ETV Bharat / business

How much Gold We Can Buy in Cash? : ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎంత వరకు బంగారం కొనుగోలు చేయవచ్చు.. పరిమితి దాటితే..! - నగదుతో బంగారం కొనడానికి కొన్ని పరిమితులు

How much Gold can Buy in Cash without ID Proof : మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? పిల్లల భవిష్యత్తు లేదా ఇతర అవసరాల కోసం పెద్ద మొత్తంలో గోల్డ్ కొనాలని చూస్తే కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మీ దగ్గర ఉన్న నగదుతో బంగారం కొనడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇంతకీ ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎంత వరకు గోల్డ్ కొనొచ్చు. ఐటీ రూల్స్ ఏం చెబుతున్నాయో ఇఫ్పుడు చూద్దాం..

Jewellery
Gold
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 3:57 PM IST

How much Gold can Buy in Cash without ID Proof in Telugu : దేశంలో పండగల సీజన్ రాబోతుంది. రానున్న రోజుల్లో వరుసగా దసరా, ధంతేరాస్, దీపావళి పండుగలు రాబోతున్నాయి. ఈ పండుగల సందర్భంగా చాలామంది మహిళలు సాంప్రదాయకంగా బంగారం, వెండిని కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా నవంబర్​లో వచ్చే ధనత్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలుకు ప్రాధాన్యత చాలా ఎక్కువ. అలాగే పెళ్లిళ్ల సీజన్ రాబోతుండడంతో బంగారం కొనాలని ఎక్కువమంది ఆలోచిస్తారు. నిజానికి బంగారాన్ని(Gold) నగదు రూపంలో కొనుగోలు చేయాలనుకుంటాం. అయితే మీరు రాబోయే కాలంలో మీ పిల్లల కోసం గోల్డ్ కొనడానికి సిద్ధమవుతున్నారా? అయితే మీరు కచ్చితంగా కొన్ని విషయాలు తెలసుకోవాలి. నగదుతో బంగారం కొనడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి.

Gold Buying cash Limits in Telugu : కేంద్ర ప్రభుత్వం రత్నాభరణాల రంగాన్ని 2002లో ‘అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (PMLA)’ పరిధిలోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి డిసెంబరు 2020లో ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ క్రమంలో ఒక పరిమితికి మించిన నగదుతో కొనుగోలు చేసే వారి నుంచి ఆభరణాల సంస్థలు పాన్‌, ఆధార్‌ వంటి కేవైసీ డాక్యుమెంట్లు తీసుకోవాల్సి ఉంటుందనే నిబంధన విధించారు. అదేవిధంగా రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో కొనుగోళ్లు చేసేవారి వివరాలను ప్రభుత్వానికి నివేదించాలి. అయితే పాన్‌, ఆధార్‌ లేకుండా ఎంత మొత్తం నగదుతో ఆభరణాలు (Jewellery) కొనుగోలు చేయవచ్చో ఇప్పుడు చూద్దాం..

Income Tax Rules on Buying Gold with Cash : ఆదాయ పన్ను (Income Tax) నిబంధనల ప్రకారం.. ఎవరైనా ఒక పరిమితికి మించి నగదుతో లావాదేవీలు జరపడానికి వీలులేదు. సెక్షన్‌ 269ఎస్‌టీ ప్రకారం.. నగల కొనుగోలులో ఒకరోజులో ఒక వ్యక్తి రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తం నగదుతో లావాదేవీ జరపడానికి అనుమతి లేదు. ఒకవేళ రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తం నగదుతో ఆభరణాలు తీసుకుంటే ఐటీ నిబంధనల్ని ఉల్లంఘించినట్లవుతుంది. ఆ సందర్భంలో ఎవరైతే నగదును స్వీకరించారో వాళ్లు లావాదేవీ మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి.

ఉదాహరణకు మీరు ఓ నగల దుకాణంలో రూ.4 లక్షల విలువ చేసే ఆభరణాలు కొనుగోలు చేశారనుకుందాం. ఇది ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 269ఎస్‌టీ ఉల్లంఘించినట్లే. ఈ క్రమంలో మీ దగ్గర నగదు తీసుకున్న నగల వ్యాపారి.. లావాదేవీ మొత్తాన్ని పెనాల్టీ కింద చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ అతను రూ.4 లక్షలు పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారం వ్యాపారే పెనాల్టీ చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో సాధారణంగా వారు రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తం నగదును స్వీకరించడానికి ముందుకురారు.

How to Apply for Gold Monetization Scheme : ఈ స్కీమ్​లో చేరండి.. మీ ఇంట్లో ఉన్న బంగారంతో డబ్బులు సంపాదించండి.!

How much Gold can Buy in Cash without Aadhaar : మీరు కొన్న బంగారం విలువ రూ.2 లక్షలు దాటితే.. ఒకవేళ మీరు రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో నగలు కొనాలంటే.. కచ్చితంగా పాన్‌ లేదా ఆధార్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఐటీ చట్టంలోని నిబంధన 114బీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. అయితే నగదుతో చెల్లిస్తున్నారా లేక ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తున్నారా అనే దానితో సంబంధం లేదు. మీరు కొనుగోలు చేసే బంగారం విలువ రూ.2 లక్షలు దాటితే తప్పనిసరిగా పాన్‌ లేదా ఆధార్‌ సమర్పించాల్సిందే.

What is Sovereign Gold Bonds : పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద మొత్తంలో గోల్డ్ కొనాలని భావించేవారికి ఇతర మంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఆకర్షణీయ స్థాయిలో కొన్నేళ్లలో రిటర్న్స్ అందించే సావరిన్ గోల్డ్ బాండ్స్‌ల్లో (SGB) పెట్టుబడి పెట్టడం మంచిదని పేర్కొంటున్నారు. మీరు ఇక్కడ వార్షిక ప్రాతిపదికన 2.50 శాతం వడ్డీ పొందుతారు. అలాగే ఇక్కడ మీరు గ్రాము నుంచి గరిష్ఠంగా 4 కేజీల వరకు బంగారం కొనుగోలు చేసే వీలు ఉంది. అదేవిధంగా యూనివర్సిటీలు, ట్రస్టులు వంటివి 20 కేజీల వరకు కొనేందుకు ఛాన్స్ ఉంటుంది.

Gold Loan Vs Personal Loan : గోల్డ్ లోన్​ Vs​ పర్సనల్ లోన్​.. ఏది బెస్ట్ ఆప్షన్​​!

Sovereign Gold Bonds : సావరిన్​ గోల్డ్ బాండ్​ సబ్​స్క్రిప్షన్ షురూ.. మీరూ ఇన్వెస్ట్ చేస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.