ETV Bharat / business

ప్లే స్టోర్​లో గూగుల్​ 'మాయ'.. రూ.936కోట్లు ఫైన్ వేసిన భారత్ - గూగుల్​కు సీసీఐ జరిమానా

టెక్ దిగ్గజం గూగుల్​కు మరో భారీ షాక్ ఇచ్చింది కాంపిటీషన్ కమిషన్​ ఆఫ్​ ఇండియా. ప్లే స్టోర్ విషయంలో అక్రమాలకు పాల్పడిందని నిర్ధరిస్తూ రూ.936.44కోట్లు జరిమానా విధించింది.

google cci india case
ప్లే స్టోర్​లో గూగుల్​ మాయ.. రూ.936కోట్లు ఫైన్ వేసిన భారత్
author img

By

Published : Oct 25, 2022, 5:42 PM IST

Updated : Oct 25, 2022, 5:54 PM IST

టెక్ దిగ్గజం గూగుల్​కు వారం వ్యవధిలోనే రెండోసారి భారీ జరిమానా పడింది. ప్లే స్టోర్​ పాలసీల విషయంలో ఆ సంస్థ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని నిర్ధరిస్తూ ఏకంగా రూ.936.44కోట్లు ఫైన్ వేసింది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ). ప్లే స్టోర్​లో సొంత యాప్​లే ముందు వచ్చేలా చేసే విధానాల్ని తక్షణమే మానుకోవాలని స్పష్టం చేసింది. నిర్ణీత కాలవ్యవధిలోగా పనితీరును మార్చుకోవాలని సూచించింది.

అక్టోబర్ 20న గూగుల్​కు రూ.1,337.76కోట్లు జరిమానా వేసింది కాంపిటీషన్ కమిషన్​ ఆఫ్ ఇండియా. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్​ల విషయంలో అనైతిక వ్యాపార విధానాలు అవలంబిస్తోందని ఈమేరకు చర్యలు తీసుకుంది. ఇది జరిగిన ఐదు రోజుల్లోనే మరోసారి గూగుల్​కు భారీ ఫైన్ వేసింది సీసీఐ.

Last Updated : Oct 25, 2022, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.