ETV Bharat / business

జులై 1 నుంచి క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్​.. కస్టమర్లకే బెనిఫిట్​! - క్రెడిట్ కార్డు కొత్త రూల్స్​

కొత్త క్రెడిట్​ కార్డుల జారీ, ప్రస్తుతమున్న కార్డుల అప్​గ్రేడ్ విషయంలో ఆర్​బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. బిల్లింగ్​ తేదీలు, క్రెడిట్ కార్డుల క్లోజింగ్ విషయంలోనూ మార్పులు చేసింది. వినియోగదారులకు మేలు చేసేలా ఉన్న ఈ మార్గదర్శకాలేంటి? వాటి వల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు చూద్దాం.

Credit Card New Rules
క్రెడిట్ కార్డు కొత్త నిబంధనలు
author img

By

Published : Jun 30, 2022, 4:01 PM IST

జులై 1న క్రెడిట్​ కార్డుల జారీకి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకుల నిర్ణయాలు ఏకపక్షంగా ఉండకుండా, కస్టమర్లకు మేలు చేసేలా కేంద్ర రిజర్వు బ్యాంకు వీటిని రూపొందించింది. మరి ఈ నిబంధనలు ఏంటి? వీటి వల్ల వినియోగదారులకు ప్రయోజనం ఏంటో ఇప్పుడు చూద్దాం

అనుమతి లేకుండా ఇవ్వొద్దు
ఇకపై క్రెడిట్​ కార్డులు జారీ చేసే బ్యాంకులు కొత్త కార్డులు మంజూరు చేయాలన్నా, లేదా ప్రస్తుతం ఉన్న కార్డులను అప్​గ్రేడ్ చేయాలన్నా వినియోగదారుడి అనుమతి కచ్చితంగా తీసుకోవాలి. కస్టమర్ల అనుమతి లేకుండా కొత్తకార్డులు మంజూరు చేసినా లేదా అప్​గ్రేడ్ చేసిన తర్వాత వాటికి ఛార్జీలు వసూలు చేసినా.. బ్యాంకులే ఆ బిల్లును తిరిగి వినియోగదారుడికి చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ ఛార్జీలకు రెట్టింపు మొత్తం ఫైన్​గా కస్టమర్​కే చెల్లించాలి. ఈ విషయంలో ఏమైనా ఫిర్యాదులు చేయాల్సి వస్తే కస్టమర్లు అంబుడ్స్​మన్​ను సంప్రదించవచ్చు. అంతేకాదు క్రెడిట్​ కార్డు ఉచితం అని చెప్పాక బ్యాంకులు ఎలాంటి హిడెన్ ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు.

క్లోజ్​ చేయకపోయినా ఫైన్​
క్రెడిట్​ కార్డు క్లోజ్ చేయాలని వినియోగదారులు బ్యాంకులను కోరితే.. ఏడు రోజుల్లోనే ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏడు రోజులు పూర్తయినా క్రెడిట్​ కార్డు క్లోజ్ చేయకపోతే.. 8వ రోజు నుంచి రోజుకు రూ.500 చొప్పున ఫైన్ చెల్లించాలి. ఎన్ని రోజులు ఆలస్యమైతే అన్ని రోజుల పాటు కస్టమర్​కు ఫైన్​ కట్టక తప్పదు.

బ్యాలెన్స్ మిగిలితే ట్రాన్స్​ఫర్ చేయాలి..
క్రెడిట్ కార్డు క్లోజ్ చేశాక అందులో ఇంకా బ్యాలెన్స్ ఏమైనా మిగిలితే ఆ మొత్తాన్ని వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోకి జమ చేయాలి. ఒక వేళ బ్యాంకు వివరాలు లేకపోతే.. కస్టమర్​ను అడిగి తీసుకోవాలి.

బిల్లింగ్ సైకిల్​ తేదీల్లో మార్పు
ఇకపై క్రెడిట్​ కార్డులు బిల్లింగ్ తేదీల సైకిల్​ గత నెల 11 నుంచి ప్రస్తుత నెల 10 వరకు పరిగణనలోకి తీసుకోవాలి. వినియోగదారులు ఈ బిల్లింగ్ తేదీలను మార్చుకోవాలనుకుంటే అందుకు ఒకసారి అవకాశం ఇవ్వాలి.

తప్పుడు బిల్లులు పంపొద్దు..
ఆర్​బీఐ కొత్త నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డు సంస్థలు వినియోగదారులకు తప్పుడు బిల్లులు పంపడానికి వీల్లేదు. ఒకవేళ వినియోగదారుడి నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే బిల్లుకు సంబంధించి కచ్చితమైన ఆధారాలు, పత్రాలను సంబంధిత సంస్థ 30 రోజుల్లోగా చూపించాల్సి ఉంటుంది.

ఆన్​లైన్ లావాదేవీల్లో మార్పులు..
ఆన్​లైన్​ లావాదేవీలకు సంబంధించి క్రెడిట్‌, డెబిట్​ కార్డుల విషయంలో ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఆన్​లైన్​ పేమెంట్లు చేసే సమయంలో అక్రమాలకు తావు ఇవ్వకుండా టోకనైజేషన్​ వ్యవస్థను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల కార్డు డేటాకు మరింత భద్రత ఉంటుందని తెలిపింది. ఈ నిబంధనలు కూడా జులై 1 నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు ఆర్​బీఐ గతంలో పేర్కొంది.

ఏంటీ టోకనైజేషన్?:
చెల్లింపుల వ్యవస్థలో భద్రతను మెరుగుపరచడం కోసం టోకనైజేషన్‌ను తీసుకువచ్చారు. దీని ద్వారా వాస్తవ కార్డు వివరాలకు ప్రత్యామ్నాయంగా ఒక విశిష్ట కోడ్‌ ఉంటుంది. దీనిని 'టోకెన్‌' అంటారు. ఈ టోకెన్‌లో ఎలాంటి గోప్యమైన సమాచారం ఉండదు. కేవలం కార్డుకు సంబంధించిన వివరాల గుర్తింపునకు ఇచ్చిన రిఫరెన్స్‌గా మాత్రమే పనిచేస్తుంది. ఇది అనుకోకుండా బహిర్గతమైనప్పటికీ.. ఎలాంటి ప్రమాదం ఉండదు. చెల్లింపుల సమయంలో కార్డు వివరాలకు బదులు టోకెన్ వివరాలను అందజేస్తే సరిపోతుంది. ఆ రిఫరెన్స్‌ ద్వారా కార్డు వివరాలను సరిచూసుకొని లావాదేవీని పూర్తి చేస్తుంది. ఇక్కడ వ్యాపారి వద్ద కార్డుకు సంబంధించిన ఎలాంటి వివరాలూ స్టోర్ కావు గనక మోసాలకు తావుండదు.

టోకనైజేషన్​తో​ లాభాలు:
కార్డుకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచడం వల్ల లావాదేవీలు జరిపే సమయంలో అక్రమార్కుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇకపై కార్డులకు సంబంధించిన గోప్యమైన సమాచారం టోకెన్‌ల రూపంలో భద్రంగా ఉంటుంది. దీంతో చెల్లింపుల సమయంలో వ్యాపారులకు ఎలాంటి వివరాలను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల మర్చంట్లు వాస్తవ కార్డు డేటాను నిల్వ చేసుకోవడానికి వీలుండదు. కార్డ్‌-ఆన్‌-ఫైల్‌ అనేది పేమెంట్‌ గేట్‌వే వద్ద నిల్వ అయ్యే కార్డు సమాచారం. తద్వారా భవిష్యత్‌ లావాదేవీలను ప్రాసెస్‌ చేయడానికి మర్చంట్లకు వీలవుతుంది. కార్డు టోకనైజేషన్​ అవసరం లేదు అనుకునే వినియోగదారులు వారి కార్డుకు సంబంధించిన వివరాలన్నీ లావాదేవీల సమయంలో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియంతా ఉచితంగానే చేస్తారు. టోకనైజేషన్​ పూర్తైన తర్వాత వినియోగదారుడు కార్డుకు సంబంధించిన చివరి నాలుగు అంకెలు మాత్రమే చూడగలరు.

టోకనైజేషన్​ కార్డ్స్ పొందడం ఎలా?:
టోకెన్​ కార్డ్​ కావాలి అనుకునే వారు బ్యాంకు వెబ్​సైట్​ లేదా యాప్​ ద్వారా దరఖాస్తు చేసుకొని పొందవచ్చు. ఈ టోకెన్​ను వ్యాపారి సంబంధిత క్రెడిట్​/డెబిట్​ కార్డు జారీ చేసే బ్యాంకుకు పంపిస్తారు.

ఇదీ చదవండి: బీచ్​లో కాలక్షేపానికి రూ.5లక్షల కోట్ల కంపెనీ వీడిన సీఈఓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.