ETV Bharat / business

'ఆమె'గా మారిన ఎలాన్​ మస్క్ కుమారుడు.. పేరు మార్చుకునేందుకు కోర్టుకు - ఎలాన్ మస్క్‌ మాజీ భార్య జస్టిన్‌ విల్సన్‌

ELON MUSK: టెస్లా అధినేత కుమారుడు తన పేరును మార్చుకోనున్నారు. ఇప్పటికే లింగమార్పిడి చేసుకోగా తాజాగా ఆమెగా మారిన నేపథ్యంలో.. పేరును మార్చాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన తండ్రితో కలిసి జీవించకపోవడంతో పాటు ఆకారం లేదా ఇతర ఏ రూపంలోనూ ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు ఎలన్​ మస్క్ కుమారుడు వెల్లడించారు.

elon musk
ఎలాన్‌ మస్క్‌
author img

By

Published : Jun 21, 2022, 8:05 PM IST

ELON MUSK: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కుమారుడు తన పేరును మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే లింగమార్పిడి చేసుకొని ఆమెగా మారిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా పేరును కూడా మార్చాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తద్వారా తన తండ్రితో ఉన్న బంధాన్ని తెంచుకోనున్నట్లు వెల్లడించారు. 'వివియన్‌ జెన్నా విల్సన్‌' పేరుతో పాటు, కొత్తగా జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీచేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఎలాన్ మస్క్‌ మాజీ భార్య జస్టిన్‌ విల్సన్‌తో 2008లో విడాకులు తీసుకున్నారు. మస్క్‌-జస్టిన్‌ దంపతులకు జేవియర్‌ అలెగ్జాండర్‌, గ్రిఫ్ఫిన్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. అందులో జేవియర్‌ అలెగ్జాండర్‌ కొంతకాలం క్రితం అమ్మాయిగా మారారు. ప్రస్తుతం ఆమెకు 18 ఏళ్లు. దీంతో తన పేరుతో పాటు లింగమార్పిడిని గుర్తిస్తూ కొత్త జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీచేయాలని కోరుతూ అమెరికా శాంటా మోనికాలోని లాస్‌ఏంజెల్స్‌ కౌంటీ సుపీరియర్‌ కోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్‌లో ఈ పిటిషన్‌ దాఖలు చేయగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

తన తండ్రితో కలిసి జీవించకపోవడంతో పాటు ఆకారం లేదా ఇతర ఏ రూపంలోనూ ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు జేవియర్‌ వెల్లడించారు. అయితే, ఆయనతో ఆమెకున్న విభేదాలపై మాత్రం ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. మరోవైపు తన ట్రాన్స్‌జెండర్‌ కుమార్తెపై అటు ఎలాన్‌ మస్క్‌ నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు.

ఇదిలాఉంటే, జేవియర్‌ పిటిషన్‌ దాఖలు చేసిన ఒక నెల తర్వాత ట్రాన్స్‌జెండర్లపై ఎలాన్‌ మస్క్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. లింగమార్పిడి హక్కులను పరిమితం చేసే చట్టాలకు మద్దతిస్తోన్న రిపబ్లికన్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు 2020లోనూ ఇదే అంశంపై మాట్లాడిన ఎలాన్‌ మస్క్‌.. ట్రాన్స్‌జెండర్లకు పూర్తి మద్దతు ఉంటుందని ట్వీట్‌ చేశారు. కానీ, వారి పేర్లను మార్చుకోవడం మాత్రం ఓ అందమైన పీడకలేనంటూ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: కార్డుల జారీపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆ మార్గదర్శకాల అమలు వాయిదా

మాంద్యం వస్తే ఏం చేయాలి? ఆర్థిక భద్రతకు ఎలా సన్నద్ధమవ్వాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.