ED Raids On china loan apps : సులభతర రుణాలు ఇస్తూ ఎక్కువ వడ్డీలను వసూలు చేస్తున్న చైనా రుణయాప్‌లపై ఈడీ కొరడా ఝుళిపించింది. ఎస్‌బజ్, రోజర్‌పే, క్యాష్‌ఫ్రీ, పేటీఎం లాంటి గేట్‌వేలలో ఉంచిన రుణయాప్‌లకు సంబంధించిన 46కోట్ల రూపాయలను మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ స్తంభింపజేసింది. దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న చైనా రుణయాప్‌ల సంస్థలు, వాటి పేమెంట్ అగ్రిగేటర్‌ల కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సెప్టెంబర్ 14న పెద్ద ఎత్తున దాడులు చేసి కీలక డాక్యుమెంట్‌లను స్వాధీనం చేసుకుంది.
ఈజీబజ్‌లో 33 కోట్లు, రోజోర్‌పేలో 8 30 కోట్లు, క్యాష్‌ఫ్రీ పేమెంట్, పేటీఎం గేట్‌వేలలో మరో 2.40 కోట్ల రుణయాప్‌ల సొమ్మును గుర్తించిన ఈడీ ఆ మొత్తాన్ని స్తంభింపజేసింది. పేమెంట్‌గేట్‌వేలలో ఉన్న ఆయా యాప్‌ల సొమ్మును స్తంభింపజేసి వాటి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని ఈడీ యోచిస్తోంది. రుణయాప్ బాధితులు ఎక్కవ అవుతుండటంతో కేంద్రం వీటిపై దృష్టి సారించింది. అటు ప్లే-స్టోర్‌లోనూ రుణయాప్‌లు కనిపించకుండా గూగుల్ చర్యలు తీసుకుంటోంది.
ఇదీ చదవండి: ఇకపై ఆధార్ అప్డేట్ తప్పనిసరిగా చేసుకోవాల్సిందే!
అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యం.. టాయిలెట్లోనే ఏడ్చుకుంటూ బాలుడు.. చివరకు