Gold Hallmarking 3rd Phase : బంగారు ఆభరణాలు, కళాఖండాలకు తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ చేసే మూడో దశ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోని 16 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 55 కొత్త జిల్లాల్లో ఈ మూడో దశ హాల్‌మార్కింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 8 నుంచి అమలులోకి వచ్చిందని స్పష్టం చేసింది.
బంగారం స్వచ్ఛతను తెలుపుతుంది!
How To Check Gold Purity : గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధ్రువీకరిస్తుంది. వాస్తవానికి 2021 జూన్ 16 వరకు బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా హాల్‌మార్క్ ఉండాలనే నిబంధన ఉండేది కాదు. దీనితో కేంద్ర ప్రభుత్వం దీనిని దశలవారీగా, తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించింది.
మూడు దశల్లో..
Gold Hallmarking Phases In India :
- 2021 జూన్ 23న మొదలైన తొలిదశలో దేశంలోని 343 జిల్లాల్లో బంగారు ఆభరణాలు, కళాఖండాలపై గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేశారు.
- 2022 ఏప్రిల్ 4న ప్రారంభమైన రెండో దశలో దేశంలోని 256 + 32 జిల్లాల్లో హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేశారు.
- వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకారం, 2023 సెప్టెంబర్ 8న మూడో దశ ప్రారంభమైంది. ఈ దశలో దేశంలోని 55 కొత్త జిల్లాల్లో పసిడి ఆభరణాలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేశారు.
ఏపీ, తెలంగాణల్లో..
ఆంధ్రప్రదేశ్‌లోని 5 జిల్లాలు, తెలంగాణలోని 4 జిల్లాల్లో ఈ మూడో దశ గోల్డ్ హాల్‌మార్కింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 8తో మొదలైంది.
- ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలు : అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల్ జిల్లాలు.
- తెలంగాణలోని జిల్లాలు : మేడ్చల్ - మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్, మెహబూబ్‌నగర్.
రాష్ట్రాలు - జిల్లాలు
మూడో దశలో.. బిహార్ - 8, ఆంధ్రప్రదేశ్ - 5, ఉత్తరప్రదేశ్ - 5, మహారాష్ట్ర - 5, తెలంగాణ - 4, హరియాణ - 3, జమ్ము కశ్మీర్ - 3, పంజాబ్ - 3, కర్ణాటక - 3, తమిళనాడు - 3, అసోం - 2, గుజరాత్ - 2, ఝార్ఖండ్ - 2, మధ్యప్రదేశ్ - 2, ఉత్తరాఖండ్ - 2, బంగాల్ - 2, రాజస్థాన్ - 1 జిల్లాల్లో గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేశారు.
విజయవంతంగా..
BIS Hallmark In India : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) మొదటి రెండు దశల్లో గోల్డ్ హాల్‌మార్కింగ్ విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. దాదాపుగా ప్రతి రోజూ 4 లక్షల బంగారు ఆభరణాలపై 'హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్' (HUID) హాల్‌మార్క్ వేయడం జరిగింది.
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకారం, 'గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసినప్పటి నుంచి.. రిజిస్టర్డ్ నగల వ్యాపారుల సంఖ్య 34,647 నుంచి ఏకంగా 1,81,590 మందికి పెరిగింది. అలాగే బంగారం పరీక్ష కేంద్రాలు, హాల్‌మార్కింగ్ కేంద్రాలు (AHCs) కూడా 945 నుంచి 1,471కి పెరిగాయి. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు దేశంలో 26 కోట్లకు పైగా పసిడి ఆభరణాలపై హాల్‌మార్కింగ్ జరిగింది.'
వినియోగదారులు బంగారం నాణ్యతను ఎలా చెక్ చేసుకోవాలి?
How To Check Gold Quality In BIS Care App : వినియోగదారులు బంగారం ఆభరణాలు కొనేముందు..
1. గూగుల్ ప్లేస్టోర్ నుంచి BIS Care Appను డౌన్లోడ్ చేసుకోవాలి.
2. యాప్‌లో బంగారం ఆభరణంపై ఉన్న HUID నంబర్‌ను ఎంటర్ చేయాలి.
3. HUID నంబర్ ఎంటర్ చేసి, Verify HUID పై క్లిక్ చేయాలి.
4. వెంటనే మీకు సదరు ఆభరణంలోని బంగారం స్వచ్ఛత వివరాలు కనిపిస్తాయి.
అవగాహన పెరిగింది!
BIS Care App Downloads : వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకారం, 2021 నుంచి 2023 మధ్యలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి BIS Care App డౌన్లోడ్ చేసుకున్నవారి సంఖ్య 2.3 లక్షల నుంచి ఏకంగా 12.4 లక్షలకు పెరిగింది. అలాగే ఒక కోటి మందికి పైగా హెచ్‌యూఐడీని వెరిఫికేషన్ చేసుకున్నారు.
- UPI ATM Cash Withdrawal Process : 'యూపీఐ ఏటీఎం'తో.. ఇకపై కార్డ్ లేకుండానే క్యాష్ విత్‌డ్రా!
- How to Check PF Balance in UMANG App : మీ పీఎఫ్ అకౌంట్లో ఎంత డబ్బుంది..? సింపుల్‌గా చెక్ చేసుకోండి..!
- Udyogini Scheme for Women Entrepreneurship Benefits and Details : ఈ మహిళలకు వడ్డీ లేకుండా 3 లక్షల రుణం.. ఇలా అప్లై చేసుకోండి!