ETV Bharat / business

How Much Money You Can Withdraw from PF : ఉద్యోగంలో ఉండగానే పీఎఫ్ విత్​డ్రా చేసుకోవచ్చు... ఎంత శాతమో తెలుసా? - పీఎఫ్ నుంచి ఎంత శాతం డబ్బులు తీసుకోవచ్చంటే

How Much Money You Can Withdraw from PF : మీరు ఉద్యోగంలోనే ఉన్నారు. అత్యవసరంగా ప్రావిడెంట్ ఫండ్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఎలాంటి సమయంలో మీరు ఎంత శాతం డబ్బు తీసుకోవచ్చో తెలుసా? ఆలస్యమెందుకు ఇప్పుడే ఈ స్టోరీలో తెలుసుకుని అత్యవసరమున్నప్పుడు విత్​డ్రా చేసుకోండి.

How Much Money You Can Withdraw from PF
How Much Money You Can Withdraw from PF
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 12:21 PM IST

Updated : Oct 11, 2023, 1:55 PM IST

How Much Money You Can Withdraw from Provident Fund : ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి దాదాపుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ఉంటుంది. ప్రతినెలా వారి ప్రాథమిక జీతంలో 12 శాతాన్ని పీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తారు. అలాగే.. వారి యజమాని కూడా అంతే మొత్తాన్ని ఆ ఉద్యోగుల అకౌంట్​కు జమ చేస్తారు. ఉద్యోగ విరమణ తరువాత.. ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఈ డబ్బు ఉపయోపగడుతుందన్నది ఉద్దేశ్యం. కానీ.. కొందరికి పరిస్థితుల కారణంగా అత్యవసరంగా డబ్బు అవసరం అవుతుంది. ఇలాంటి వారు రిటైర్‌మెంట్ కంటే ముందే పీఎఫ్ డబ్బులను(PF Advance Withdrawal) విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ.. మొత్తం డబ్బును ఉపసంహరించుకునే అవకాశం ఉండదు. సందర్భాన్ని బట్టి ఉద్యోగులు కొంత శాతం విత్​డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఏ సందర్భంలో ఎంత శాతం డబ్బు విత్​డ్రా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

How to EPF Advance Withdrawal in Telugu : సాధార‌ణంగా ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని ఉద్యోగ విర‌మ‌ణ తర్వాత లేదా ఉద్యోగం మానేసిన రెండు నెల‌ల త‌ర్వాత తీసుకుంటుంటారు. అదే మీరు రిటైర్​మెంట్ కంటే ఒక సంవత్సరం ముందు పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలనుకుంటే.. 90శాతం డబ్బు తీసుకోవచ్చు. మీరు మధ్యలో ఉద్యోగం మానేస్తే.. ఒక నెల నిరుద్యోగం తర్వాత 75 శాతం వరకు విత్​డ్రా చేసుకోవచ్చు. ఇవి రెండు సందర్భాలు కాకుండా.. మిగిలిన సందర్భాల్లో మీరు కొంతమేర డబ్బును ప్రావిడెంట్ ఫండ్(PF) నుంచి ఉపసంహరించుకోవచ్చు.

మీరు పీఎఫ్​ నుంచి నగదు తీసుకోవాలంటే UAN నంబర్ కరెక్ట్​గా ఉండాలి. అలాగే.. మీ యూఏఎన్​కు ఆధార్, పాన్​కార్డుతో సహా బ్యాంకు వివరాలన్నీ తప్పనిసరిగా లింక్ చేసి ఉండాలి.

బేసిక్+డీఏ ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ EPF మొత్తంలో 75% కంటే ఎక్కువగా విత్‌డ్రా చేయలేరు. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారందరికీ ఇది వర్తిస్తుంది.

EPF మొత్తంలో గరిష్ఠంగా 75% లేదా మూడు నెలల బేసిక్+డీఏ.. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే అది మాత్రమే విత్​డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

How to Register An EPF Grievance Online: మీ పీఎఫ్ విషయంలో కంప్లైంట్​ చేయాలా?.. ఆన్‌లైన్​లో ఈజీగా ఇలా చేయండి..!

How to Withdrawal PF Money in Online :

ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్ డబ్బు ఎలా విత్‌డ్రా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

  • మొదట మీరు EPFO మెంబర్స్ పోర్టల్‌ను సందర్శించాలి.
  • ఆ తర్వాత మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. అనంతరం వెరిఫికేషన్ కోసం క్యాప్చా నమోదు చేయాలి.
  • ఆపై మీరు ఆన్‌లైన్ సర్వీసెస్ ట్యాబ్‌కు వెళ్లి.. అక్కడ డిస్​ప్లే అయ్యే Claim ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ Claim (Form 19,31,10C or 10D) అని ఉంటుంది.
  • దానిపై క్లిక్ చేయగానే ఓపెన్ అయ్యే తర్వాత పేజీలో మీ బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అనంతరం YES ఆప్షన్​పై క్లిక్ చేసి.. ఆపై Proceed for Online Claim అన్న దానిపై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీరు ఎందుకోసం పీఎఫ్ క్లెయిమ్ చేస్తున్నారో దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • ఈ ప్రక్రియ తర్వాత మీరు PF Advance (Form 31)ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • అలాగే నగదు విత్‌డ్రా ఎందుకోసమని, ఎంత మొత్తం డబ్బు కావాలి, చిరునామా అందించాల్సి ఉంటుంది.
  • ఇక చివరగా సర్టిఫికెట్ అన్న దానిపై క్లిక్ చేసి.. మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే మీరు ఆ సమయంలో కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి.
  • ఆ తర్వాత ఎంప్లాయర్ విత్‌డ్రాయల్ రిక్వెస్ట్‌ను అప్రూవ్ చేశాక.. మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు పడతాయి.

How to Claim PF Withdrawal in Just 3 Hours ? : కేవలం 3 గంటల్లో పీఎఫ్ ఉపసంహరణను క్లెయిమ్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా.!

How to Link Aadhaar with UAN in Online : మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? వెంటనే ఈ పని చేయండి..!

Last Updated : Oct 11, 2023, 1:55 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.