడుతుంది.

బ్లాగర్ :

Blogger : ఆసక్తికర అంశాలను ఎంచుకొని, వాటిపై స్టోరీలు రాస్తూ.. బ్లాగ్ లో పోస్టు చేయొచ్చు. మీ కథనాలకు రీడర్స్ పెరిగితే.. తద్వారా ప్రకటల నుంచి ఆదాయం పొందొచ్చు. అయితే.. ఇది కూడా టైమ్ టేకింగ్ ప్రాసెస్.

Triguni EzE Eats Story: వయసు డెబ్భై.. సంపాదన రూ. కోట్లలో...

Last Updated : Aug 12, 2023, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.