ETV Bharat / business

How to Apply SBI Amrit Kalash Scheme : ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్​న్యూస్​.. రూ.1 లక్ష పెడితే ఎంత వడ్డీ వస్తుందంటే..? - ఎస్​బీఐ ఫిక్స్​డ్ డిపాజిట్ రేట్లు

SBI Amrit Kalash Scheme : దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్​బీఐ తమ కస్టమర్లకు గుడ్​న్యూస్ అందించింది. ఫిక్స్​డ్ డిపాజిట్ల కోసం తీసుకొచ్చిన 'అమృత్ కలశ్ స్కీమ్' గడువును మరోసారి పెంచుతున్నట్లు తన అధికారిక వెబ్​సైట్​లో వెల్లడించింది. ఇంతకీ ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు, గడువు తేదీని ఎప్పటివరకు పెంచిందో ఇప్పుడు తెలుసుకుందాం..

How to Apply Sbi Amrit Kalash Scheme
SBI Amrit Kalash Scheme
author img

By

Published : Aug 18, 2023, 3:38 PM IST

SBI Amrit Kalash Scheme : నేటి ఆధునిక కాలంలో ఎంత సంపాదిస్తున్నామో అంతే మొత్తంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పొదుపు చేయాలి. ఈ క్రమంలో పొదుపు పథకాల్లో ఒకటైన ఫిక్స్​డ్​ డిపాజిట్(Fixed Deposit) ప్రజల నమ్మకాన్ని బాగా చూరగొంది. ముఖ్యంగా మన దేశంలో ఈ ఎఫ్​డీలపై వినియోగదారులకు అపార నమ్మకం ఉంది. అధిక వడ్డీని అందించడంతో పాటు సురక్షిత పెట్టుబడి పథకం కావడంతో దీనిలో పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇటీవల కాలంలో చాలా బ్యాంకులు తమ ఎఫ్​డీ వడ్డీ రేట్లను పెంచాయి.

Amrit Kalash Deposit Scheme : ఈ క్రమంలో దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా(State Bank of India) సరికొత్త ఫిక్స్​డ్ డిపాజిట్ స్కీమ్స్​ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.​ అందులో ఒకటైన ఎస్​బీఐ 'అమృత్ కలశ్ ఫిక్స్​డ్ డిపాజిట్ పథకం' చాలా పాపులర్ అయింది. ఈ క్రమంలో ఆ పథకం గడువు ఆగస్టు15తో రెండోసారి ముగిసింది. తాజాగా మరోసారి ఎస్​బీఐ కీలక ప్రకటన చేస్తూ తన స్పెషల్ ఫిక్స్​డ్ డిపాజిట్ పథకం అమృత్ కలశ్ ఫిక్స్​డ్ డిపాజిట్ స్కీమ్ గడువు మరోసారి పొడిగిస్తూ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకీ ఈ ఫిక్స్​డ్ డిపాజిట్ పథకానికి ఎవరెవరూ అప్లై చేసుకోవచ్చు? దాని ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఎప్పటి వరకు ఈ స్కీమ్ గడువు పెంచింది? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

SBI Amrit Kalash Scheme Details : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) తమ కస్టమర్ల కోసం 2023 ఏప్రిల్ 12న 'అమృత్ కలశ్ స్కీమ్' అనే ప్రత్యేక ఫిక్స్​డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. తొలుత కొద్దిరోజులు మాత్రమే ఈ స్కీమ్​కు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఆ తర్వాత.. మొదటిసారి జూన్ 30వరకు పొడిగించింది. అనంతరం.. రెండోసారి ఆగస్ట్ 15వ తేదీ వరకు పెంచింది. తాజాగా మూడోసారి డిసెంబర్ 31, 2023 వరకు గడువు పెంచుతున్నట్లు ఎస్​బీఐ తన అధికారిక వైబ్​సైట్​లో పేర్కొంది. అప్పటివరకు ఈ స్కీమ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. 400 రోజుల టైమ్ పీరియడ్​తో తీసుకొచ్చిన ఎస్​బీఐ "అమృత్ కలశ్" పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

"అమృత్‌ కలశ్‌" స్కీమ్​ కోసం అప్లై (How to Apply Amrit Kalash Scheme) చేసుకోవడం ఎలా..?

  • మీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఏ ఎస్​బీఐ బ్రాంచ్​కైనా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఒకవేళ మీకు దగ్గరలో బ్యాంక్ లేకపోతే ఆన్​లైన్​లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్​బీఐ యోనో యాప్(SBI Yono App) ద్వారా కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.
  • ఈ పథకం ద్వారా రూ. 2 కోట్ల వరకు డిపాజిట్ చేసేందుకు వీలుంటుంది.

SBI Fixed Deposit Rates 2023 : ఎస్​బీఐ వీ కేర్​ Vs అమృత్​ కలశ్​.. ఏది బెస్ట్ ఆప్షన్​?

అమృత్ కలశ్ స్కీమ్ బెనిఫిట్స్(Amrit Kalash Scheme Benefits)..

1. షార్ట్​ టర్మ్​ ఇన్వెస్ట్​మెంట్​తో మంచి వడ్డీ ఆదాయం పొందాలనే వారికి ఈ ఎఫ్​డీ స్కీమ్​ చాలా అనువైన పథకం.

2. ఈ పథకం ద్వారా ముందస్తుగా డిపాజిట్లనూ ఉపసంహరించుకునే వీలు ఉంటుంది.

3. అదేవిధంగా లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

4. ఈ పథకం ద్వారా మీరు పొందే వడ్డీపై ఇన్​కం టాక్స్ రూల్స్ ప్రకారం టీడీఎస్ కట్ అవుతుంది. అలా కట్ అయిన మొత్తాన్ని ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే సమయంలో క్లెయిమ్ చేసుకోవచ్చు.

5. ఈ స్కీమ్ ద్వారా ఎన్​ఆర్​ఐ రూపీ టర్మ్ డిపాజిట్లు, డొమెస్టిక్ టర్మ్​ డిపాజిట్లు కూడా చేసుకోవచ్చు.

6. కొత్త డిపాజిట్లు, రెన్యూవల్​కు కూడా ఈ పథకంలో ఛాన్స్​ ఉంటుంది.

7. ఈ పథకంలో మీరు జమ చేసిన డబ్బుకు మెచ్యూరిటీ సమయంలో వడ్డీ అందుకుంటారు. నేరుగా కస్టమర్ అకౌంట్​లో డబ్బు జమ అవుతుంది.

ఈ పథకానికి ఎంత వడ్డీ వస్తుంది..?

ఏడాదిలోనే పూర్తవ్వాలి అనుకొనే వారికి ఇది చాలా మంచి పథకం. ఎందుకంటే ఈ పథకం ద్వారా సంవత్సరానికి పోస్టాఫీస్ అందిస్తున్న వడ్డీ కన్నా అధికంగా పొందవచ్చు. ఈ ఫిక్స్​డ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టే సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.6 శాతం వడ్డీరేటు అందుతుంది. అదే సాధారణ ప్రజలకు ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటును ఎస్​బీఐ జమ చేస్తుంది. అలాగే ఎస్​బీఐ(SBI) ఉద్యోగులు, పెన్షనర్లకు అదనంగా ఒక శాతం వడ్డీరేటును ఈ పథకం ద్వారా అందిస్తోంది.

ఉదాహరణకు.. ఈ పథకం ద్వారా రూ. 1 లక్ష డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్లు, సాధారణ పౌరులకు ఎంతమొత్తంలో వడ్డీ వస్తుందో చూద్దాం. ఈ స్కీమ్​లో సీనియర్ సిటిజన్లు రూ. 1 లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు రూ.8,600 వడ్డీ వస్తుంది. అదే సాధారణ ప్రజలకు లక్ష రూపాయలపై డిపాజిట్​పై రూ. 8,017 వడ్డీ కస్టమర్ అకౌంట్​లో జమ అవుతుంది.

FD Rates For Senior Citizens : సీనియర్​ సిటిజన్స్​కు గుడ్​న్యూస్​.. ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 9.1% వడ్డీ!

Govt Bank FD Interest Rates 2023 : ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేస్తున్నారా?.. అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే!

DMF Vs FD.. రెండింటిలో పెట్టుబడికి ఏది బెస్ట్?.. రాబడి ఎందులో ఎక్కువంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.