ETV Bharat / business

Home Loan Subsidy Schemes : సొంత ఇళ్లు కట్టుకోవాలా?.. తక్కువ వడ్డీకే రుణాలు సహా.. సబ్సిడీ ఇచ్చే బెస్ట్ స్కీమ్స్ ఇవే!

Home Loan Subsidy Schemes : సొంత ఇళ్లు కట్టుకోవాలని ఆశపడుతున్నారా? చేతిలో సరిపడా డబ్బు లేదా? అయితే ఇది మీ కోసమే. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన, స్మాల్ అర్బన్ హౌసింగ్​ రుణాలను అందిస్తోంది. ఈ పథకాల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందించడం సహా, లోన్ సబ్సిటీలను కూడా అందిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..

home loan interest subsidy scheme
Home Loan Subsidy Schemes
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 3:22 PM IST

Home Loan Subsidy Schemes : చాలా మందికి కొత్త ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే అందుకు సరిపడా సొమ్ములేక కాస్త వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికంగా సాయం చేస్తోంది. పండగ సీజన్​లో తక్కువ వడ్డీ రేట్లతో లోన్ ఇస్తోంది. పైగా సబ్సిడీలు కూడా అందిస్తోంది. ఆ పథకాలేంటి, ఎంత మేరకు రాయితీ పొందవచ్చు? ఏ మేరకు లోన్ తీసుకోవచ్చు? తదితర వివరాలు ఇప్పడు తెలుసుకుందాం. ​

ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన..
Pradhan Mantri Awas Yojana (PMAY) : ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు(EWS), తక్కువ, మధ్య స్థాయి ఆదాయ వర్గాలవారికి.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద హోమ్​లోన్ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. దాంతోపాటు లబ్ధిదారుల ఆదాయాన్ని అనుసరించి 6.5 శాతం వరకు సబ్సిడీలు కూడా ఇస్తోంది. ఈ స్కీమ్ ద్వారా 20 ఏళ్ల కాలవ్యవధితో రూ.50 లక్షల వరకు ఈ గృహ రుణాన్ని పొందవచ్చు.

క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్..
Credit Linked Subsidy Scheme (CLSS) : ప్రధాన మంత్రి ఆవాస్​ యోజనలో ఇదొక భాగం. తక్కువ ఆదాయ వర్గాలకు ఈ స్కీం ద్వారా లోన్​ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. 20 ఏళ్ల కాలవ్యవధితో ఈ స్కీంలో లోన్​ తీసుకోవచ్చు. ఇందులో కూడా 6.5 శాతం వరకు సబ్సిడీలు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు..
Stamp duty and registration fee waiver : ఈ పండగ సీజన్​లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గృహ రుణాలపై.. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులపై మినహాయింపులను అందిస్తున్నాయి.

వస్తు, సేవల పన్ను(GST)..
Goods and Services Tax (GST) Reduction : ఇటీవల కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలపై జీఎస్​టీ ఛార్జీలను తగ్గించింది . ఇళ్ల నిర్మాణాలపై 12 శాతంగా ఉన్న జీఎస్​టీని 5 శాతానికి తగ్గించింది. అదేవిధంగా ఇతర నిర్మాణాపై 18 శాతంగా ఉన్న జీఎస్​టీని 5 శాతానికి తీసుకువచ్చింది. దీంతో మొత్తం నిర్మాణంపై చాలా వరకు ఖర్చులు తగ్గనున్నాయి.

స్మాల్ అర్బన్ హౌసింగ్ స్కీమ్​
Interest Subsidy Scheme For Small Urban Housing : చిన్నచిన్న పట్టణాల్లో నివసించే ప్రజలు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు వీలు కల్పిస్తూ.. కోసం కేంద్ర ప్రభుత్వ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందుకోసం ఐదేళ్ల కాలంలో 60వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు రుణాన్ని అందిస్తోంది. పైగా ఈ పథకంలో భాగంగా 3% నుంచి 6.5% వరకు సబ్సిడీని కూడా అందిస్తోంది. తక్కువ ఆదాయం ఆర్జిస్తున్న దాదాపు 25 లక్షల మంది ఈ స్కీం ద్వారా లబ్ధి పొందనున్నారు.

Own House Benefits : అద్దె ఇళ్లు కంటే సొంతిల్లు బెటర్​​!.. ఎందుకో తెలుసా?

Home Loans With Low Interest Rates 2023 : తక్కువ వడ్డీకి.. హోమ్ లోన్స్​ అందించే బ్యాంకులివే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.