Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,275గా ఉండగా.. సోమవారం రూ.30 తగ్గి రూ.61,245కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.74,475గా ఉండగా.. రూ.295 తగ్గి సోమవారం రూ.74,180కు చేరుకుంది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,245గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.74,180గా ఉంది.
- Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,245గా ఉంది. కిలో వెండి ధర రూ.74,180కు చేరుకుంది.
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,245గా ఉంది. కిలో వెండి ధర రూ.74,180గా ఉంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,245గా ఉంది. కిలో వెండి ధర రూ.74,180కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1943 డాలర్లుగా ఉండగా.. సోమవారం 5 డాలర్లు మేరకు తగ్గి 1938 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 23.53 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మంచి జోరు మీద కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,10,293 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే...
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,10,293 |
ఇథీరియం | రూ.1,52,074 |
టెథర్ | రూ.82.58 |
బైనాన్స్ కాయిన్ | రూ.20,151 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.72 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్..
Stock market Today : దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నప్పటికీ.. ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ షేర్స్ కొనుగోలుకు బయ్యర్లు మొగ్గు చూపుతుండడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకెళ్తున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 202 పాయింట్లు లాభపడి 65,923 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 57 పాయింట్లు వృద్ధి చెంది 19,574 వద్ద ట్రేడ్ అవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : రిలయన్స్, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి సుజుకి
- నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు : ఎస్బీఐ, టైటాన్, కోటక్‌బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు
రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 10 పైసలు పెరిగి రూ.82.71 వద్ద ట్రేడవుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడి చమురు ధర
Crude Oil Prices : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.06 శాతం వరకు తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 86.09 డాలర్లుగా ఉంది.