ETV Bharat / business

First Electric Highway In India : దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవే అక్కడే.. ఇక రైళ్ల మాదిరిగానే! - కార్లకు ఆరు ఎయిర్​బ్యాగ్​లు తప్పనిసరి కాదు

First Electric Highway In India : దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవే ప్రాజెక్టును నాగ్​పుర్​లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అలాగే విద్యుత్ హైవేల అభివృద్ధికి, టెక్నాలజీలపై కేంద్రం కసరత్తు చేస్తోందని తెలిపారు. మరోవైపు.. కార్లలో ఆరు ఎయిర్​బ్యాగ్​లు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచించడం లేదని గడ్కరీ పేర్కొన్నారు.

First Electric Highway In India
First Electric Highway In India
author img

By PTI

Published : Sep 14, 2023, 8:59 AM IST

First Electric Highway In India : నాగ్‌పుర్‌లో మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ హైవే ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. విద్యుత్‌ రహదారుల అభివృద్ధికి మార్గాలు, సాంకేతికతలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పేర్కొన్నారు. ఆర్థికంగానూ వీటి వల్ల ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. విద్యుత్‌ రహదారుల ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న ప్రైవేట్‌ రంగ పెట్టుబడిదార్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తామని దిల్లీలో జరిగిన ఏసీఎంఏ వార్షిక సదస్సులో గడ్కరీ తెలిపారు. పైగా ఈ తరహా రహదార్ల కోసం ప్రభుత్వానికి చౌకగా విద్యుత్‌ను ఇవ్వడం విద్యుత్‌ మంత్రిత్వ శాఖకూ పెద్ద కష్టమైన పని కాదని చెప్పారు.

'నేను విద్యుత్‌ మంత్రిత్వ శాఖతో మాట్లాడాను. ఒక్కో యూనిట్‌ రూ.3.50కే విద్యుత్‌ను సరఫరా చేసేలా నేను ప్రయత్నిస్తున్నాను. వాణిజ్యంగా ఈ ధర రూ.11గా ఉంది' అని గడ్కరీ తెలిపారు. ఎలక్ట్రిక్‌ తీగల నిర్మాణం ప్రైవేట్‌ రంగ పెట్టుబడిదార్లు చేపడతారని.. టోల్‌ మాదిరిగా విద్యుత్‌ ఛార్జీని ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ) వసూలు చేస్తుందని మంత్రి వెల్లడించారు. కాగా.. దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ హైవేను నాగ్​పుర్​లో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని గడ్కరీ అన్నారు. అయితే దిల్లీ- జయపుర మధ్య దేశంలోనే మొట్టమొదటి విద్యుత్‌ హైవేను నిర్మించాలన్నది తన కల అని అంతకుముందు గడ్కరీ వెల్లడించడం గమనార్హం.

విద్యుత్ రహదార్లు అంటే..
విద్యుత్‌ రైళ్ల పట్టాలకు సమాంతరంగా ఎలాగైతే పైన విద్యుత్‌ సరఫరా తీగలు ఉంటాయో ఆ తరహాలోనే రహదారులపైనా తీగలను అమరుస్తారు. వాహనాలు ఈ తీగల నుంచి ప్రసారమయ్యే విద్యుత్‌ సాయంతో రహదారులపై నడుస్తాయి. ఆ విధంగా వాహనాల్లోనూ, విద్యుత్‌ తీగల లైన్లలో సాంకేతికతను ఏర్పాటు చేస్తారు.

'కార్లకు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయట్లేదు'
airbags mandatory in india : కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం అనుకోవడం లేదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. 'ప్రస్తుతం ప్రజలు జాగ్రత్తగా ఉన్నారు. ఏ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటే.. ఆ కారును తీసుకోవడానికి ప్రజలు ఇష్టపడతారు. అన్ని కంపెనీలు కార్లలో ఆరు ఎయిర్​బ్యాగ్​లు ఉంచుతున్నాయి. అందుకే కార్లలో ఆరు ఎయిర్​బ్యాగులను తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాం' అని పేర్కొన్నారు.

  • #WATCH | Delhi: On the 6 airbags rule for passenger cars, Union Minister Nitin Gadkari says, "...Now people are cautious. Whichever car has six airbags, people will prefer to take that car. It's up to the manufacturers and people to decide. Everyone is making it, don't need to… pic.twitter.com/hOFxRPTQYn

    — ANI (@ANI) September 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాగా.. కార్లలో తప్పనిసరిగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలనే నిబంధనను అమలు చేయాలనే ప్రతిపాదనను ఏడాది పాటు అంటే 2023 అక్టోబరు 1 వరకు వాయిదా వేస్తున్నట్లు గతేడాది గడ్కరీ ప్రకటించారు. ఈ క్రమంలో అక్టోబరు 1 సమీపిస్తున్న నేపథ్యంలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల అమలుపై మంత్రి తాజాగా స్పష్టతనిస్తూ.. ప్రభుత్వం ఆ దిశగా యోచన చేయడం లేదని అన్నారు.

కేంద్రం కొత్త రూల్​.. ఇకపై లారీ క్యాబిన్​లో AC మస్ట్​!

ఇకపై ఎలక్ట్రిక్​ హైవేలు.. టోల్​ప్లాజా వద్ద ఇక 'ఆగేదే లే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.