How to Activate UAN Number in Telugu : ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఈపీఎఫ్ఓ ఖాతా కలిగి ఉంటారు. వారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నంబరు(యూఏఎన్)ను జారీ చేస్తుంది. ప్రతి ఉద్యోగి ఈపీఎఫ్ పోర్టల్‌లో ఈ యూఏఎన్ నంబరు పొందవచ్చు. ఈ నంబర్ ఎవరైనా తొలిసారి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. పీఎఫ్ అకౌంట్ కలిగి ఉండి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఎన్ని ఉద్యోగాలు మారిన ఆ ఉద్యోగి యూఏఎన్ నంబర్ మారదు. ఈఫీఎఫ్‌వో కొత్త ధ్రువీకరణ గుర్తింపు ఐడీని కేటాయిస్తుంది. అప్పుడు అది ఒరిజినల్ యూఏఎస్ నంబర్‌తో లింక్ అవుతుంది. అయితే ఉద్యోగి ఈపీఎఫ్‌వో సేవలను పొందడానికి యూఏఎన్ నంబర్‌తో కేవైసీ వివరాల్సి లింక్ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా ఉద్యోగులు యజమాని, మధ్యవర్తుల అవసరం లేకుండా వివిధ రకాల ఆన్‌లైన్ సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతి లభిస్తుంది.
UAN Number Details in Telugu : అయితే ఈ యూఏఎన్ నంబర్ ఒక్కసారి మాత్రమే జనరేట్ అవుతుంది. మీరు ఎన్ని ఉద్యోగాలు మారినప్పటికీ అది మారదు. కానీ చాలామంది ఉద్యోగులు ఏదో ఒక సమస్య కారణంగా యూఏఎన్ నంబర్‌ను రూపొందించడం లేదు. కొందరు ఉద్యోగులు కీలకమైన ఈ యూఏఎన్ నంబరు(UAN Number) మర్చిపోయి నానా ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా సింపుల్‌గా ఆన్లైన్లోనే మీ యూఏఎన్ నంబర్‌ను రూపొందించుకోవచ్చు. అలాగే మర్చిపోయిన మీ యూఏఎన్ నంబరు తెలుసుకోవచ్చు, మీ యూఏఎన్ నంబర్ యాక్టివేట్ చేసుకోవచ్చు.
How to Create UAN Number :
యూఏఎన్ నంబర్‌ను ఏ విధంగా రూపొందించుకోవాలో ఇప్పుడు చూద్దాం..
- మీరు ముందుగా EPFO అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- అప్పుడు అక్కడ ఎంప్లాయీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం సర్వీస్ ఆప్షన్‌కి వెళ్లి Member UAN లేదా ఆన్‌లైన్ సర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఎంప్లాయీస్ సెక్షన్‌కి వెళ్లి అక్కడ యూఏఎన్ కేటాయింపుపై ప్రెస్ చేయాలి.
- అది ఓపెన్ కాగానే అక్కడ మీ ఆధార్‌కార్డుతో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఫోన్‌కి ఒక కోడ్ వస్తుంది. దానిని అక్కడ నమోదు చేయాలి.
- ఈ విధంగా మీ యూఏఎస్ నంబర్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
How to Check EPFO Balance: మీ పీఎఫ్ ఖాతాలో ఎంత సొమ్ము ఉందో.. చిటికెలో తెలుసుకోండి!
How to find Forget UAN Number :
యూఏఎన్ నంబర్ మర్చిపోతే ఎలా తెలుసుకోవాలో చూద్దాం...
- మొదట మీరు ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.inను ఓపెన్ చేయాలి.
- అనంతరం అక్కడ చూపిస్తున్న పేజీలో 'నో యువర్ యూఏఎన్'పై క్లిక్ చేయాలి.
- అప్పుడు ఓపెన్ అయిన పేజీలీ మీ ఈపీఎఫ్ఓ ఖాతాతో లింక్ అయిన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
- అలాగే అనంతరం వచ్చిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
- అనంతరం వ్యక్తిగత వివరాలు(మీ పేరు, పుట్టిన తేదీ, తదితరాల)ను అక్కడ నమోదు చేయాలి.
- వెరిఫికేషన్ కోసం చివరిగా మీ ఆధార్, పాన్ నంబర్, మెంబర్ ఐడీ వివరాలను ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత వచ్చిన ఆప్షన్లలో Show My UANపై క్లిక్ చేయాలి. అప్పుడు వెంటనే స్క్రీన్‌పై మీ యూఏఎన్ నంబర్ డిస్ప్లే అవుతుంది.
How to Activate UAN Number :
యూఏఎన్ నంబర్ యాక్టివేట్ చేసుకోవడమెలా..
- ముందుగా మీరు ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే 'Activate UAN' లింక్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. ఆపై వచ్చిన క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయాలి.
- వివరాల ధ్రువీకరణ కోసం అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దానిని టైప్ చేయాలి.
- అనంతరం వచ్చే వ్యాలిడేట్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ యూఏఎన్ అకౌంట్ వెంటనే యాక్టివేట్ అవుతుంది.
- ఆపై మీరు ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు ఒక పాస్‌వర్డ్ వస్తుంది.
- ఈ విధంగా మీ పాస్‌వర్డ్, యూఏఎన్ నెంబర్లతో మీ ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌కి లాగిన్ అవ్వొచ్చు.
Multiple EPF Accounts Merge : వేర్వేరు ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయా?.. వెంటనే వాటిని మెర్జ్ చేసుకోండి!