Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.270 తగ్గి రూ.53,720 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.30 తగ్గి.. రూ.60వేల వద్ద కదలాడుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,720 గా ఉంది. కిలో వెండి ధర రూ.60,010 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,720 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.60 వేలుగా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,720 గా ఉంది. కేజీ వెండి ధర రూ.60 వేల వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,720 గా ఉంది. కేజీ వెండి ధర రూ.60 వేల వద్ద కొనసాగుతోంది.
- స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,784 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 20.45 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ:బిట్‌కాయిన్ విలువ రూ.52,656 పెరిగింది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.20,12,656 పలుకుతోంది. ఇథీరియం రూ.13,715 మేర పెరిగింది. ప్రస్తుతం రూ.1,44,230 వద్ద కొనసాగుతోంది.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.20,12,656 |
ఇథీరియం | రూ.1,56,967 |
టెథర్ | రూ.83.32 |
బినాన్స్ కాయిన్ | రూ.27,418 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.69 |
స్టాక్ మార్కెట్లు: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఐటీ, ఫినాన్షియల్, బ్యాంకింగ్ రంగాల స్టాక్స్ కొనుగోళ్లతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలతో స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్.. 588 పాయింట్ల లాభంతో 59,405 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 156 పాయింట్లు లాభపడి 17,691 వద్ద కదలాడుతోంది.
లాభనష్టాల్లోనివి: టెక్ మహీంద్రా, యాక్సిక్ బ్యాంక్, టైటాన్ కంపెనీ, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా.. టాటా కాన్స్, అపోలో హాస్పిటల్, దివీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
రూపాయి: అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ గురువారం స్వల్పంగా తగ్గింది. గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో 6 పైసలు నష్టపోయి.. ప్రస్తుతం 79.31కు చేరింది.
ఇవీ చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. విమాన టికెట్ ధరలకు ఇక రెక్కలు!
ఆన్లైన్ రుణాలపై ఆర్‌బీఐ కీలక మార్గదర్శకాలు! ఇకపై ఆ సమాచారమంతా ఇవ్వాల్సిందే