Whatsapp Privacy Breach : స్మార్ట్‌ఫోన్ ఉపయోగించని సమయంలోనూ వాట్సాప్.. మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తోందన్న ఆరోపణలు నెట్టింట కలకలం రేపాయి. వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందన్న ఆందోళనలకు దారితీశాయి. సర్వత్రా చర్చనీయాంశమైన ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం స్పందించింది. నిజానిజాలు పరిశీలించి, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
వాట్సాప్ ఏం చేస్తోంది?
ట్విట్టర్లో ఇంజినీరింగ్ డైరెక్టర్‌గా పని చేసే ఫోవద్ దబిరి శనివారం ఓ ట్వీట్ చేశారు. మన మాటల్ని వాట్సాప్ రహస్యంగా రికార్డు చేస్తోందని ఆరోపించారు. తాను నిద్రపోతున్న సమయంలోనూ.. తన స్మార్ట్‌ఫోన్‌లోని మైక్రోఫోన్‌ను వాట్సాప్ ఉపయోగించిందని చెప్పారు. ఆ తర్వాత తాను నిద్రలేచి స్మార్ట్‌ఫోన్ వాడడం మొదలుపెట్టాక.. మైక్రోఫోన్ పని చేస్తూనే ఉందని తెలిపారు. ఇలా ఉదయం 4.20 నుంచి 6.53 మధ్య మైక్రోఫోన్‌ను వాట్సాప్ 9 సార్లు ఆన్ చేసిందని వివరించారు. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని ట్విట్టర్లో షేర్ చేశారు ఫోవద్ దబిరి. అసలు ఏం జరుగుతోందని వాట్సాప్‌ను ప్రశ్నించారు.
-
WhatsApp cannot be trusted https://t.co/3gdNxZOLLy
— Elon Musk (@elonmusk) May 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">WhatsApp cannot be trusted https://t.co/3gdNxZOLLy
— Elon Musk (@elonmusk) May 9, 2023WhatsApp cannot be trusted https://t.co/3gdNxZOLLy
— Elon Musk (@elonmusk) May 9, 2023
వాట్సాప్‌ను నమ్మలేం!
బుధవారం మధ్యాహ్నానికి 6.7కోట్ల వ్యూస్‌తో దబిరి ట్వీట్ వైరల్ అయింది. అనేక మంది యూజర్లు వాట్సాప్‌పై మండిపడ్డారు. టెస్లా, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్.. ఈ వ్యవహారంపై స్పందించారు. వాట్సాప్‌ను నమ్మలేమంటూ దబిరి ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.
-
This is an unacceptable breach n violation of #Privacy
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) May 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
We will be examinig this immdtly and will act on any violation of privacy even as new Digital Personal Data protection bill #DPDP is being readied.@GoI_MeitY @_DigitalIndia https://t.co/vtFrST4bKP
">This is an unacceptable breach n violation of #Privacy
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) May 10, 2023
We will be examinig this immdtly and will act on any violation of privacy even as new Digital Personal Data protection bill #DPDP is being readied.@GoI_MeitY @_DigitalIndia https://t.co/vtFrST4bKPThis is an unacceptable breach n violation of #Privacy
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) May 10, 2023
We will be examinig this immdtly and will act on any violation of privacy even as new Digital Personal Data protection bill #DPDP is being readied.@GoI_MeitY @_DigitalIndia https://t.co/vtFrST4bKP
స్పందించిన ఐటీ మంత్రి
వాట్సాప్-మైక్రోఫోన్ రికార్డింగ్‌కు సంబంధించి దబిరి ట్వీట్‌పై భారత ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం స్పందించారు. యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందేమో ప్రభుత్వం పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో యూజర్లకు రక్షణగా నిలిచే "డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు" సిద్ధమవుతోందని మంత్రి గుర్తు చేశారు.
వాట్సాప్ వివరణ
ఫోవద్ దబిరి ట్వీట్ వైరల్ అయిన నేపథ్యంలో వాట్సాప్ వివరణ ఇచ్చింది. "పిక్సల్ ఫోన్, వాట్సాప్‌నకు సంబంధించి ట్వీట్ చేసిన ట్విట్టర్ ఇంజినీర్‌తో మేము మాట్లాడుతున్నాం. ఆండ్రాయిడ్‌లోని ఓ బగ్ కారణంగానే ఇలా జరుగుతోందని మేము భావిస్తున్నాం. ప్రైవసీ డ్యాష్‌బోర్డ్‌లోని సమాచారాన్ని ఆ బగ్.. తప్పుగా చూపిస్తోంది. ఈ వ్యవహారాన్ని పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని గూగుల్‌ను కోరాం" అని వాట్సాప్ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
మైక్రోఫోన్ సెట్టింగ్స్ విషయంలో యూజర్లకే పూర్తి నియంత్రణ ఉంటుందని వాట్సాప్ స్పష్టం చేసింది. "ఒక్కసారి పర్మిషన్ ఇస్తే.. కాల్, రికార్డింగ్, వాయిస్ నోట్, వీడియో కాల్ చేస్తున్నప్పుడు మాత్రమే వాట్సాప్.. స్మార్ట్‌ఫోన్‌లోని మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తుంది. ఈ సంభాషణలు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి. వాటిని వాట్సాప్ వినలేదు" అని చెబుతూ యాజర్ల భయాల్ని తొలగించే ప్రయత్నం చేసింది వాట్సాప్.
ట్విట్టర్లో వాట్సాప్ తరహా ఫీచర్స్!
వాట్సాప్‌లో వ్యక్తిగత గోప్యతపై అనుమానాల మధ్య.. ట్విట్టర్ కీలక ప్రకటన చేసింది. వాట్సాప్‌లో ఉన్న వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్లను ట్విట్టర్లోనూ తీసుకొస్తున్నట్లు వెల్లడించారు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్.
"ట్విట్టర్ లేటెస్ట్ వెర్షన్ యాప్‌తో.. ట్వీట్ థ్రెడ్‌లోని ఏదైనా మెసేజ్‌కు మీరు డీఎం(డైరెక్ట్ మెసేజ్) చేయవచ్చు. ఎమోజీ రియాక్షన్స్ ఇవ్వొచ్చు. ఎన్క్రిప్టెడ్ DMs V1.0 గురువారమే అందుబాటులోకి వస్తుంది. తర్వాత మరింత అప్డేట్ అవుతుంది. మీ డైరెక్ట్ మెసేజ్‌లను నేను కూడా చూడలేనంతగా ఎన్‌క్రిప్ట్ చేయడమే అసలు పరీక్ష. మీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఎవరితోనైనా వాయిస్, వీడియో చాట్ చేసే అవకాశం త్వరలోనే వస్తుంది. అదే జరిగితే.. మీ మొబైల్ నంబర్ ఇవ్వకుండానే ఈ ప్రపంచంలో ఎవరితోనైనా మీరు మాట్లాడవచ్చు." అని బుధవారం ఓ ట్వీట్ చేశారు ఎలాన్ మస్క్.