Gold Rate Today : దేశంలో బంగారం ధర 60వేల రూపాయలకు చేరింది. వెండి ధర మాత్రం 68,830 రూపాయలుగా ఉంది. శుక్రవారం పది గ్రాముల బంగారం ధర 160 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర 430 రూపాయలు పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర 68,830 రూపాయలుగా ఉంది.
Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.60,000గా ఉంది. కిలో వెండి ధర రూ.68,830 వద్ద కొనసాగుతోంది.
Gold price in Vishakhapatnam: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,830గా ఉంది.
Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర 60,000 రూపాయలుగా ఉంది. కేజీ వెండి ధర రూ.68,830 వద్ద ఉంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1931 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.93 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,25,646 పలుకుతోంది. ఇథీరియం, క్రిప్టోకరెన్సీలతో పాటుగా మరికొన్నింటి ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.21,25,646 |
ఇథీరియం | రూ.1,40,511 |
టెథర్ | రూ.82.69 |
బైనాన్స్ కాయిన్ | రూ.27,223 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.46 |
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీల జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ 404 పాయింట్ల వృద్ధితో.. ప్రస్తుతం అది 58,039 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 17,097 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ షేర్లు ఎక్కువగా లాభపడుతున్న జాబితాలో ఉన్నాయి. టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
160 బిలియన్ డాలర్ల నిధికి ముందుకొచ్చిన బ్యాంకులు..
గురువారం అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. "ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్"ను ఆదుకునేందుకు అమెరికాలోని పెద్ద బ్యాంకులన్నీ ముందుకొచ్చాయి. అన్ని కలిసి 30 బిలియన్ డాలర్లను సమకూర్చేందుకు సిద్ధమయ్యాయి. అదే విధంగా దాదాపు 160 బిలియన్ డాలర్లతో నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తరహా పతనాన్ని భవిష్యత్తులో అరికట్టేందుకు ఈ నిధిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.