Gold Rate Today 17th August 2023 : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,065గా ఉండగా.. గురువారం నాటికి రూ.45 తగ్గి రూ.60,020కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం కిలో వెండి ధర రూ.72,051గా ఉండగా.. గురువారం రూ.531 తగ్గి రూ.71,520కు చేరింది.
- Gold Price In Hyderabad 17th August 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,020గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,520గా ఉంది.
- Gold Price In Vijayawada 17th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,020గా ఉంది. కిలో వెండి ధర రూ.71,520కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 17th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,020గా ఉంది. కిలో వెండి ధర రూ.71,520గా ఉంది.
- Gold Price In Proddatur 17th August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,020గా ఉంది. కిలో వెండి ధర రూ.71,520కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 17th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1905 డాలర్లుగా ఉండగా.. గురువారం 1893 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు కూడా భారీగానే తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 22.46 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 17th August 2023 : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పూర్తి నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.23,72,685 వద్ద ట్రేడవుతోంది. దీనికి తోడు ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్, యూఎస్డీ కాయిన్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.23,72,685 |
ఇథీరియం | రూ.1,49,132 |
టెథర్ | రూ.82.93 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,116 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.2 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్..
Stock market Today 17th August 2023 : అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో గురువారం దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 239 పాయింట్లు నష్టపోయి 65,300 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 75 పాయింట్లు కోల్పోయి 19,390 వద్ద ట్రేడ్ అవుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్లు..
టైటాన్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, మారుతీ, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంకుల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు..
ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, సన్‌ఫార్మా, రిలయన్స్, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, హెచ్‌యూఎల్, విప్రో, ఇన్ఫీ, హెచ్డీఎఫ్సీ స్టాక్‌లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ!
Rupee Open 17th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 9 పైసలు ఎగబాకి రూ.82.99 వద్ద ట్రేడవుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 17th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.36గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడిచమురు ధర..!
Crude Oil Rates Today 17th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.12 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 83.55 డాలర్లుగా ఉంది.
PPF Vs EPF Vs VPF : పీపీఎఫ్ Vs ఈపీఎఫ్ Vs వీపీఎఫ్.. వీటి పన్నుల భారం ఎంత?
Reasons For Credit Card Limit Decrease : మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గిందా?.. కారణాలు ఇవే!