ETV Bharat / business

HDFC Merger impact : హెచ్​డీఎఫ్​సీ విలీనంతో.. హోమ్​ లోన్​, ఎఫ్​డీ వడ్డీ రేట్లు పెరుగుతాయా? - హెచ్​డీఎఫ్​సీ మెర్జర్​ ఇమ్​పాక్ట్​

HDFC Merger Impact On Rate Of Interest : హెచ్​డీఎఫ్​సీ విలీనం తర్వాత భారత దేశంలోనే అత్యంత విలువైన బ్యాంక్​గా హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు నిలిచింది. మరి ఇప్పుడు హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు.. హోంలోన్​, ఫిక్స్​డ్​ డిపాజిట్​, ఆర్​డీ ఖాతాల వడ్డీ రేట్లు ఏవిధంగా ఉండనున్నాయి? పూర్తి వివరాలు మీ కోసం..

HDFC Merger impact
HDFC Merger Impact On Rate Of Interest
author img

By

Published : Jul 2, 2023, 2:11 PM IST

HDFC and HDFC Bank Merger Impact : హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులో హెచ్​డీఎఫ్​సీ విలీన ప్రక్రియ జులై 1న పూర్తి అయ్యింది. దీనితో సుమారు రూ.18 లక్షల కోట్ల విలువైన భారతీయ ప్రైవేట్​ బ్యాంకుగా నిలిచింది. విలీనం అనంతరం 8,300 బ్యాంకు శాఖలు, 12 కోట్ల ఖాతాదారులు, 1.77 లక్షల మంది ఉద్యోగులతో దేశంలోనే నంబర్​ 1 బ్యాంకుగా అవతరించింది. మరి ఇలాంటి సమయంలో మోర్టగేజ్​ సంస్థ హెచ్​డీఎఫ్​సీలో హోమ్​లోన్​ తీసుకున్నవారి పరిస్థితి ఏమిటి? వడ్డీ రేట్లలో ఏమైనా మార్పులు ఉంటాయా?

హోమ్​లోన్​ కస్టమర్ల పరిస్థితి ఏమిటి?

  • హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్​లో హామ్​లోన్​ తీసుకున్న వారి ఖాతాలు.. ఇప్పుడు హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుకు బదిలీ అవుతాయి. కానీ లోన్​ అగ్రిమెంట్​, లోన్​ నంబర్​ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు.
  • హెచ్​డీఎఫ్​సీ ఖాతాదారుల హోమ్​లోన్​ వడ్డీ రేట్లు ఇంతకు ముందు రిటైల్​ ప్రైమ్​ లెండింగ్​ రేటు (ఆర్​పీఎల్​ఆర్​)కు అనుగుణంగా ఉండేవి. ఇకపై ఎక్స్​టర్నల్​ బెంచ్​ మార్క్​ లెండింగ్​ రేటు (ఈబీఎల్​ఆర్​)కు అనుసంధానం కానున్నాయి. ముఖ్యంగా ఇవి ఫ్లోటింగ్​ వడ్డీ రేట్లకు వర్తిస్తాయి.
  • HDFC Home Loan Interest Rate : ప్రస్తుతానికి గృహ రుణాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ.. భవిష్యత్​లో 'ఈబీఎల్​ఆర్'కు అనుగుణంగా వడ్డీ రేట్లలో మార్పులు ఉండవచ్చు.
  • ఇకపై హోమ్​లోన్​ ప్రీ పేమెంట్​కు సంబంధించి.. సంప్రదింపుల కోసం హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు శాఖలను సందర్శించవచ్చు. అదే విధంగా customer.service@hdfc.com కు కూడా మెయిల్​ చేయవచ్చు.
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్​​ ఉన్నవారు.. హెచ్​డీఎఫ్​సీ పోర్టల్​​లో లాగిన్​ కావచ్చు. అక్కడే తమ గృహ రుణాల వివరాలను తెలుసుకోవచ్చు.
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులో అకౌంట్​ లేనివారు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ హోమ్​లోన్​ సెక్షన్​లో పాత లాగిన్​ వివరాలతో సైన్​ఇన్ చేయవచ్చు.
  • ఇప్పుడు మీరు హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు వెబ్​సైట్​ నుంచి .. హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్​ హోమ్​లోన్​కు సంబంధించిన ఇంట్రెస్ట్​ సర్టిఫికేట్​ను కూడా డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. అలాగే customer.service@hdfc.com నుంచి కూడా పొందవచ్చు. లేదా హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ శాఖలను సంప్రదించవచ్చు.

ఫిక్స్​డ్ డిపాజిట్లు, రికరింగ్​ డిపాజిట్ల పరిస్థితి ఏమిటి?

  • HDFC FD Interest Rates : ప్రస్తుతం హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్​లోని ఫిక్స్​డ్​ డిపాజిట్ల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎఫ్​డీ మెచ్యూరిటీ, రెన్యువల్​ అయ్యేంత వరకు ప్రస్తుతం ఇస్తున్న వడ్డీ రేట్లు, మెచ్యూరిటీ అమౌంట్ యథాతథంగా కొనసాగుతాయి.
  • హెచ్​డీఎఫ్​సీలోని ఫిక్స్​డ్ డిపాజిట్​​ ఖాతా నంబర్​.. ఇప్పుడు కూడా అమలులో ఉంటుంది. కనుక హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుతో ఏదైనా సంప్రదింపులు చేయాలంటే.. ఈ ఎఫ్​డీ నంబర్​ ఉపయోగించవచ్చు. అయితే హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్​లోని ఫిక్స్​డ్​ డిపాజిట్​ వివరాలు.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులో పొందలేరు. కేవలం హెచ్​డీఎఫ్​సీ పోర్టల్​లో మాత్రమే ఆ వివరాలు ఉంటాయి.
  • HDFC RD Interest Rates : హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్ రికరింగ్​ డిపాజిట్లు విషయంలో కస్టమర్లకు నెలవారీ ఇన్​స్టాల్​మెంట్లు యథాతథంగా కొనసాగుతాయి. మీరు లింక్​ చేసిన అకౌంట్స్​ నుంచి డిపాజిట్​ చేయదలచిన సొమ్ము కట్​ అవుతుంది.
  • ఇప్పుడు ఎవరైనా కొత్త రికరింగ్​ డిపాజిట్ ఖాతా తెరవాలంటే.. కచ్చితంగా హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులో సేవింగ్స్​ అకౌంట్​ ఓపెన్​ చేయాలి. తరువాత రికరింగ్ డిపాజిట్​ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది.

HDFC Merger : హెచ్​డీఎఫ్​సీ విలీనం తరువాత గృహ రుణాలు, ఫిక్స్​డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు మొదలైన వాటి వడ్డీ రేట్ల విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే కనుక హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు అధికారిక వెబ్​సైట్​ను చూడండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.