Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.2,100 భారీగా పెరిగి.. ప్రస్తుతం రూ.58,200 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,150 ఎకబాకి.. ప్రస్తుతం రూ.67,900 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.58,200 గా ఉంది. కిలో వెండి ధర రూ.67,900 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.58,200 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,900 గా ఉంది.
- Gold price in Vishakhapatnam: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,200 గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,900 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.58,200 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.67,900 గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1837.10 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.84 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.19,96,790 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.19,96,790 |
ఇథీరియం | రూ.1,35,996 |
టెథర్ | రూ.82.82 |
బైనాన్స్ కాయిన్ | రూ.25,452 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.81 |
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో 60,370 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 90 పాయింట్లు నష్టపోయి 17,739 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క సన్‌ఫార్మా మాత్రమే లాభాల్లో ఉంది. విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి మారకం విలువ..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 3 పైసలు పడిపోయి 82.82 వద్ద కొనసాగుతోంది.