ETV Bharat / business

అనవసర ఖర్చులు పెరిగిపోయాయా? ఈ సింపుల్ టెక్నిక్స్​తో డబ్బు ఆదా! - అనవస ఖర్చులను తగ్గించుకునే టిప్స్

Financial Planning And Wealth Management : ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఖర్చులు చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు స్వతహాగా చేసే అనవసర ఖర్చులు ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయి. అవేంటో, డబ్బు ఆదా చేసేందుకు ఎలాంటి ఆర్థిక నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Financial Planning And Wealth Management
అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి ఆర్థిక సూత్రాలు
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 3:09 PM IST

Financial Planning And Wealth Management : సాధారణంగా చాలామంది తమ రోజువారీ జీవితంలో అనేక ఖర్చులు చేస్తుంటారు. ఇందులో అవసరమైన ఖర్చులేంటి? అనవసర ఖర్చులేంటి? అనే విషయంలో కొంతమందికి సందేహం ఉండవచ్చు. అనవసరమైన ఖర్చుల విషయంలో స్పష్టత లేకపోతే జీవితాంతం అవి మనల్ని వదలిపెట్టవు. మనీ మేనేజ్​మెంట్​ చిన్నతనం నుంచి సరిగ్గా అలవర్చుకోకపోతే కొంతకాలానికి సంక్లిష్టంగా మారుతుంది. చాలా మంది ఆర్థిక ప్రణాళికలో చేసే మొదటి తప్పు తమ ఖర్చులను అదుపులో పెట్టకపోవడమే. లైఫ్​స్టైల్​లో మార్పులు చేయకుంటే ఈ ఖర్చులను అదుపులో ఉంచడం చాలా కష్టం. ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించేలా ఇది దీర్ఘకాలంలో సహాయపడుతుంది. ఖర్చులు మరీఎక్కువైతే అప్పులు చేయడం తప్ప వేరే మార్గం కనిపించదు. చాలా మంది చేసే ఆర్థిక తప్పుల, నివారణ మార్గాలేంటో తెలుసుకుందాం.

Family Budget Planner : చాలామంది ఇంటి ఖర్చుల విషయంలో ప్యామిలీ బడ్జెట్‌ను తయారు చేసుకోరు. బడ్జెట్ తయారు చేసుకున్న వారు కూడా కొన్ని చిన్నచిన్న తప్పులు చేస్తుంటారు. ఇందులో బడ్జెట్ రాయకపోవడమే అతి పెద్ద తప్పు. బడ్జెట్ ప్రణాళిక రాసినప్పుడు.. ఎంత ఖర్చు చేస్తున్నాం? ఎంతమేరకు చేయవచ్చు? అనే అంశాలపై మనకు స్పష్టత ఉంటుంది. అలాగే, ద్రవ్యోల్బణాన్ని (ధరలపెరుగుదలను) అంచనా వేయకుండా బడ్జెట్ తయారు చేస్తుంటారు. భవిష్యత్‌ ఖర్చులను కూడా అంచనా వేసినప్పుడే బడ్జెట్ సరైన విధంగా ఉంటుంది. చాలా మంది మొదట్లో ఆసక్తితో బడ్జెట్ రాయడం మొదలు పెడతారు. కానీ 1-2 నెలల స్వల్పకాలంలోనే ఆపేస్తుంటారు. దీర్ఘకాలం పాటు రాస్తుంటేనే మనం చేసే ఖర్చుల మీద అవగాహన వస్తుంది. తద్వారా ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు.

అనవసరమైన సబ్‌స్క్రిప్షన్స్‌
కొంత మంది ఓ సంవత్సరానికని జిమ్‌, క్లబ్‌ ఫీజులు చెల్లించి సక్రమంగా హాజరు అవ్వరు. దీనివల్ల దానిపై చేసిన ఖర్చు అనవసరంగా వృథా అవుతుంది. డిజిటల్ సబ్‌స్క్రిప్షన్‌లు(టీవీ,ఓటీటీ) విషయంలోను ఇదే జరుగుతుంది. టీవీలో అన్ని ఛానళ్లను చూడకపోయినా సరే ఎక్కువ ఛానళ్లకు డబ్బు చెల్లిస్తుంటారు. మీరు రోజూ ఎక్కువగా చూసే ఛానళ్లను మాత్రమే ఎంచుకుంటే ఖర్చు తగ్గుతుంది. తద్వారా డబ్బు ఆదా అవుతుంది. మరికొంత మంది చదవకపోయినా సరే పలు రకాల మ్యాగజైన్స్‌ను ఇంటికి తెప్పిస్తారు. మీరు ఎక్కువ చదవగలిగే వాటినే తీసుకుంటే ఖర్చులు తగ్గుతాయి.

ఇంటి ఖర్చులు
ఇల్లు అనేది ఎవరికైనా కనీస అవసరం. ప్రాథమిక అవసరాలను తీర్చేది కూడా ఇల్లే. చాలామంది అధికంగా అద్దె చెల్లించి సిటీ మధ్యలో ఇరుకు ఇళ్లలో నివసిస్తుంటారు. దీనికి బదులుగా పట్టణ శివారుకు ప్రాంతానికి మారడమే మంచిది. దీనివల్ల అద్దె కలిసి వస్తుంది. ఇల్లు సౌకర్యంగానూ ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేసినా అందుబాటు ధరకు లభించే శివారు ప్రాంతాలకు వెళ్లడమే మంచిది. దీనివల్ల కొనుగోలు చేసే మొత్తంలో ఎక్కువ డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉంది. మెట్రో లాంటి అందుబాటులో ఉన్న రవాణా వ్యవస్థ ద్వారా వేగంగా దూర ప్రాంతాలకు చేరుకోవచ్చు.

'కరెంట్​ పొదుపు పాటిస్తే మంచిది'
ప్రస్తుత కాలంలో కరెంట్​ వినియోగం సర్వసాధారణం. అంతేకాకుండా, అవసరాల రీత్యా విద్యుత్‌తో పనిచేసే ఉపకరణాలు కూడా బాగా పెరిగిపోయాయి. దీంతో వాడకం కూడా క్రమంగా పెరిగింది. వీటిని పొదుపుగా ఉపయోగిస్తే పర్వాలేదు. కానీ, మనుషులు లేని చోట కూడా కొన్నిసార్లు ఫ్యాన్‌, ఏసీ, లైట్లు వేసేసి ఉంచేస్తారు. అంతేకాకుండా ఇంటికి అనవసర లైటింగ్‌ ఎఫెక్ట్‌లను డెకరేట్ చేస్తుంటారు. ఇలాంటి అనవసర ఖర్చులను చాలామంది సరిగ్గా గమనించరు. కరెంట్​ విషయంలో మీరు ఒక యూనిట్‌ను పొదుపు చేస్తే.. అదనపు యూనిట్‌ను ఉత్పత్తి చేసినట్టే. అంతేకాకుండా, విద్యుత్‌ ఛార్జీలు గతంతో పోలిస్తే ప్రస్తుతకాలంలో గణనీయంగా పెరిగిపోయాయి. దేశంలో దాదాపుగా అందరూ విద్యుత్‌ వినియోగదారులే. కనుక విద్యుత్‌ను ఆదా చేసి వృథా ఖర్చులను తగ్గించుకోవాలి. వీలైతే విద్యుత్ వ్యయాలను తగ్గించుకోవడానికి సోలార్ పానెల్స్ అమర్చుకోవాలి.

'అత్యవసరమైతేనే క్రెడిట్ ​కార్డ్ వాడండి'
క్రెడిట్‌ కార్డుల వాడకం ఈ మధ్య గణనీయంగా పెరిగింది. రోజూ జేబు నుంచి నగదు ఖర్చు చేయడానికి, క్రెడిట్‌ కార్డుతో కొనుగోళ్లు చేసే విధానంలో చాలా తేడా ఉంటుంది. వెంటనే డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదు. కాబట్టి క్రెడిట్‌ కార్డుతో అనవసరమైన వస్తువులు కొనుగోళ్లు జరిపే అవకాశం ఉంది. నగదును ఉపయోగించకుండా క్రెడిట్‌ కార్డులతో వస్తువులను కొనుగోలు చేసే వ్యక్తులు సాధారణంగా 12-18% అధికంగా ఖర్చు చేస్తారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు ఎక్కువగా పెరిగిపోయాయి. క్రెడిట్‌ కార్డుతో ఈ కొనుగోళ్లు చాలా సింపుల్. అలాంటి సమయంలో ఖర్చు గురించి ఆలోచన ఉండదు. ఇది మీ క్రెడిట్​ కార్డ్​పై అప్పు​ను పెంచడానికి కారణమవుతుంది. బిల్‌ వచ్చినప్పుడు చాలా ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. డిఫాల్టయితే సిబిల్ ​స్కోరు(క్రెడిట్‌ స్కోరు) దెబ్బతింటుంది. జరిమానా కూడా తప్పదు. అంతేకాకుండా ఎక్కువ క్రెడిట్‌ కార్డులను కలిగి ఉండడం వల్ల రుణాలను ట్రాక్‌ చేయడం కష్టం. కనుక, చిన్న చిన్న ఆఫర్లు, డీల్స్‌ కోసం క్రెడిట్‌ కార్డులను ఆశ్రయించొద్దు. క్రెడిట్‌ కార్డులు.. జాగ్రత్తగా నిర్వహించేవారికి మాత్రమే తగినవి.

వివాహం, పుట్టిన రోజు వేడుకలు
వివాహం, జీవితంలో ఒక జంట‌కు కీలక మధురమైన ఘ‌ట్టం. పెళ్లి వేడుక‌ ఎప్పుడైతే ఆడంబరంగా కావాలని ఆశిస్తారో.. ఖ‌ర్చులు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. పెళ్లి వ్య‌వ‌హారాల్లో ఖ‌ర్చులు ఏవిధంగా ఉంటాయో చాలా మందికి అనుభ‌వం ద్వారా తెలిసిన విష‌య‌మే. మన దేశం వధూవరుల కుటుంబాలు వివాహానికి అధికంగా డబ్బులు ఖర్చు పెడుతుంటాయి. భార‌త్‌లో అధికశాతం మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల వారే ఉంటారు. వీరికి వివాహం ఖ‌ర్చు ఒక భారీ బ‌డ్జెట్ లాంటిదే అని చెప్పొచ్చు. భారత్‌లో సగటు మధ్య తరగతి వ్యక్తి తన 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో సంపాదించిన భవిష్య నిధి(పీఎఫ్‌) డబ్బును ఈ వేడుకలోనే ఖర్చు పెట్టేస్తున్నారని వివాహ ఖర్చుల గురించి కొన్ని కథనాలు వార్తల్లో కూడా వచ్చాయి. ఇంకొక ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే ఇంటికి పెట్టిన ఖర్చు మ‌న క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది. చ‌దువుకు పెట్టిన ఖ‌ర్చు ఉపయోగమే. విద్య ..ఆ వ్య‌క్తినే కాకుండా మొత్తం కుటుంబాన్నే పోషిస్తుంది. కానీ పెళ్లికి పెట్టిన ఖ‌ర్చు మాత్రం ఆ రోజే క‌నిపిస్తుంది. త‌ర్వాత క‌నిపించ‌దు. కాబట్టి, వివాహం, పుట్టిన రోజు లాంటి వేడుకల ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఆదాయానికి మించిన ఖర్చులొద్దు
చాలా మంది వారికి తగిన స్తోమత లేకపోయినా విలాస వస్తువులు కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఉదాహరణకు రూ.35 వేలు సంపాదించే వ్యక్తి కూడా రూ.80-90 వేలు విలువగల చేసే 'ఐఫోన్‌' కొనుగోలు చేయాలని ఆశిస్తారు. ఎన్నో ఫీచర్లున్న ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లు రూ.15 వేలకే లభిస్తాయి. ఇవి కూడా ప్రస్తుత కాలంలో అందరికీ ఉపయోగపడే అన్ని సేవలను అందిస్తాయి. కాబట్టి స్తోమత లేనివారు ఆదాయానికి తగ్గట్టుగా వ్యవహరించడం చాలా మంచిది. కొంతమంది జీవితంలో పూర్తిగా సెటిల్​ కాకుండానే కారు కొనుగోలుకు మొగ్గుచూపుతారు. కారు అవసరం కూడా వీరికి రోజూ ఉండకపోవచ్చు. కారుకు బీమా, పార్కింగ్‌ ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులు చాలానే ఉంటాయి. ఇటువంటి అన్ని ఖర్చులతో పాటు బ్యాంకుకు చెల్లించే ఈఎంఐ మొత్తం కూడా వేల రూపాయల్లోనే ఉంటుంది. ఇలాంటి అధిక ఖర్చులు చెల్లించే బదులు ఆ డబ్బులను మంచి సేవింగ్​ స్కీమ్​లో పొదుపు చేసి రాబడిని పెంచుకోవచ్చు.

Financial Security Tips : ఈ ఒక్క అలవాటుతో మీకు ఆర్థిక భరోసా.. ప్రముఖ మిలియనీర్‌ చెప్పిన టిప్‌

Life Insurance Benefits At Early Age : మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కావాలా?.. వెంటనే జీవిత బీమా తీసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.