Gold Rate Today 11th August 2023 : దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,070 ఉండగా.. శుక్రవారం నాటికి రూ.485 పెరిగి రూ.60,555కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.72,050గా ఉండగా.. రూ.95 తగ్గి శుక్రవారం రూ.71,955కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 11th August 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,555గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,955గా ఉంది.
- Gold Price In Vijayawada 11th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,555గా ఉంది. కిలో వెండి ధర రూ.71,955కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 11th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,555గా ఉంది. కిలో వెండి ధర రూ.71,955గా ఉంది.
- Gold Price In Proddatur 11th August 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,555గా ఉంది. కిలో వెండి ధర రూ.71,955కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 11th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు క్రమంగా దిగివస్తున్నాయి. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1919 డాలర్లుగా ఉండగా.. శుక్రవారం 4 డాలర్లు మేరకు తగ్గి 1913 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 22.69 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 11th August 2023 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,30,430 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్, యూఎస్డీ కాయిన్ కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,30,430 |
ఇథీరియం | రూ.1,52,316 |
టెథర్ | రూ.82.63 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,882 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.74 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్..
Stock Market Today 11th August 2023 : శుక్రవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం సహా, విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 245 పాయింట్లు నష్టపోయి 65,442 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 73 పాయింట్లు కోల్పోయి 19,469 వద్ద ట్రేడ్ అవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్, టైటాన్, మారుతి సుజుకి, టాటాస్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ
- నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు : ఇండస్ఇండ్ బ్యాంకు, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకు, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఏసియన్ పెయింట్స్
రూపాయి విలువ!
Rupee Open 11th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 8 పైసలు తగ్గి రూ.82.74 వద్ద ట్రేడవుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 11th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Rates Today 11th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.02 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 86.38 డాలర్లుగా ఉంది.