ETV Bharat / business

'అప్పటికల్లా దేశీయ చిప్‌ల తయారీయే మా లక్ష్యం' - కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ కీలక ప్రకటన

semiconductors in India: దేశంలో 2023-24 కల్లా దేశీయంగా తయారైన తొలి చిప్‌ సెట్‌ల వాణిజ్య విక్రయాలు ప్రారంభం అయ్యేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. డిజిటల్‌ ఇండియా ఆర్‌ఐఎస్‌సీ- వి (డీఐఆర్‌-వి) కార్యక్రమం కింద దీనిని చేపట్టనున్నట్లు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

semiconductor
సెమీ కండక్టర్లు
author img

By

Published : Apr 28, 2022, 4:58 AM IST

semiconductors in India: 2023-24 కల్లా దేశీయంగా తయారైన తొలి చిప్‌ సెట్‌ల (సెమీ కండక్టర్లు) వాణిజ్య విక్రయాలు ప్రారంభం అయ్యేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. బుధవారం శ్రీకారం చుట్టిన డిజిటల్‌ ఇండియా ఆర్‌ఐఎస్‌సీ- వి (డీఐఆర్‌-వి) కార్యక్రమం కింద దీనిని చేపట్టనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

దేశంలో మొబిలిటీ, కంప్యూటింగ్‌, డిజిటలీకరణ అవసరాలను తీర్చేందుకు కావాల్సిన భవిష్యతరం మైక్రోప్రాసెసర్లను తయారు చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. 2023 డిసెంబరు కల్లా లేదంటే 2024 ప్రారంభంలో శక్తి, వేగా సిలికాన్‌ ప్రాసెసర్లను అందుబాటులోకి తేవాలనే ఓ కీలక లక్ష్యంపై దృష్టి పెట్టామని ఆయన అన్నారు. 2023-24 లోగా కనీసం కొన్ని కంపెనీలైనా వాటి ప్రోడక్ట్‌ డిజైన్‌లకు డీఐఆర్‌ ఉత్పత్తులైన శక్తి, వేగాలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానని మంత్రి చెప్పారు. సిలికాన్‌ సిద్ధమైతే.. అవి తయారీ ప్రారంభించి, ఉత్పత్తుల్లో చిప్‌లను అమరుస్తాయని విలేకరులకు చంద్రశేఖర్‌ చెప్పారు.

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖలోని మైక్రోప్రాసెసర్‌ డెవలప్‌ ప్రోగ్రామ్‌ కింద ఓపెన్‌ సోర్స్‌ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించి ఐఐటీ మద్రాస్‌, సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ కంప్యూటింగ్‌ (సీడీఏసీ)లు వరుసగా శక్తి (32 బిట్‌), వేగా (64 బిట్‌) పేరుతో రెండు మైక్రోప్రాసెసర్లను అభివృద్ధి చేశాయి. డీఐఆర్‌ కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.కామకోటిని ప్రధాన ఆర్కిటెక్ట్‌గా, సీడీఏసీ త్రివేండ్రం శాస్త్రవేత్త కృష్ణకుమార్‌ రావును ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా ప్రభుత్వం నియమించింది. దేశంలో సెమీకండక్టర్‌ తయారీ వ్యవస్థను ప్రోత్సహించేందుకు రూ.76,000 కోట్లతో ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమంలో భాగంగా డీఐఆర్‌- వి ని రూపొందించారు.

ఇదీ చదవండి: వాట్సాప్​ బంపర్​ ఆఫర్​.. ఆ ఫీచర్​ వాడితే భారీగా క్యాష్​బ్యాక్​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.