ETV Bharat / business

క్రెడిట్ స్విస్​ను కొనుగోలు చేసిన యూబీఎస్​.. కుదిరిన ఒప్పందం - సిగ్నేచర్ బ్యాంక్ న్యూయార్క్ కమ్యూనిటీ బ్యాంక్​

స్విట్జర్లాండ్ దిగ్గజ బ్యాంక్​ అయిన క్రెడిట్‌ స్విస్‌ను కొనుగోలు చేసేందుకు.. యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ స్విట్జర్లాండ్-యూబీఎస్​ ముందుకొచ్చింది. క్రెడిట్‌ స్విస్‌ను కొనుగోలు చేయనున్న విషయాన్ని స్విస్‌ జాతీయ బ్యాంకు వెల్లడించింది.

credit-suisse-merge
credit-suisse-merge
author img

By

Published : Mar 20, 2023, 12:14 PM IST

Updated : Mar 20, 2023, 3:54 PM IST

దివాల అంచున కొట్టుమిట్టాడుతున్న స్విస్‌ దిగ్గజ బ్యాంక్‌ క్రెడిట్‌ స్విస్‌ను కొనుగోలు చేసేందుకు యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ స్విట్జర్లాండ్-యూబీఎస్​ అంగీకరించింది. క్రెడిట్‌ స్విస్‌ను యూబీఎస్ కొనుగోలు చేయనున్నట్లు స్విస్‌ జాతీయ బ్యాంకు ప్రకటించింది. స్విస్‌ ప్రభుత్వం, ఫైనాన్షియల్ మార్కెట్ సూపర్‌వైజరీ అథారిటీ, జాతీయ బ్యాంకులు యూబీఎస్​తో జరిపిన చర్చల ఫలితంగానే ఇది సాధ్యమైందని తెలిపింది.

ఈ ఒప్పందం దేశ ఆర్థిక వ్యవస్థను రక్షిస్తుందని జాతీయ బ్యాంకు వెల్లడించింది. గతవారం క్రెడిట్‌ స్విస్‌ సంస్థ ఆర్థికంగా బలహీనంగా ఉందనే విషయం బయటకు రావడం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలను సృష్టించింది. దీంతో స్విస్‌ ప్రభుత్వం, కేంద్ర బ్యాంక్‌, ఫిన్మా రంగంలోకి దిగి సంస్థను ఆర్థిక సంక్షోభం నుంచి బయటవేయడానికి యత్నాలను మొదలుపెట్టాయి. ఈ క్రమంలో బ్యాంక్‌ స్విస్‌ విభాగాన్ని వేరుచేయడం, యూబీఎస్​తో డీల్‌ కుదర్చడం వంటి అంశాలపై దృష్టిపెట్టాయి.

3.25 బిలియన్​ డాలర్లకు క్రెడిట్ స్విస్​, యూబీఎస్ మధ్య ఒప్పందం కుదిరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వానికి ఎంతగానో దోహదపడుతుందని.. స్విట్జర్లాండ్​ ​అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ ఆదివారం ప్రకటించారు. క్రెడిట్‌ స్విస్​ సంక్షోభం.. దేశంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందన్నారు. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుందని ఆయన వెల్లడించారు. క్రెడిట్‌ స్విస్‌, యూబీఎస్ విలీనాన్ని స్విట్జర్లాండ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్.. ఆర్డినెన్స్‌తో అత్యవసరంగా ఆమోదించింది. ఈ పాలకమండలిలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. అందులో అధ్యక్షుడు బెర్సెట్ కూడా ఒకరు. వాటాదారులు అనుమతి లేకుండానే పాలకమండలి ఈ తీర్మాణాన్ని ఆమోదించింది.

'క్రెడిట్‌ స్విస్‌ బ్యాంక్​కు, స్విట్జర్లాండ్​కు, ప్రపంచ మార్కెట్​లకు ఇదొక చరిత్రాత్మకమైన రోజు. అదే విధంగా సవాలుతో కూడుకున్నది కూడా. ఇప్పుడు బ్యాంక్​ భవిష్యత్​పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా క్రెడిట్‌ స్విస్‌ బ్యాంక్​లో​​ పనిచేసే 50వేల మంది ఉద్యోగులపైన దృష్టి పెట్టాలి. వారిలో 17వేల మంది స్విట్జర్లాండ్​లోనే ఉంటున్నారు." అని క్రెడిట్‌ స్విస్‌ బ్యాంక్​ ఛైర్మన్ లెహ్​మాన్ ​అన్నారు.

భారీగా పతనమైన బ్యాంక్​ షేర్లు
మరోవైపు నష్టాల్లో ఉన్న స్విస్​ క్రెడిట్​ బ్యాంక్​ భారీగా పతనమయ్యాయి. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న స్విస్​ క్రెడిట్​ బ్యాంక్ కొనుగోలు చేయనున్నట్లు యూనియన్ బ్యాంక్​ ఆఫ్ స్విట్జర్లాండ్​ ప్రకటించిన నేపథ్యంలో.. ఆ బ్యాంక్​ షేర్లు పతనమయ్యాయి. సోమవారం ఉదయం మార్కెట్లు ప్రారంభమైన సమయంలో సుమారు 63 శాతం నష్టాన్ని నమోదు చేశాయి. స్విస్ బ్యాంక్​తో పాటు యూనియన్ బ్యాంక్​ ఆఫ్ స్విట్జర్లాండ్ షేర్లు కూడా 14 శాతం నష్టాన్ని చవిచూశాయి.

సిగ్నేచర్ ​బ్యాంక్​, న్యూయార్క్​ కమ్యూనిటీ బ్యాంక్ డీల్​..
సిగ్నేచర్ ​బ్యాంక్​ను కొనుగోలు విషయంలో న్యూయార్క్​ కమ్యూనిటీ బ్యాంక్​ విఫలమైంది. 2.7 బిలయన్​ డాలర్లకు వీరి మధ్య ఒప్పందం జరిగినప్పటికి.. అది విఫలమైందని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆదివారం వెల్లడించింది. 40 బ్రాంచీలు ఉన్న సిగ్నేచర్ బ్యాంక్‌.. సోమవారం నుంచి ఫ్లాగ్‌స్టార్ బ్యాంక్‌గా మారనుంది. న్యూయార్క్ కమ్యూనిటీ బ్యాంక్ అనుబంధ సంస్థలలో.. ఫ్లాగ్‌స్టార్ ఒకటి. "ఈ ఒప్పందంలో సిగ్నేచర్ బ్యాంక్ ఆస్తులలో 38.4 బిలియన్ల డాలర్ల కొనుగోలు అంశం ఉంది. ఈ బ్యాంక్ రుణాలలో 60 బిలియన్లు రిసీవర్‌షిప్‌లో ఉంటాయి. సకాలంలో వాటిని అమ్మడం జరుగుతుంది." అని ఎఫ్​డీఐసీ తెలిపింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలిన తరువాత.. సిగ్నేచర్ బ్యాంకింగ్​ వ్యవస్థ కూడా సంక్షోభంలో కూరుకుపోయింది.

Last Updated : Mar 20, 2023, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.