ETV Bharat / business

ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నాక.. పరిహారం కోసం వేచి చూడాల్సిందేనా..! - బీమా పాలసీ కాల వ్యవధులు

ప్రస్తుత కాలంలో మనిషికి బీమా అనేది చాలా ముఖ్యం. అనారోగ్య సమస్యలు ఏ రూపంలో ఎప్పుడయిన రావచ్చు. అలాంటి సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడేవి బీమాలే. మరి బీమా తీసుకునేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు, దానిలో ఉండే నిబంధనలు, కాల వ్యవధుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దామా మరి..!

complete information about health insurence waiting period
ఆరోగ్య బీమా నిరీక్షణ కాలం
author img

By

Published : Jan 21, 2023, 8:50 AM IST

ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా ఎంతో కీలకం. సమగ్రమైన పాలసీ ఉన్నప్పుడు అనారోగ్యంలోనూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా చూసుకోవచ్చు. పాలసీ తీసుకునేటప్పుడు అందులో ఉండే నిబంధనలేమిటో స్పష్టంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా వేచి ఉండాల్సిన వ్యవధి (వెయిటింగ్‌ పీరియడ్‌) గురించి మర్చిపోవద్దు. ఆరోగ్య బీమా పాలసీని తీసుకున్న ఏ చికిత్సకైనా పరిహారం వస్తుందని చాలామంది భావిస్తుంటారు. ప్రమాదంలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇది వర్తిస్తుంది. నిర్ణీత వ్యాధుల విషయానికి వచ్చే సరికి నిబంధనలు మారిపోతుంటాయి. కొంతకాలం తర్వాతే ఆ వ్యాధుల చికిత్సకు పరిహారం లభిస్తుంది. పాలసీ ప్రారంభమైన వెంటనే ఈ వేచి ఉండే వ్యవధి అమల్లోకి వస్తుంది. ఈ వ్యవధులు వ్యాధులను బట్టి, మారుతూ ఉంటాయి.

ప్రారంభంలో: ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న వెంటనే ఆసుపత్రిలో చేరితే చికిత్స ఖర్చులను చెల్లించదు. ప్రారంభంలో కొంత నిరీక్షణా కాలం ఉంటుంది. దీన్ని కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌గా చెప్పుకోవచ్చు. పాలసీ ప్రయోజనాలు పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యేందుకు కనీసం 30 రోజులు ఆగాల్సిందే. ఈ వేచి ఉండే వ్యవధిలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు పరిహారం అందదు. ప్రమాదాలు జరిగినప్పుడు వేచి ఉండే వ్యవధి అనే నిబంధన వర్తించదు. పాలసీ తీసుకున్న క్షణం నుంచే దీనికి పరిహారం అందుతుంది.

ముందస్తు వ్యాధులు: పాలసీ తీసుకునే నాటికే ఉన్న కొన్ని వ్యాధులు ఉంటే వాటి చికిత్సకు అయ్యే ఖర్చును వెంటనే చెల్లించవు. వీటిని ముందస్తు వ్యాధులుగా బీమా సంస్థ పరిగణిస్తుంది. రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్‌, ఉబ్బసంవంటి వ్యాధులు సాధారణంగా ఈ జాబితాలో ఉంటాయి. వీటి చికిత్స ఖర్చుల కోసం కనీసం 2-4 సంవత్సరాల వరకూ వేచి చూడాలి.

వ్యాధులను బట్టి: హెర్నియా, కంటిశుక్లం, మోకీళ్ల మార్పిడి వంటి శస్త్రచికిత్సలకు పాలసీ వర్తించాలంటే బీమా సంస్థలు ప్రత్యేక వేచి ఉండే వ్యవధిని నిర్ణయించాయి. ఈ వ్యవధి 2-4 ఏళ్ల వరకూ ఉండొచ్చు. బీమా పాలసీ పత్రంలో ఈ ఆనారోగ్యాల జాబితా ఉంటుంది. ఏ వ్యాధికి ఎంత కాలం వేచి చూడాల్సి ఉంటుందన్న అంశమూ అందులో పేర్కొంటుంది. దీన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి.

తగ్గించుకోవచ్చా?: వేచి ఉండే వ్యవధిని తగ్గించుకునేందుకు ఏదైనా మార్గం ఉందా అని ఆలోచిస్తున్నారా? దీనికి కొన్ని మార్గాలున్నాయి. దీనికోసం కొంత అదనపు ప్రీమియాన్ని చెల్లించాల్సి వస్తుంది. బీమా సంస్థ, పాలసీ రకాన్ని బట్టి, వ్యవధి ఎంత మేరకు తగ్గుతుందనేది ఆధారపడి ఉంటుంది. బీమా సంస్థతో ముందుగా మాట్లాడాకే నిర్ణయం తీసుకోండి. ఆరోగ్య బీమా పాలసీని తీసుకునేటప్పుడు పాలసీ పత్రాన్ని నిశితంగా పరిశీలించాలి. పాలసీదారులకు సులభంగా అర్థమయ్యేలా వేటికి వర్తిస్తుంది, వేటికి వర్తించదు, నిబంధనలు, షరతులు స్పష్టంగా ఉంటాయి. అనుమానాలుంటే బీమా సంస్థ సహాయ కేంద్రాన్ని సంప్రదించాలి.

ప్రసూతి ఖర్చులు: కొన్ని బీమా పాలసీలు ప్రసూతి ఖర్చులూ చెల్లిస్తాయి. పాలసీ తీసుకున్న 9 నెలల నుంచి ఆరేళ్ల వరకూ వేచి ఉండే సమయం నిబంధన విధిస్తాయి. మీ పాలసీలో ఉన్న నిబంధన చూసుకోండి. వేచి ఉండే సమయం దాటిన తర్వాతే ప్రసూతి ఖర్చులకు క్లెయిం దాఖలు చేయగలరు. బీమా నియంత్రణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. మానసిక అనారోగ్యానికీ బీమా వర్తిస్తుంది. దీని చికిత్స కోసం సాధారణంగా రెండేళ్లపాటు వేచి చూడాలని బీమా సంస్థలు పేర్కొంటున్నాయి. బీమా సంస్థలను బట్టి, ఈ వ్యవధి మారుతుంది. పాలసీ పత్రంలోనే ఈ వివరాలు సరిచూసుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.