ETV Bharat / business

పండుగ కోసం షాపింగ్ చేస్తున్నారా? డబ్బులు ఆదా చేసుకోండిలా!

Festive Shopping Tips In Telugu : మీరు పండుగ కోసం షాపింగ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ పండుగ వేళ ఒక మంచి ప్రణాళికతో కొనుగోళ్లు ఎలా చేయాలి? ఖర్చులను ఎలా అదుపులో ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 12:44 PM IST

how to control festive expenses
festive shopping tips in telugu

Festive Shopping Tips : మన భారతీయులం పండుగలను చాలా వైభవంగా జరుపుకుంటాం. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తాం. ఇళ్లను బాగా అలంకరించుకోవడం దగ్గర నుంచి మిత్రులకు, బంధువులకు బహుమతులు ఇవ్వడం వరకు చాలానే చేస్తాం. ఇది ఒక పరిమితి వరకు ఉంటే మంచిదే.. లేదంటే ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే పండుగల వేళ.. ఒక ప్రణాళికతో కొనుగోళ్లు ఎలా చేయాలి? మన ఖర్చులను ఏ విధంగా అదుపు చేసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బడ్జెట్​ వేసుకోవాలి!
How To Make Good Budget Plan : మీ ఆర్థిక పరిస్థితిని అనుసరించి బడ్జెట్‌ వేసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ దీనికి మించి కొనుగోళ్లు చేయకుండా చూసుకోవాలి. దీనివల్ల అనవసర ఖర్చులు బాగా తగ్గుతాయి. ఫలితంగా మీపై ఎలాంటి అనవసర ఆర్థిక ఒత్తిడి పడకుండా ఉంటుంది.

ధరలు పోల్చిచూడండి!
ఒకప్పుడు ఆన్‌లైన్‌లో వస్తువులు చాలా చౌకగా దొరికేవి. నేరుగా వెళ్లి కొంటే కాస్త ఎక్కువ ధరే ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కొన్నిసార్లు ఆన్‌లైన్‌లో కన్నా, రిటైల్​ దుకాణాల్లోనే తక్కువ ధరకు వస్తువులు లభిస్తున్నాయి. కనుక ఒక వస్తువును కొనుగోలు చేసేముందు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ధరలను పోల్చి చూడండి. ముఖ్యంగా గృహోపకరణాల విషయంలో ఏ విధంగానూ రాజీ పడకండి. రిటైల్​ స్టోర్లను సందర్శించిన తరువాతే ఓ నిర్ణయం తీసుకోండి.

క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉపయోగించుకోండి!
How To Claim Credit Card Reward Points : పండగల వేళలో మీ క్రెడిట్ కార్డులు అందిస్తున్న పలు రకాల ఆఫర్లు, డిస్కౌంట్లు, రివార్డులు గురించి తెలుసుకోండి. వీటి ద్వారా తక్కువ ధరకే వస్తువులను కొనుగోలు చేయడానికి వీలవుతుంది.

నో-కాస్ట్ ఈఎంఐ
What Is No Cost EMI : నేడు అనేక క్రెడిట్‌ కార్డు సంస్థలు, ఫిన్‌టెక్‌ సంస్థలు నో-కాస్ట్-ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నాయి. అధిక విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఈ నో-కాస్ట్​-ఈఎంఐ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల ప్రత్యేకంగా వ్యక్తిగత రుణాలు లాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

బడ్జెట్లోనే బహుమతులు!
మీరు ఎవరికైనా బహుమతులు ఇవ్వాలని అనుకుంటే.. కచ్చితంగా బడ్జెట్​లో ఉండేలా చూసుకోవాలి. లేదా మీరే స్వయంగా సదరు బహుమతులు తయారుచేసుకోవాలి. వాస్తవానికి మీ చేతితో తయారు చేసిన వస్తువులు, దుకాణంలో కొన్న వాటికంటే ఎంతో విలువైనవని మర్చిపోకండి. మీకు కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు ఇలాంటివి ప్రయత్నించవచ్చు.

కూపన్స్ & ప్రోమో కోడ్స్​
ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసేటప్పుడు ఏమైనా కూపన్లు, ప్రోమో కోడ్స్ ఇస్తున్నారేమో చూడండి. వీటిని ఉపయోగించి, తక్కువ ధరకే వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయత్నించవచ్చు.

సిద్ధంగా ఉండాలి!
పండుగ కొనుగోళ్ల కోసం చివరి నిమిషం వరకూ వేచి చూడటం ఏమాత్రం మంచిది కాదు. ముందుగానే బడ్జెట్​ను రూపొందించుకోవాలి. లేదంటే, పండగ దగ్గరకు వస్తున్న కొద్దీ బడ్జెట్‌పై రాజీ పడాల్సి వస్తుంది.

లాయల్టీ - రివార్డులు
కొన్ని స్టోర్లు లాయల్టీ, రివార్డు సభ్యత్వాలు ఇస్తుంటాయి. ఇప్పటికే మీరు వాటిల్లో సభ్యులుగా ఉంటే.. ఒకసారి అందులో ఎలాంటి రాయితీలు ఇస్తున్నారో చూసుకోవాలి. క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లకు కూడా లాయల్టీ పాయింట్లు వస్తుంటాయి. వాటిని కూడా ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాలి.

సరైన యాప్​ వాడుకోండి!
Best Price Tracker Apps : ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు ధర తగ్గినప్పుడు మనకు సందేశాలను పంపించే యాప్‌లు అనేకం ఉన్నాయి. వాటిలో ఒక దాన్ని ఎంచుకోండి. దీని వల్ల ధరలు తగ్గినప్పుడు.. మీకు అలర్ట్ వస్తుంది. అప్పుడు మీరు సదరు వస్తువును తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి వీలవుతుంది.

పొరపాట్లు చేయవద్దు!
పండగల వేళ కొన్ని పొరపాటు నిర్ణయాల వల్ల అవసరానికి మించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు అనవసర వస్తువులను కొనుగోలు చేయకుండా నియంత్రించుకోవాలి. కొనకతప్పదు అనుకుంటేనే.. సదరు వస్తువును లేదా వస్తువులను కొనుగోలు చేయండి. ప్రస్తుతానికి అవసరం లేని వస్తువులను పక్కన పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బడ్జెట్‌కు కట్టుబడి ఉండాలి. అప్పుడే మీపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉంటుంది.

అదిరిపోయే పండగ ఆఫర్ - తక్కువ ధరలో సూపర్​ హెల్మెట్స్​!

స్టన్నింగ్​ ఫీచర్స్​తో నవంబర్​లో విడుదల కానున్న సూపర్​ కార్స్​ & బైక్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.