Gold Rate Today : దేశంలో మరోసారి బంగారం, వెండి ధరలు తగ్గాయి. బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర మాత్రం భారీగానే క్షీణించింది. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,252గా ఉండగా.. గురువారం రూ.150 తగ్గి రూ.61,102కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.76,150గా ఉండగా.. గురువారం ఏకంగా రూ.1620 తగ్గి రూ.74,530కి చేరుకుంది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,102గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.74,530గా ఉంది.
- Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,102గా ఉంది. కిలో వెండి ధర రూ.74,530కు చేరుకుంది.
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,102గా ఉంది. కిలో వెండి ధర రూ.74,530గా ఉంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,102గా ఉంది. కిలో వెండి ధర రూ.74,530కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price : అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1960 డాలర్లుగా ఉండగా.. గురువారం ఏకంగా 26 డాలర్లు మేర తగ్గి 1934 డాలర్లకు చేరుకుంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 23.65 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,05,297 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. దీనికి తోడు బైనాన్స్ కాయిన్, ఇథీరియం కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. టెథర్, యూఎస్డీ కాయిన్ మాత్రం లాభాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,05,297 |
ఇథీరియం | రూ.1,51,634 |
టెథర్ | రూ. 82.63 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,815 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.69 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్..
Stock Market Today : అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో గురువారం ఇండియన్ స్టాక్ మార్కెట్ల సూచీలు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 137 పాయింట్లు కోల్పోయి 65,645 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 35 పాయింట్లు నష్టపోయి 19,491 వద్ద ట్రేడ్ అవుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్లు..
సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, రిలయన్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ, పవర్‌గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు..
యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్, విప్రో, మారుతీ, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, టైటాన్ స్టాక్‌లు నష్టాల్లో ఉన్నాయి.
రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 5 పైసలు తగ్గి రూ.82.72 వద్ద ట్రేడవుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.92గా ఉంది. డీజిల్ ధర రూ.97.78గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.