Gold Rate Today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,102గా ఉండగా.. శుక్రవారం కేవలం రూ.10 పెరిగి రూ.61,112కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.74,530గా ఉండగా.. రూ.217 తగ్గి శుక్రవారం రూ.74,310కు చేరుకుంది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,112గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.74,310గా ఉంది.
- Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,112గా ఉంది. కిలో వెండి ధర రూ.74,310కు చేరుకుంది.
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,112గా ఉంది. కిలో వెండి ధర రూ.74,310గా ఉంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,112గా ఉంది. కిలో వెండి ధర రూ.74,310కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1934 డాలర్లుగా ఉండగా.. శుక్రవారం కేవలం ఒక డాలరు మాత్రమే పెరిగి 1935 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 23.54 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,10,871 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం కూడా నష్టాల్లో ఉండగా.. టెథర్, బైనాన్స్ కాయిన్, యూఎస్డీ కాయిన్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే...
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,10,871 |
ఇథీరియం | రూ.1,51,653 |
టెథర్ | రూ.82.68 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,969 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.76 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్..
Stock market Today : దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. దీనితో మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడినట్లు అయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నప్పటికీ.. బయర్లు ఐటీ స్టాక్స్ కొనుగోలుకు మొగ్గు చూపుతుండడం వల్ల మార్కెట్లు మరలా లాభాలబాట పట్టాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 278 పాయింట్లు లాభపడి 65,519 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 84 పాయింట్లు వృద్ధి చెంది 19,466 వద్ద ట్రేడ్ అవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, టైటాన్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, మారుతి సుజుకి
- నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు : సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్, కోటక్ బ్యాంకు
రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 3 పైసలు క్షీణించి రూ.82.32 వద్ద ట్రేడవుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడి చమురు ధర
Crude Oil Price : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.12 శాతం పెరిగింది. దీనితో బ్యారెల్ ముడిచమురు ధర 85.24 డాలర్లకు చేరుకుంది.