Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. సోమవారం అతి స్వల్పంగా రూ.10 మాత్రమే పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,670 వద్ద ఉంది. వెండి ధర కూడా స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో రూ.62,734 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,670గా ఉంది. కిలో వెండి ధర రూ.62,734 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,670గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,734గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,670గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,734 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,670గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,734 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 1843 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.69 డాలర్లుగా ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.78 వద్ద ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీలు సోమవారం వృద్ధిని నమోదు చేశాయి. బిట్ కాయిన్ విలువ రూ.54వేలకుపైగా పెరిగి ప్రస్తుతంరూ.16,04,807వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్ కాయిన్ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.16,04,807 |
ఇథీరియం | రూ.87,692 |
టెథర్ | రూ.77.87 |
బినాన్స్ కాయిన్ | రూ.16,507 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.00 |
మార్కెట్లకు స్వల్ప లాభాలు: స్టాక్ మార్కెట్లు ఈ వారం తొలిరోజును లాభాలతో ముగించాయి. ఉదయం సెషన్ నుంచి ఆద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు చివర్లో కాస్త కోలుకున్నాయి. సెన్సెక్స్ 237 పాయింట్లు వృద్ధి చెంది 51,598వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57పాయింట్లు మెరుగుపడి 15,350వద్దకు చేరింది.
హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా షేర్లు లాభాలను ఆర్జించాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలు చవిచూశాయి.
ఇదీ చదవండి: డెబిట్, క్రెడిట్ కార్డులకు ఆర్బీఐ కొత్త రూల్స్.. పేమెంట్స్ ఇక భద్రం!