ETV Bharat / business

'అమెజాన్​లో 11.6 లక్షల ఉద్యోగాలు!'

author img

By

Published : May 15, 2022, 4:52 PM IST

Amazon jobs: భారత్​లో ఇప్పటివరకు 11.6 లక్షల ఉద్యోగాలను సృష్టించినట్లు అమెజాన్​ సంస్థ తెలిపింది. కేవలం గతేడాది 1,35,000 ఉద్యోగాలను కల్పించింది ఈ సంస్థ. వ్యాపార రంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే టెక్నాలజీ, టూల్స్​ వంటివి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని సంస్థ ప్రతినిధి తెలిపారు.

amazon
అమెజాన్

Amazon jobs: దేశంలో ఇప్పటివరకు 11.6 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించామని ప్రముఖ ఈ-కామర్స్​ సంస్థ అమెజాన్​ ఇండియా వెల్లడించింది. ఎగుమతుల విలువను 5 బిలియన్​ డాలర్లకు పెంచడం సహా 40 లక్షలకుపైగా ఎమ్​ఎస్​ఎంఈలను డిజిటలైజ్​ చేశామని పేర్కొంది. అమెజాన్​ సంభవ్​ పేరుతో 2020 జనవరిలో జరిగిన వార్షికోత్సవంలో.. '2025 నాటికి దేశంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తాము. అంతేకాదు ఎగుమతులను 10 బిలియన్​ డాలర్లకు, కోటికిపైగా ఎమ్​ఎస్​ఎంఈలను డిజిటలైజ్​ చేస్తాం' అని అమెజాన్​ వాగ్దానం చేసింది.

ఈ క్రమంలో ఆ ప్రకటనకు సంబంధించి ఇప్పటివరకు తాము చేపట్టిన చర్యలపై అమెజాన్​ ఆదివారం వివరాలను వెల్లడించింది. అమెజాన్​ పేర్కొంటున్న 11.6 లక్షల ఉద్యోగాల్లో కొన్ని నేరుగా సంస్థలో పనిచేసేవి కాగా మరికొన్ని దానికి అనుబంధంగా ఉండే రంగాలకు చెందినవి. డెలివరీ, లాజిస్టిక్స్​, రవాణా, ప్యాకేజింగ్​ మొదలైనవి ఈ కోవకు చెందినవే. గతేడాది జరిగిన వార్షికోత్సవంలో అమెజాన్​ సంభవ్​ వెంచర్​ పేరుతో వెంచర్​ క్యాపిటల్​ను కూడా ప్రారంభించింది. సాంకేతిక అభివృద్ధిపై దృష్టి సారించే స్టార్టప్స్​లో పెట్టుబడులు పెడతామని పేర్కొంది. ఇప్పటికే మైగ్లామ్​, ఎం1ఎక్స్​ఛేంజ్​, స్మాల్​ కేస్​ మొదలైన సంస్థల్లో పెట్టుబడి పెట్టింది.

'దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈలతో కలిసి పనిచేస్తున్నాము. కాబట్టి భారత్​లో వ్యాపార రంగం వృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించే టెక్నాలజీ, టూల్స్​ వంటివి అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నాము' అని అమెజాన్​ ప్రతినిధి పేర్కొన్నారు. కేవలం గతేడాదిలో అమెజాన్.. ఐటీ, ఈ-కామర్స్​, లాజిస్టిక్స్​, తయారీ, కంటెంట్​ క్రియేషన్, స్కిల్​ డెవలప్మెంట్​ వంటి రంగాల్లో 1,35,000 లక్షల ఉద్యోగాలను సృష్టించింది.

ఇదీ చూడండి : ఆ రోజు చనిపోతాననుకున్నా: గౌతమ్​ అదానీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.