Gold Rate Today 28th August 2023 : దేశంలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,045గా ఉండగా.. సోమవారం రూ.4 పెరిగి రూ.60,049కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం కిలో వెండి ధర రూ.75,550గా ఉండగా.. సోమవారం నాటికి రూ.85 పెరిగి రూ.75,635కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 28th August 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,049గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,635గా ఉంది.
- Gold Price In Vijayawada 28th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,049గా ఉంది. కిలో వెండి ధర రూ.75,635గా ఉంది.
- Gold Price In Vishakhapatnam 28th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,049గా ఉంది. కిలో వెండి ధర రూ.75,635గా ఉంది.
- Gold Price In Proddatur 28th August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,049గా ఉంది. కిలో వెండి ధర రూ.75,635గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 28th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1914.80 డాలర్లుగా ఉండగా.. సోమవారం 1917 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 24.21 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 28th August 2023 : యూఎస్డీ కాయిన్ మినహా సోమవారం ప్రధాన క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా, ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,47,035 వద్ద స్తబ్దుగా ఉంది. ఇథీరియం, టెథర్, బైనాన్స్ కాయిన్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.21,47,035 |
ఇథీరియం | రూ.1,36,136 |
టెథర్ | రూ.82.54 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,981 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.57 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్..
Stock market Today 28th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 30 పాయింట్లు లాభపడి 64,916 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 18 పాయింట్ల లాభంతో 19,284 వద్ద ట్రేడ్ అవుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్లు..
మారుతీ, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐటీసీ, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్‌ల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు..
టీసీఎస్, టైటాన్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యంక్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫీ, భారతి ఎయిర్టెల్, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్ స్టాక్‌లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ!
Rupee Open 28th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు ఎగబాకి రూ.82.56 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 28th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.36గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
క్రూడ్ ఆయిల్ రేట్..!
Crude Oil Rates Today 28th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.11 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 84.39 డాలర్లుగా ఉంది.