Gold Price Today: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. మంగళవారం 52,790 వద్ద ఉండగా.. బుధవారం రూ.150 పెరిగింది. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ. 52 వేల 940 వద్దకు చేరుకుంది. కిలో వెండి ధర 750 పెరిగి.. ప్రస్తుతం రూ.63,700 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ. 52,940గా ఉంది. కిలో వెండి ధర రూ.63,700వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,940 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,700 గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,940గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,700 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,940గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,700 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ స్పాట్ గోల్డ్ ధర స్వల్పంగా తగ్గింది. ఔన్సు బంగారం 1,862 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 22.07 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్‌కాయిన్ విలువ క్రితం రోజుతో పోల్చితే పెరిగింది. ప్రస్తుతం రూ. 23,31,580 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్ కాయిన్ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.23,31,580 |
ఇథీరియం | రూ.1,55,507 |
టెథర్ | రూ.77.36 |
బినాన్స్ కాయిన్ | రూ.25,862 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.28 |
ఇదీ చదవండి: గోల్డ్‌లోన్ వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎలా ఉన్నాయంటే..