ETV Bharat / business

ట్విట్టర్​ బోర్డ్​ ఆఫ్​ డైరెక్టర్స్​లో సభ్యుడిగా మస్క్​ - పరాగ్​ అగర్వాల్​ న్యూస్​

Elon Musk as Twitter Board Of Director: ట్విట్టర్​లో వాటాలు కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​.. ప్రస్తుతం ఆ సంస్థ బోర్డు ఆఫ్​ డైరెక్టర్స్​లో సభ్యుడిగా నియమితులయ్యారు. 2024 వార్షిక షేర్​ హోల్డర్స్​ సమావేశం వరకు సభ్యుడిగా కొనసాగనున్నారు.

Elon Musk as Twitter Board Of Director
twitter news
author img

By

Published : Apr 5, 2022, 9:02 PM IST

Elon Musk as Twitter Board Of Director: ప్రముఖ కార్ల సంస్థ టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​.. సోషల్​ మీడియా నెట్​వర్క్​ 'ట్విట్టర్'​ బోర్డ్​ ఆఫ్​ డైరెక్టర్లలో సభ్యుడు కానున్నారు. మంగళవారం దాఖలు చేసిన రెగ్యూలెటరీ ఫిల్లింగ్​ ప్రకారం బోర్డు ఆఫ్​ డైరెక్టర్స్​లో ఒకరిగా నియమితులయ్యారు. 2024 వార్షిక షేర్​హోల్డర్స్​ సమావేశం వరకు సభ్యుడిగా కొనసాగనున్నారు. మస్క్ సభ్యుడిగా ఉన్నంతకాలం..​ ఒంటరిగా లేదా బృందంగానైనా ట్విట్టర్​లో 14.9 శాతం కన్నా అధికంగా వాటాలు కొనుగోలు చేసేందుకు వీల్లేదు. మస్క్ సోమవారమే​.. ట్విట్టర్​లో 9 శాతం వాటాలను కొనుగోలు చేశారు.

మస్క్​ బోర్డు సభ్యుడిగా నియమితులు కావడం పట్ల ట్విట్టర్​ సీఈఓ పరాగ్​ అగర్వాల్​ స్పందించారు. మస్క్​తో గత కొన్ని వారాలుగా మాట్లాడుతున్నామని.. ఆయన తమ బోర్డుకు గొప్ప బలం అన్నారు. "మస్క్​ మంచి విమర్శకుడు. మా సంస్థ బలోపేతానికి ఇలాంటి వ్యక్తి అవసరం" అని ట్వీట్​ చేశారు. ట్విట్టర్​లో పరిమిత వాటాను విధించడం.. సంస్థ వ్యూహత్మక పథకంలో భాగం అన్నారు.

ట్విట్టర్​లో దాదాపు 73.5 మిలియన్ షేర్లను తీసుకున్నారు మస్క్. దీంతో మార్కెట్​ ప్రారంభానికి ముందే ట్విట్టర్ షేర్లు 6 శాతం పెరిగాయి.​ గతంలో​ ట్విట్టర్​ సామర్థ్యంపై, వాక్​ స్వాతంత్య్రంపై మస్క్​ అనేక ప్రశ్నల్ని సంధించారు. దీంతో పాటు గతంలో కొత్త సోషల్​ మీడియా ఫ్లాట్​ఫామ్​ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు ట్వీట్​ చేశారు.

ఇదీ చదవండి: ట్విట్టర్​ షేర్లు కొనుగోలు చేసిన ఎలాన్​ మస్క్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.