ETV Bharat / business

How to Check PAN Card Status in Telugu : పాన్​ కార్డు దరఖాస్తు ఇలా.. స్టేటస్ అలా చెక్ చేయండి! - పాన్ కార్డు స్టేట్​స్

How to Apply For PAN Card in Telugu : మీరు పాన్ కార్డుకు దరఖాస్తు చేయాలా..? ఆల్రెడీ అప్లై చేసి.. కార్డుకోసం వేచి చూస్తున్నారా..? ఈ పనులు మీ మొబైల్​లోనే చాలా సింపుల్​గా చేసేయొచ్చు. అది ఎలాగో మీరే చూసేయండి..

PAN Card
PAN Card Status
author img

By

Published : Aug 20, 2023, 5:28 PM IST

How to Track PAN Card Status in Telugu : పాన్ ​కార్డు, ఆధార్​ కార్డు వంటివి ఎంత విలువైన డాక్యుమెంట్లో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీలు చేయడానికి పాన్ ​కార్డు చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఏదైనా సంక్షేమ పథకాలను పొందాలంటే ఆధార్ కార్డు(Aadhaar Card)తో పాటు పాన్​ కార్డును కూడా అడుగుతున్నారు. ఇవి రెండు కార్డులు చాలా చోట్ల గుర్తింపు కార్డులుగా పనిచేస్తున్నాయి.

PAN Card Status Check Online : మరోవైపు ఆధార్​-పాన్ కార్డును లింక్ చేయాలని ప్రభుత్వం చెబుతోంది. ఎందుకంటే.. ఇందులోని ఆల్ఫా-న్యూమరికల్ కోడ్​ను ఎవరు డూప్లికేట్ కూడా చేయలేరు. ఆదాయ వ్యవహారాల విషయంలో ఈ రెండింటి అనుసంధానం కీలకంగా మారింది. దీంతో.. ఇప్పటి వరకూ పాన్ కార్డు లేనివారు అనివార్యంగా తీసుకోవాల్సిన పరిస్థితి. మరి, మీరు కొత్తగా పాన్ కార్డు(PAN Card)కు దరఖాస్తు చేయాలా? లేదంటే.. అప్లై చేసి చాలా రోజులైంది ఇంకా రాలేదని చూస్తున్నారా? ఇక ఆలస్యమెందుకు మీ పాన్​ కార్డు అప్లికేషన్​ స్టేటస్​ను ఎలా చెక్​ చేసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • మొదటగా.. ఆన్​లైన్​లోకి వెళ్లి https://tin.tin.nsdl.com/pan/index.html అడ్రస్​లోకి వెళ్లండి.
  • అక్కడ "New PAN Card" ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఇండియన్/ఫారెన్ సిటిజన్ అనే ఆప్షన్ వస్తుంది.
  • ఆ తర్వాత పేరు, బర్త్ డేట్, లింగం, అడ్రస్, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి వివరాలు ఇవ్వాలి.
  • గుర్తింపు కార్డు, నివాస ధ్రువత్రం, బర్త్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీ అప్​లోడ్ చేయాలి.
  • తర్వాత దరఖాస్తు ఫీజు ఆన్​లైన్​ పద్ధతిలో చెల్లించాలి.
  • అంతా ఓకే అనుకున్న తర్వాత.. సబ్మిట్ చేసి, రిసిప్ట్ (అక్నాలెడ్జ్ మెంట్) ప్రింట్ తీసుకోవాలి.
  • ఆ తర్వాత రిసిప్ట్ పై సంతకం చేసి.. 2 పాస్ ఫొటోలు అప్​లోడ్ చేయాలి
  • అప్లికేషన్​ ఫాం, డాక్యుమెంట్లు NSDL అడ్రస్​కు పంపించారు.
  • అంతే.. మీరు సమర్పించిన ఆడ్రస్​కు వారాల వ్యవధిలో పాన్​ కార్డు వచ్చేస్తుంది.

PAN Card Status Track Through NSDL :

స్టేటస్​ను తెలుసుకోండిలా..

Step 1 : మొదట మీరు ఎన్​ఎస్​డీఎల్ పాన్​కార్డు ట్రాకింగ్ పోర్టల్​కు వెళ్లండి

Step 2 : అక్కడ 'PAN Card Status' అనే దానిపై క్లిక్ చేయండి.

Step 3 : అనంతరం మీ పాన్​ కార్డు నంబరు, క్యాప్చా కోడ్​ను ఎంటర్ చేయండి

Step 4 : చివరగా సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే.. మీ పాన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ వివరాలు స్క్రీన్​పై కనిపిస్తాయి.

Check PAN Card Status through SMS :

మీ పాన్​కార్డు స్టేటస్​ను ఎస్​ఎంఎస్ ద్వారా తెలుసుకోండిలా..

1. మొదట మీరు దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఫోన్ నంబర్​ నుంచి 567676కు మీ పాన్ కార్డు నంబర్​ను "PAN" తర్వాత టైప్ చేసి పంపించండి.

2. అనంతరం మీ పాన్ కార్డు స్టేటస్ పూర్తి వివరాలతో కూడిన SMS మీ ఫోన్​కు వస్తుంది.

పెళ్లి తర్వాత పాన్‌ కార్డుపై ఇంటి పేరు మార్చాలా? అయితే ఇలా చేయండి

PAN Card Status Check Acknowledgement Number :

అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ ద్వారా మీ కార్డు స్టేటస్​ను చెక్​ చేసుకోండిలా..

1. మొదట మీరు ఎన్​ఎస్​డీఎల్ వెబ్​సైట్​కి వెళ్లండి.

2. 'Check PAN Card Status' పై క్లిక్ చేయండి.

3. అనంతరం 'అప్లికేషన్ టైప్' ఆప్షన్ మీద క్లిక్ చేసి "PAN-New/Change Request"ని ఎంచుకోండి.

4. ఆ తర్వాత మీ 15 అంకెల అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్​ను ఎంటర్ చేయండి.

5. చివరగా సబ్మిట్ బటన్​పై క్లిక్ చేస్తే.. మీ పాన్ కార్డు స్టేటస్ స్కీన్​పై కనబడుతుంది.

PAN Card Status Check Name and Date of Birth :

పేరు, పుట్టిన తేదీ ద్వారా మీ పాన్ కార్డ్ స్టేటస్ చూసుకోండిలా..

1. మొదటగా NSDL అనే వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. ఆ తర్వాత 'Check PAN Card Status' పై క్లిక్ చేయండి.

3. అప్పుడు PAN Applicationలో మీ పేరును నమోదు చేయండి.

4. అనంతరం మీ పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయండి.

5. చివరగా సబ్మిట్ బటన్​పై క్లిక్ చేస్తే.. మీ పాన్ కార్డు స్టేటస్ వస్తుంది.

PAN Card Status Check UTI :

UTI వెబ్‌సైట్‌లో పాన్ లేదా కూపన్ నంబర్ ద్వారా పాన్ కార్డ్ స్టేటస్ తెలుసుకోండిలా..

1. మొదటగా యూటీఐ వెబ్​సైట్​కి వెళ్లండి.

2. 'Track PAN Card Status' పై క్లిక్ చేయండి.

3. అనంతరం మీ పాన్ నంబర్ లేదా అప్లికేషన్ కూపన్ నంబర్​ను ఎంటర్ చేయండి.

4. ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్​(క్యాప్చా)ను నమోదు చేయండి.

5. చివరగా సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే.. మీ పాన్ ​కార్డు అప్లికేషన్ స్టేటస్ డిస్​ప్లే అవుతుంది.

ఇలా మీరు అప్లై చేసిన పాన్​ కార్డు అప్లికేషన్ స్టేటస్​ను పైన పేర్కొన వివిధ పద్ధతులు ద్వారా ఆన్​లైన్​ ద్వారా సింపుల్​గా చెక్​చేసుకోండి. తద్వారా కలిగే ప్రయోజనాలను పొందండి.

How to Check Pan Aadhaar Link Status : లాస్ట్ డేట్ ముగిసిపోయింది.. మీ పాన్-ఆధార్ లింక్ అయ్యిందా?

పాన్​కార్డుతో జర భద్రం! లేదంటే ఐటీ నోటీసు ఖాయం!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.