Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.80 తగ్గి.. రూ.52,640 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.550కుపైగా తగ్గి.. రూ.62,668గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,640గా ఉంది. కిలో వెండి ధర రూ.62,668 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,640గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,668గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,640గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,668 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,640గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,668 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర కూడా పెరిగింది. ప్రస్తుతం 1840 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.69 డాలర్లుగా ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 78.01 వద్ద ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీలు కూడా స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ రూ.17,01,049 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్ కాయిన్ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.17,01,049 |
ఇథీరియం | రూ.89,614 |
టెథర్ | రూ.83.24 |
బినాన్స్ కాయిన్ | రూ.17,644 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.41 |
ఇదీ చూడండి : ఆర్బీఐ కీలక నిర్ణయం.. మాస్టర్ కార్డ్‌పై ఆంక్షలు ఎత్తివేత