ETV Bharat / business

Difference Between Nominee And Legal Heir : నామినీ Vs చట్టబద్ధమైన వారసులు.. ఎవరికి పూర్తి ఆస్తి హక్కులు ఉంటాయి? - నామీని మరియు చట్టబద్ధమైన వారసులకు తేడా ఏమిటి

Difference Between Nominee And Legal Heir In Telugu : నామినీ, లీగల్​ హెయర్స్​ (చట్టబద్ధమైన వారసులు) ఈ పేర్లను మనం తరచుగా వింటూ ఉంటాం. అయితే నామినీ, చట్టబద్ధమైన వారసులు ఇద్దరూ ఒక్కరేనా? లేదా వీరి మధ్య బేధాలు ఏమైనా ఉన్నాయా? ఎవరికి పూర్తి ఆస్తి హక్కులు లభిస్తాయి? ఈ వివరాలు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Nominee Vs Legal Heir
Difference Between Nominee And Legal Heir
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 6:03 PM IST

Difference Between Nominee And Legal Heir : నామినీ అనే ప‌దాన్ని అంద‌రూ ఎప్పుడో ఒక‌ప్పుడు వినే వింటారు. బ్యాంకు ఖాతా తెరిచే స‌మ‌యంలో, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో నామినీ పేరును న‌మోదు చేసి ఉంటారు. అయితే చ‌ట్టప‌ర‌మైన వార‌సులు, నామినీ.. ఒక్కరేనా లేదా వారి మధ్య ఏమైనా బేధం ఉందా? ఈ సందేహం మీకు ఎప్పుడైనా వ‌చ్చిందా? అయితే ఇప్పుడు మనం నామినీ, చట్టబద్ధమైన వారసులకు మధ్య గల సంబంధం, తేడాల గురించి తెలుసుకుందాం.

ప్ర‌ధానమైన తేడా ఏమిటి?
Nominee Vs Legal Heir : చట్టపరంగా చూస్తే, య‌జ‌మాని మ‌ర‌ణించినప్పుడు.. అతని ఆస్తిని క్లెయిమ్ చేసుకోవడానికి ఒక క‌స్టోడియ‌న్​గా నియ‌మించే వ్యక్తినే నామినీ అంటారు. యజమాని మరణించిన సందర్భంలో మాత్రమే నామినీ సదరు ఆస్తిని క్లెయిమ్ చేయవచ్చు. వారసత్వ చట్టం (లేదా వీలునామా) ప్రకారం.. చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సులు వ‌చ్చేంత వ‌ర‌కు నామినీ లేదా నామినీలు ఆ ఆస్తికి సంర‌క్ష‌కులుగా మాత్రమే ఉంటారు. చట్టబద్ధమైన వారసులు వచ్చిన తరువాత ఆ ఆస్తిని వారికి అప్ప‌గిస్తారు.

నామినీల క‌ర్త‌వ్యం, బాధ్య‌త‌
Legal Rights Of Nominee : వాస్తవానికి నామినీ, చట్టపరమైన వారసులు ఇద్ద‌రూ వేర్వేరు. య‌జ‌మాని స్పష్టంగా నామినేట్ చేస్తే.. నామినీగా ఉన్న వ్యక్తి చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సుడు కావ‌చ్చు. కానీ అతని/ఆమె పేరు కూడా వీలునామాలో స్ప‌ష్టంగా రాసి ఉన్న ప‌క్షంలో మాత్ర‌మే ఇది జ‌రుగుతుంది. అప్పుడు కూడా చట్టబద్ధమైన వారసులు ఎవరైనా ఉంటే.. వారికి మాత్రమే ఆస్తి హక్కులు వర్తిస్తాయి. నామినీలు మైన‌ర్ల‌కు సంర‌క్ష‌కులుగా వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చు. అలాగే ఆ పిల్ల‌ల సంక్షేమాన్ని చూడవచ్చు. వాస్తవానికి మ‌ర‌ణించిన య‌జ‌మాని ఆస్తిలో ఆ పిల్లల వాటాను కాపాడ‌వలసిన బాధ్య‌త నామినీలపై ఉంటుంది. అంటే ఆస్తి యజమాని మరణించిన తర్వాత.. అతని ఆస్తి హక్కులను బదిలీ చేయడానికి తాత్కాలికంగా నియమితమైన వ్యక్తే నామినీ.

చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సులు
Legal Rights Of Legal Heirs : మ‌ర‌ణించిన వ్య‌క్తి ఆస్తి పొంద‌డానికి చ‌ట్ట‌ప‌రంగా అన్ని అర్హ‌త‌లున్న వ్య‌క్తులే చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సులు. వీరు ఒక్క‌రు కావ‌చ్చు. లేదా అంత‌కంటే ఎక్కువే ఉండవచ్చు. ఈ వార‌సుల గురించి వీలునామాలో స్ప‌ష్టంగా పేర్కొంటారు. వీలునామా లేదా చట్టపరమైన వారసుడు లేకుంటే హిందూ వారసత్వ చట్టం ప్రకారం, ఆస్తిని క్లాజ్ -1, క్లాజ్ - 2 కుటుంబ స‌భ్యుల‌కు సమానంగా పంపిణీ చేస్తారు. ఎవ‌రూ లేని ప‌క్షంలో దాన్ని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంటుంది.

ప్రతినిధులు మాత్రమే!
నామినీలు ఆస్తికి య‌జ‌మాని కాలేరని చ‌ట్టం స్పష్టంగా చెబుతోంది. హౌసింగ్ సొసైటీ, కండోమినియం, అపార్ట్‌మెంట్లు/ఫ్లాట్‌ల విషయంలో నామినీల పాత్ర కొంత వ‌ర‌కే ప‌రిమితం. ఆస్తి యజమానికి, అతని చ‌ట్టప‌ర‌మైన వార‌సుల‌కు మ‌ధ్య ప్ర‌తినిధిగా మాత్ర‌మే నామినీ ప‌నిచేస్తారు. చట్టబద్ధమైన వారసులు జీవించి ఉన్నప్పుడు నామినీకి ఎలాంటి హక్కులు, ప్రయోజనాలు రావు. నామినేషన్ వెనుక ఉన్న కారణం ఏమిటంటే.. నిజ‌మైన‌, చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సులు దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ముందుకు వ‌చ్చే వ‌ర‌కు.. ఆ ఆస్తి వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం నామినీల క‌ర్త‌వ్యం.

ఒకవేళ మరణించిన వ్యక్తి వీలునామా రాయకుండా, కేవలం నామినేషన్ ఫారమ్ ద్వారా ఒక వ్యక్తిని నామినేట్ చేసినా కూడా.. ఆ ఆస్తి హ‌క్కులు నామినీల‌కు వ‌ర్తించ‌వు. అవి పూర్తిగా చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సుల‌కే చెందుతాయి. అంతే కానీ.. నామినేష‌న్ ఫార‌మ్ ప్ర‌కారం నామినీకి ఎలాంటి హ‌క్కులు ఉండ‌వు. నామినీలు అనేవారు అస‌లు వార‌సుల్ని ఎప్పటికీ భ‌ర్తీ చేయ‌లేరు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.