ETV Bharat / business

ఆవిరవుతున్న పెట్టుబడులు- వాటాదారుల 'ఫ్యూచర్'​ ఏంటి? - ఫ్యూచర్​ గ్రూపు న్యూస్​

Future Group: కొవిడ్​ పరిణామాలు, రిలయన్స్​ సంస్థతో కుదిరిన ఒప్పందం రద్దైన నేపథ్యంలో ఫ్యూచర్​ గ్రూపు సంస్థ వాటాదార్ల పెట్టుబడులు ఆవిరైపోతున్నాయి. గ్రూప్​ యజమాని బియానీ కుటుంబానికి సంబంధించిన వాటాలు తగ్గిపోయాయని.. వీరు తనఖా పెట్టిన షేర్లను రుణదాతలు సీజ్​ చేయడమే కారణమని కార్పొరేట్​ విశ్లేషకులు భావిస్తున్నారు.

future group latest news
future group latest news
author img

By

Published : Apr 26, 2022, 7:10 AM IST

Future Group: ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థల వాటాదార్ల పెట్టుబడులు కళ్లముందే కరిగిపోతున్నాయి. 2019 డిసెంబరులో అమెజాన్‌ ఫ్యూచర్‌గ్రూప్‌ ప్రమోటరు కంపెనీ అయిన ఫ్యూచర్‌ కూపన్స్‌లో 50 శాతం వాటాను రూ.1430 కోట్లకు కొనుగోలు చేసింది. తదుపరి కొవిడ్‌ పరిణామాల నేపథ్యంలో ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీలన్నీ ఆర్థిక ఒత్తిళ్లలోకి వెళ్లాయి. తదనంతర పరిణామాల్లో రిలయన్స్‌ రిటైల్‌కు తన రిటైల్‌ ఆస్తులను రూ.24,713 కోట్లకు విక్రయించేందుకు ఫ్యూచర్‌గ్రూప్‌ ప్రయత్నాలు చేసినా అమెజాన్‌ న్యాయపోరాటంతో వీలు కాలేదు. ఇక బ్యాంకుల వంటి సెక్యూర్డ్‌ రుణదాతలు కూడా రిలయన్స్‌ రిటైల్‌కు ఆస్తులను విక్రయించేందుకు అంగీకరించకపోవడం వల్ల ఫ్యూచర్‌ గ్రూప్‌ ప్రయత్నాలు ఆగిపోయినట్లే. దీంతో రిలయన్స్‌ సైతం ఒప్పంద అమలు జరగదని తేల్చి చెప్పేసింది.

దివాలా స్మృతికి..: ఇపుడు తమ బకాయిలను రికవరీ చేసుకోవడం కోసం ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీలకు రుణాలిచ్చిన ఆర్థిక సంస్థలు, దివాలా కోర్టులను ఆశ్రయిస్తున్నాయి. దివాలా స్మృతి కింద బకాయిలను రాబట్టుకోవాలని భావిస్తున్నాయి. ఈ పద్ధతిలోనూ ఆర్థిక సంస్థలకూ భారీగా నష్టాలు తప్పవని.. అయితే ఏదైనా రికవరీ కనుక జరిగితే ముందుగా వారికే ప్రాధాన్యత లభిస్తుందని సమాచారం. దీంతో ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీల వాటాదార్లు మరింతగా నష్టపోవాల్సి రావచ్చని న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఇప్పటికే షేర్ల విలువలు గణనీయంగా తగ్గిపోతున్నాయి.

బియానీ కుటుంబ వాటాలు ఇలా తగ్గాయ్‌: 2019 డిసెంబరు నుంచి ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీల్లో బియానీ కుటుంబ వాటాలు తగ్గుతూ వచ్చాయి. అందుకు కారణం వీరు తనఖా పెట్టిన షేర్లను రుణదాతలు సీజ్‌ చేస్తూ రావడమే. ఫ్యూచర్‌ కన్జూమర్‌ లో 2019 డిసెంబరులో బియానీ కుటుంబానికి 46.9 శాతం వాటా ఉండగా.. ఈ ఏడాది మార్చికి 8.4 శాతానికి తగ్గింది. ఫ్యూచర్‌ రిటైల్‌లో బియానీ వాటా 47 శాతం నుంచి 14.3 శాతానికి, ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో 50% నుంచి 17 శాతానికి, ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌లో 47.9 శాతం నుంచి 22 శాతానికి ప్రమోటర్ల వాటా తగ్గింది. ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్‌లో వాటా సైతం 20.4 శాతానికి పరిమితమైంది. గ్రూప్‌లో అతిచిన్న కంపెనీ అయిన ఫ్యూచర్‌ మార్కెట్స్‌ నెట్‌వర్క్స్‌లో మాత్రం బియానీ వాటా 71.6 శాతం కొనసాగింది.

తనఖాలు పెట్టడం వల్లే..: దేశవ్యాప్తంగా 2020 మార్చిలో కొవిడ్‌ లాక్‌డౌన్‌ మొదలైంది. కార్యకలాపాలు సాగకపోవడం, రుణాలకు సంబంధించి బ్యాంకులకు వాయిదాలు చెల్లించలేకపోవడం వల్ల ప్రమోటర్లు షేర్లను తనఖా పెట్టక తప్పింది కాదు. గ్రూప్‌ కంపెనీలన్నిటిలో తనఖా పెట్టిన ప్రమోటర్ల వాటా 89.8 శాతంగా ఉన్నట్లు రెడ్‌ ఇంటలిజెన్స్‌ అనే పరిశోధనా సంస్థ చెబుతోంది. ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీలు ఆర్థిక ఒత్తిడిలోకి జారడానికి ముందు (2019 ఏప్రిల్‌-డిసెంబరు) గ్రూప్‌ రూ.4620 కోట్లను సమీకరించింది. ఇందులో రూ.1750 కోట్లు బ్లాక్‌స్టోన్‌ నుంచి వచ్చాయి. పీఈ సంస్థ అపోలో నుంచి రూ.590 కోట్లను సమీకరించింది. అయాన్‌, యూబీఎస్‌లు వరుసగా రూ.500 కోట్లు, రూ.350 కోట్లు చొప్పున రుణాలిచ్చాయి. ప్రైవేటు ఈక్విటీ సంస్థల నుంచి సమీకరించిన ఈ నిధుల వ్యయం మరీ ఎక్కువగా ఉంది. నాలుగేళ్ల కాలావధికి ఏటా 26.5 శాతం వడ్డీతో తీసుకున్నట్లు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కంపెనీ వెల్లడించింది. ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్ల ధరలు పడిపోతున్న సమయంలో రిలయన్స్‌ రిటైల్‌తో విక్రయ ఒప్పందాన్ని 2020 ఆగస్టులో సంస్థ ప్రకటించింది. గట్టెక్కిస్తుందనుకున్న ఈ ఒప్పందం కాస్తా న్యాయవివాదంలో చిక్కుకుంది. దీంతో గ్రూప్‌ కంపెనీల షేరు విలువలు భారీగా పతనమయ్యాయి. కుప్పకూలడానికి కారణమయ్యాయి.

ఫ్యూచర్‌ రిటైల్‌ మినహా..: ఫ్యూచర్‌ రిటైల్‌కు రూ.18,000 కోట్ల అప్పులున్నాయి. ఈ సంస్థ దివాలా ప్రక్రియను ఎదుర్కునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, ఫ్యూచర్‌ సప్లై, ఫ్యూచర్‌ కన్జూమర్‌లు సొంతంగా రాణించగలవని విశ్లేషకులు అంటున్నారు. రుణాల విషయంలో ప్రస్తుత రుణదాతలు, పెట్టుబడిదార్ల సహాయంతో ఈ సంస్థలను పునర్నిర్మించుకోడానికి అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ విషయానికే వస్తే రూ.5000 కోట్ల రుణాలున్నా.. ఫ్యూచర్‌జనరాలీ ఇండియాలో వాటాను విక్రయిస్తున్నందున అప్పులు తక్కువ మొత్తానికే పరిమితం కానున్నాయని ఆ వర్గాలు వివరించాయి. ఫ్యూచర్‌ కన్జూమర్‌ కూడా కర్ణాటకలోని 110ఎకరాల ఫుడ్‌పార్క్‌ సహాయంతో కంపెనీని పునర్నిర్మించుకునేందుకు అవకాశాలున్నాయని తెలిపాయి. ఫ్యూచర్‌సప్లై విషయంలోనూ దానికున్న గిడ్డంగులు కలిసిరావొచ్చు.

future group latest news
ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లు

ఇదీ చదవండి: 'వడ్డీ రేట్ల పెంపు.. జాతి విద్రోహ చర్యేమీ కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.