How To Change Mobile Number In SBI : ప్రస్తుత కాలంలో బ్యాంక్ అకౌంట్‌కు మొబైల్ నంబర్ లింక్ లేకుంటే.. ట్రాన్సాక్షన్ జరపడం చాలా కష్టం. అందుకే కచ్చితంగా బ్యాంక్ ఖాతాకు మొబైల్ నంబర్ లింక్ ఉండాలి. చాలా మంది తమ ఖాతాలకు మొబైల్ నంబర్ లింక్ చేసుకున్నప్పటికీ.. కొన్ని సార్లు కొత్త నంబర్ తీసుకోవడం చేస్తుంటారు. మరికొన్ని సార్లు స్వతహాగా బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను మార్చాలనుకుంటారు. అటువంటి సమయంలోనే బ్యాంక్‌లో మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్‌లో ఫోన్ నంబర్‌ను ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్బీఐ బ్యాంక్‌లో ఫోన్ నెంబర్ మార్చుకోవడం ఎలా?
How To Update Mobile Number In SBI : దేశంలో ఎక్కువ మంది ఖాతాదారులున్న బ్యాంక్ ఎస్బీఐ. ఈ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న ఖాతాదారు.. మొబైల్ నంబర్ మార్చుకోవాలంటే దగ్గర్లో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్‌కు వెళ్లాలి. అక్కడ ఓ రిక్వెస్ట్ లెటర్‌ను ఫిల్ చేసి అధికారులకు ఇవ్వాలి. అయితే ఆ అకౌంట్ మీదేనన్న విషయాన్ని బ్యాంక్ అధికారులకు నిరూపించాల్సి ఉంటుంది. అందుకోసం మీకు సంబంధించిన కొన్ని ధ్రువపత్రాలను వారికి అందించాలి.
Documents Required To Change Mobile Number In Sbi Bank :ఈ క్రింది డాక్యుమెంట్లు చూపి బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ మార్చుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
- పాస్‌పోర్ట్
- డ్రైవింగ్ లైసెన్స్
- ఓటర్ ఐడీ
- ఆధార్ కార్డ్
- MNREGA కార్డ్
- నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ జారీ చేసిన లేఖ
ఫొటోతో ఉన్న వాలిడ్ డాక్యుమెంట్స్ ప్రూఫ్‌ను చూపిస్తేనే ఖాతాదారుల మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేస్తామని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఈ డాక్యుమెంట్లు ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండాలని వారు పేర్కొంటున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేస్తామని అంటున్నారు.
వాట్సాప్‌లో SBI సేవలు.. ఏం చేయొచ్చంటే..?
How to Use SBI WhatsApp Banking Services : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తమ వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు 2022లో ఓ సరికొత్త అప్డేట్ను ప్రవేశపెట్టింది. అదే 'ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్' ఫీచర్. అంటే దీని సాయంతో వాట్సాప్ ద్వారానే మన బ్యాంక్ లావాదేవీలన్నింటినీ చక్కబెట్టేసుకోవచ్చు. మరి ఈ ఫీచర్‌తో ఎస్బీఐ అందిస్తున్న సర్వీసులేంటో వివరించే పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
How to Transfer Money With SBI UPI Pay App : మీరు 'ఎస్బీఐ పే యాప్' వాడుతున్నారా..?