ETV Bharat / business

'క్రెడిట్‌ కార్డ్' vs 'బయ్ నౌ పే లేటర్'.. రెండింట్లో ఏది బెటర్? - బీఎన్​పీఎల్ కార్డు ఉపయోగాలు

పండగలు వచ్చేస్తున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పలు ఆఫర్లూ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఇ-కామర్స్‌ దిగ్గజాలు తమ రాయితీ అమ్మకాల తేదీలనూ ప్రకటించాయి. మరోవైపు కొనుగోలుదారులూ వీటిని నిశితంగా గమనిస్తున్నారు. రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది పండగ కొనుగోళ్లు అధికంగా ఉంటాయని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డు, 'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి' (బీఎన్‌పీఎల్‌) ప్రధాన పాత్ర పోషించనున్నాయి. మరి ఈ రెండింటిలో ఏది మనకు అనుకూలమో చూద్దాం.

credit-card-buy-now-pay-later
credit-card-buy-now-pay-later
author img

By

Published : Sep 18, 2022, 5:12 PM IST

చాలామంది కొత్త రుణగ్రహీతలకు క్రెడిట్‌ స్కోరు ఉండదు. క్రెడిట్‌ కార్డులూ ఉండవు. ఇలాంటి వారినే లక్ష్యంగా చేసుకొని, ఫిన్‌టెక్‌ సంస్థలు బీఎన్‌పీఎల్‌ (బయ్ నౌ, పే లేటర్) సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పటికిప్పుడు డబ్బుతో అవసరం లేకుండా.. ఇప్పుడు కొని, నిర్ణీత వ్యవధిలోగా చెల్లించడమే ఈ బీఎన్‌పీఎల్‌. యాప్‌లలో ముందుగానే రుణ పరిమితి నిర్ణయిస్తారు. ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు మీ రుణ పరిమితి మేరకు చెల్లిస్తారు. 15-45 రోజుల్లోగా బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క రోజు ఆలస్యమైనా రుసుములు తప్పవు. పైగా క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

సాధారణంగా క్రెడిట్‌ కార్డులు ఉద్యోగులు, క్రెడిట్‌ స్కోరు బాగున్న వారికి ఇస్తుంటాయి బ్యాంకులు. దీనితో చెల్లించినప్పుడు 45-50 రోజుల వరకూ వ్యవధి లభిస్తుంది. ఆలస్యం చేసినప్పుడు గరిష్ఠంగా 45 శాతం వరకూ వార్షిక వడ్డీ వసూలు చేస్తాయి.
ముందే అనుకున్నట్లు బీఎన్‌పీఎల్‌ సంస్థలు రుణగ్రహీతల క్రెడిట్‌ స్కోరును పట్టించుకోవు. అందుకే, ఇటీవల కాలంలో వీటికి ఆదరణ బాగా పెరిగింది. కానీ, చెల్లింపులు ఆలస్యం చేస్తే మాత్రం ఇవి క్రెడిట్‌ స్కోరును దెబ్బతీస్తాయి. ఒక్కసారి స్కోరు తగ్గితే.. పెంచుకోవడం కష్టమవుతుంది.

ఆ అవకాశం లేదు..
క్రెడిట్‌ కార్డులో కనీస మొత్తం చెల్లింపు అవకాశం ఉంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించకుంటే.. బ్యాంకులు ఆలస్యం రుసుములను విధిస్తాయి. పెద్ద బిల్లులను ఈఎంఐగా మార్చుకునేందుకూ వీలుంటుంది. బీఎన్‌పీఎల్‌లో ఈ అవకాశం లేదు.
ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలన్నది నిర్ణయించుకునే ముందు మీ ఆర్థిక అంశాలను ఒకసారి పరిశీలించండి.

ఖరీదైన వస్తువును కొని, వాయిదాల్లో చెల్లించాలి అనుకున్నప్పుడు క్రెడిట్‌ కార్డును వాడుకోవచ్చు. ఇలాంటప్పుడు బీఎన్‌పీఎల్‌తో అంత వెసులుబాటు దొరకదు. స్వల్పకాలానికి రుణం తీసుకొని, వస్తువును కొని, వెంటనే ఆ రుణం తీరుస్తామని భావిస్తే ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.