ETV Bharat / business

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు గురించి తెలుసుకోవాలా? UDGAM పోర్టల్​లో చెక్ చేసుకోండిలా! - List of Unclaimed Deposits in india

How To Check Details Of Unclaimed Deposits In Telugu : బ్యాంకుల్లో ఎవరూ క్లెయిం చేయని డిపాజిట్లు వేల కోట్ల రూపాయలలో ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. అందుకే మీవి లేదా మీకు సంబంధించిన వ్యక్తుల అన్​క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయో? లేదో? చెక్​ చేసుకోవడం మంచిది. అందుకే ఇప్పుడు అన్​క్లెయిమ్డ్​ డిపాజిట్లను UDGAM పోర్టల్​లో ఎలా చెక్​ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

what is UDGAM
How to check details of unclaimed deposits
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 5:23 PM IST

How To Check Details Of Unclaimed Deposits : దేశంలో అన్​క్లెయిమ్డ్ డిపాజిట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, ఎవరూ క్లెయిమ్‌ చేయని (Unclaimed Deposits) డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 28 శాతం పెరిగి రూ.42,270 కోట్లకు చేరాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.36,185 కోట్లు, ప్రైవేటు రంగ బ్యాంకుల వద్ద రూ.6,087 కోట్లు మేరకు అన్​క్లెయిమ్డ్​ డిపాజిట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. అందుకే ఇలాంటి డిపాజిట్ల వివరాలను సాధారణ ప్రజలు తెలుసుకోవడం కోసం, ఆర్‌బీఐ ప్రత్యేకంగా ఉద్గమ్‌ (UDGAM) పేరిట ఒక కేంద్రీకృత వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఎవరైనా తమ పేరు మీద, తమ కుటుంబీకుల పేరు మీద ఉన్న, ఇప్పటికీ క్లెయిమ్‌ చేసుకోని డిపాజిట్లు గురించి తెలుసుకోవచ్చు.

అన్​క్లెయిమ్డ్ డిపాజిట్లు అంటే ఏమిటి?
పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా క్లెయిమ్‌ చేయని డిపాజిట్లను అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లుగా పేర్కొంటారు. బ్యాంకులు ఇలాంటి డిపాజిట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI)కు చెందిన ‘డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ (డీఈఏ)’ నిధికి బదిలీ చేస్తాయి. అందువల్ల ఎవరైనా తమకు లేదా తమ పూర్వీకులకు సంబంధించిన అన్​క్లెయిమ్డ్ డిపాజిట్లు గురించి తెలుసుకోవాలంటే, ఉద్గమ్ పోర్టల్​లో వెతుక్కోవచ్చు. ఒకవేళ వారు ఇలాంటి అన్​క్లెయిమ్డ్ డిపాజిట్లను తిరిగి పొందాలనుకుంటే, నేరుగా బ్యాంకులను సంప్రదించి, వాటిని తిరిగి పొందవచ్చు.

ఉద్గమ్‌ పోర్టల్‌లో దాదాపు 30 బ్యాంకులు నమోదయ్యాయి. వాటిలో మీవి లేదా మీ సంబంధీకులకు సంబంధించిన అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు ఉన్నాయేమో చూడవచ్చు. ఖాతాదారులు మరణించినా, వారి నామినీలు లేదా వారసులు అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల వివరాలు తెలుసుకోవచ్చు. ఒక వేళ తమ వారికి చెందిన అన్​క్లెయిమ్డ్​ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తిస్తే, సంబంధిత ఆధారాలతో బ్యాంకును సంప్రదించి వాటిని క్లెయిమ్​ చేసుకోవచ్చు.

ఇలా చెక్ చేసుకోండి
Check Your Unclaimed Deposits In UDGAM Portal :

  • ముందుగా మీరు ఉద్గమ్‌ పోర్టల్‌ https://udgam.rbi.org.in ఓపెన్ చేయాలి.
  • పోర్టల్​లో మీ మొబైల్‌ నెంబర్‌ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
  • ఓటీపీ వెరిఫికేషన్‌ పూర్తిచేసి, మీ ఖాతాలోకి లాగిన్‌ అవ్వాలి.
  • ఖాతాదారుని పేరుతో పాటు మీ బ్యాంకును ఎంచుకోవాలి.
  • కావాలంటే All Banks అనే ఆప్షన్‌ను కూడా సెలెక్ట్‌ చేసుకోవచ్చు.
  • తర్వాత కింది వరుసలో ఖాతాదారుడి ఆధార్‌, పాన్‌, పుట్టిన తేదీ లాంటి వివరాల్లో, ఏదో ఒక దాన్ని ఎంటర్‌ చేయాలి.
  • ఇవేవీ లేకపోతే, ఖాతాదారుని అడ్రస్‌ కూడా ఇచ్చే ఆప్షన్‌ ఉంటుంది.
  • వివరాలన్నీ ఎంటర్‌ చేసిన తర్వాత, సెర్చ్‌పై క్లిక్‌ చేస్తే పూర్తి సమాచారం మీకు కనిపిస్తుంది.

2024 జనవరి నెల - బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!

2023లో రికార్డ్ స్థాయిలో కార్ల అమ్మకాలు​ - 2024లోనూ హవా నడుస్తుందా? EVల మాటేమిటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.