Gold Rate Today 5th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,400గా ఉండగా.. మంగళవారం రూ.470 తగ్గి రూ.60,930 వద్దకు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.75,915గా ఉండగా.. మంగళవారం రూ.1,030 తగ్గి రూ.74,885కు చేరింది.
- Gold Price In Hyderabad 5th September 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,930గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.74,885గా ఉంది.
- Gold Price In Vijayawada 5th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,930గా ఉంది. కిలో వెండి ధర రూ.74,885కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 5th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,930గా ఉంది. కిలో వెండి ధర రూ.74,885గా ఉంది.
- Gold Price In Proddatur 5th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,930గా ఉంది. కిలో వెండి ధర రూ.74,885కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయని గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 5th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1945 డాలర్లుగా ఉండగా.. మంగళవారం 1937 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 23.89డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 5th September 2023 : మంగళవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,20,983 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.21,20,983 |
ఇథీరియం | రూ.1,33,450 |
టెథర్ | రూ.82.75 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,700 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.79 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today 5th September 2023 : మంగవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. దేశీయ జీడీపీ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉండడం వల్ల మదుపరులు మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా మూడో రోజు కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 76 పాయింట్లు లాభపడి 65,704 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 26 పాయింట్లు వృద్ధి చెంది 19,555 వద్ద ట్రేడ్ అవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : టైటాన్, రిలయన్స్, సన్‌ఫార్మా, ఐటీసీ, విప్రో, ఇన్ఫోసిస్
- నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు : ఎన్టీపీసీ, టాటాస్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఏసియన్ పెయింట్స్, ఎస్బీఐ
రూపాయి విలువ!
Rupee Open 5th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు తగ్గి రూ.82.84 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 5th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడి చమురు ధరలు
Crude Oil Price 5th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.07 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 88.94 డాలర్లుగా ఉంది.