ETV Bharat / business

పెరిగిన సిమెంట్​ ధరలు.. సామాన్యులకు మరింత భారం

Cement Price: సిమెంట్​ బస్తా ధర పెరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో 50 కిలోల బస్తాపై రూ.20-30 పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు ఈ నెల 2 నుంచే అమల్లోకి వచ్చాయని, ముడి పదార్థాల అధిక ధరలతో పాటు ఇంధన వ్యయాలు పెరగడమే ఇందుకు కారణమని వివరించాయి.

CEMENT RATES HIKE
CEMENT RATES HIKE
author img

By

Published : Jun 3, 2022, 7:15 AM IST

Cement Price Hike: దక్షిణాది రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంటు బస్తా ధరను రూ.20-30 మేర పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 2 నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ముడి పదార్థాల అధిక ధరలతో పాటు ఇంధన వ్యయాలు పెరగడమే ఇందుకు కారణమని వివరించాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బస్తాపై రూ.20 పెంచగా, తమిళనాడులో రూ.20-30 మధ్య పెరిగింది. కర్ణాటకలో బ్రాండ్‌, ప్రాంతం ఆధారంగా ధరల పెంపు వేర్వేరుగా ఉందని తెలుస్తోంది. ధర పెరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో సిమెంట్‌ బస్తా ధర రూ.320-400 మధ్య, తమిళనాడు, కర్ణాటకల్లో రూ.360-450కు చేరింది.

* ధరలు పెంచిన సంస్థలు ఇవే: అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండియా సిమెంట్స్‌, కేసీపీ, ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌, సాగర్‌ సిమెంట్స్‌, దాల్మియా భారత్‌, శ్రీ సిమెంట్‌, రామ్‌కో సిమెంట్స్‌, ఓరియంట్‌ సిమెంట్‌
* ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్‌లోనే ధరలు పెంచాలని చూసినా, కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో డీలర్లు వ్యతిరేకించారు. దీంతో కంపెనీలు అప్పుడు వెనక్కి తగ్గాయి. గత 3 రోజులుగా సిమెంట్‌ కంపెనీలు డీలర్లకు సరఫరాలు నిలిపి, ఇప్పటికే ఉన్న పాత స్టాక్‌ విక్రయించాల్సిందిగా సూచించాయి. కొత్త ధర ప్రకారం, సరఫరాను గురువారం సాయంత్రం నుంచి ప్రారంభిస్తాయని డీలర్లు తెలిపారు.

ఇవీ చదవండి: సామాన్యులకు కేంద్రం షాక్​.. గ్యాస్‌ సబ్సిడీకి మంగళం3

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.